యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 63

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 62

ప్రతివాది భయంకరం అణ్ణా ఆ వేంకటేశ్వరుని తిరువారాధన కొరకై తిరుమంజనం (జలం) తీసుకుని వచ్చే కైంకర్యాన్ని చేస్తుండగా, ఒక శ్రీవైష్ణవుడు కోయిల్ (శ్రీరంగం) నుండి ఆ శ్రీనివాసుని సేవించుకునేందుకు తిరుమలకు వచ్చాడు. పెరుమాళ్ళను సేవించుకొనుటకై వారికి శుద్ధ పవిత్ర జలం సేకరించుటలో వారికి సహకరించారు. రోజంతా అతని పక్కనే ఉండి, శ్రీరంగం ఆలయంలో జరిగే సేవల గురించి, పెరుమాళ్లకు అందించే ప్రసాదాల గురించి, ఆలయ ఉత్సవాల గురించి, మణవాళ మాముణుల సాటిలేని మహిమలను గురించి అడిగి తెలుసుకున్నారు. మరుసటి రోజు ఆకాశ గంగ నుండి పెరుమాళ్ళ తిరువారాధనం కోసం జలాన్ని తీసుకురావడానికి వెళ్లినప్పుడు, శ్రీవైష్ణవుడిని తనతో పాటు తోడుగా తీసుకువెళ్ళారు. “శృణోమ్యహం ప్రీతికరం మమ నాథస్య కీర్తనం” (నన్ను సంతృప్తిపరిచే నా స్వామి మహిమలను వింటున్నాను) అని చెప్పినట్లుగానే, అద్భుతమైన మహిమలు కలిగి ఉన్న మణవాళ మాముణుల దినచర్య గురించి చెప్పమని ఆ శ్రీవైష్ణవుడిని అభ్యర్తించారు. వారు ఇవే ఆలోచనల్లో ఉండగా, తిరుమంజనం కోసం జలం తెచ్చి, యాలకలు, లవంగం, కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్య పొడులను వేయబోతుండగా, ఒక ఏకాంగి (జీయర్‌ వెంట ఉండే సహచరుడు, సాధారణంగా బ్రహ్మచారి) పరుగు పరుగు వచ్చి, ఆ కుండను లాగేసుకున్నాడు. తిరుమంజనంలో ద్రవ్యాలు ఇంకా కలపలేదు” అని అణ్ణా వారితో అన్నారు. అతను మాట వినకుండా ఆ జలంతో యథావిధిగా తిరుమంజనానికి సమర్పించాడు. అణ్ణా గాబరాపడి ఒక పాత్రలో సుగంధ పదార్థాలను తీసుకువెళ్లి, అర్చకునితో “ఒక అపచారం జరిగింది” అని అన్నారు. ఆ అర్చకుడు పారవశ్యంతో “ఈ వేళ జలం ఎన్నడూ లేనంత సుగంధ భరితంగా ఉన్నాయి, సువాసన అద్భుతంగా ఉంది!” అని అన్నారు. అణ్ణా భావజ్ఞులు కనుక “ఇది ఏదో అనుకోకుండా జరిగినది కాదు; ఆనందం పొంగిపొర్లుతోంది. దీనికి కారణం జీయర్ మహిమల శ్రవణం చేసినందుకు మాత్రమే జరిగింది” అని భావించారు. ఆ శ్రీవైష్ణవులను పిలిచి ఇలా అన్నాడు: “దేవర్వారు మణవాళ మాముణుల మహిమలను చెప్పినందున, అడియేన్ వినే భాగ్యం కలిగింది. అప్పన్ (తిరువేంకటేశ్వరుడు) దివ్య మనస్సు కూడా ఎంతో ఆనందించింది. అడియేన్ వెంటనే మాముణులను సేవించుకోవాలి” అని అన్నారు. అప్పన్ (తిరువేంకటేశ్వరుడు) కూడా సంతోషించి అతనికి అనుమతి ఇచ్చాడు.

తరువాత, కొంత సమయం తిరుమంజన కైంకర్యం నిర్వహించి, ఆ వేంకటేస్వరుని అనుమతితో, అణ్ణా తన కుటుంబ సమేతంగా శ్రీరంగానికి బయలుదేరారు. శ్రీరంగం చేరుకోగానే, తదేకంగా ఆ దివ్య దేశాన్ని చూస్తూ సాష్టాంగ నమస్కారం చేసారు. వారు స్నానం ఆచరించి, ఊర్ధ్వపుండ్రాలు ధరించి శ్రీరంగనారాయణ జీయర్ మఠానికి వెళ్ళారు. వారు అన్ని సన్నిధులను సరైన క్రమంలో సేవించుకుంటూ ఆలయానికి వెళ్ళారు. జీయర్ తిరువాయ్మొళి 4.10వ పాశురం “ఒన్ఱుం దేవుం” పదిగ పరిచయంపై ఉపన్యాసం ఇస్తున్నారు. ఆనందభరితుడై, జీయర్ ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. జీయర్ “మీరు ప్రతివాది భయంకరం అణ్ణానా ” అని అడిగారు, “ఇంత కాలం తరువాత దేవర్వారి దర్శనం కలిగింది” అని పలుకుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని, అణ్ణాని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత వారిని తమ పక్కన కూర్చోబెట్టికుని, ఉపన్యాసం కొనసాగించారు. జీయర్ మూడు పాశురాల వివరణను పూర్తి చేసి, ఆపివేసిన తరువాత, అణ్ణా “దేవర్వారి దివ్య తిరువడి సంబంధం లేకుండా, ఆళ్వార్లు స్థాపించిన భగవాన్ ఆధిపత్యాన్ని తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు” అని జీయరుని కీర్తించారు. జీయర్ అణ్ణా చేయి పట్టుకుని పెరుమాళ్ళను సేవించుటకై బయలుదేరారు. తీర్థ శఠారీలు అందించిన తరువాత పెరుమాళ్ళు అర్చక ముఖేన “స్వాగతం ప్రతివాది భయంకరాచార్య! ఎంతో అంకితభావంతో తిరుమలలో తిరుమంజనం కైంకర్యం నిర్వహిస్తున్నావు. ఒకరోజు, మీరు మణవాళ మాముణుల మహిమలను వింటున్నందున, ఆ జలం శుద్ధి అయ్యి, దివ్య పరిమళాన్ని పొందింది. దానికి మేము ఎంత ఆనందించామోనని అనుకుంటూ వచ్చావు కదా! మేము నీకు విశిష్టమైన సంబంధాన్ని అనుగ్రహిస్తున్నాము” అని చెప్పి అణ్ణాని జీయర్ దివ్య చేతులకు అప్పగించారు. అనంతరం వారు మఠానికి చేరుకున్నారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/18/yathindhra-pravana-prabhavam-63-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment