యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 66

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 65

కచ్చిలో శాశ్వతంగా ఉండిపోమని అప్పాచ్చియారణ్ణాను ఆదేశించుట

అక్కడ చేరిన ప్రముఖులందరూ ఇలా అన్నారు, “జీయర్ కృపతో ఇక్కడే ఉండి మంగళాశాసనము చేసినందున, పెరుమాళ్ళ దివ్య వైకాసి మహోత్సవాం వైభవంగా జరిగింది” అని జీయర్‌ తో అన్నారు. తరువాత జీయర్ వారికి అనేక సూచనలను అందించారు. నియమం తప్పకుండా నిర్వహించాల్సిన కార్యముల గురించి, ఒకరి పట్ల మరొకరు ఎలా అనురాగంతో మెలగాలి, దివ్యప్రబంధాలతో పూర్తిగా ఎలా ఇమిడి ఉండాలో వాళ్ళకి తెలియజేశారు. అందరూ “ఇవన్నీ జరగాలంటే, ఇక్కడ ఉండి మమ్ములను శాశ్వతంగా సరిదిద్దేల ఒకరిని దేవర్వారు పురమాయించాలి” అని ఏకకంఠంగా అందరూ అన్నారు. ఇది విన్న జీయర్ ఎంతో సంతోషించారు. వారు వానమామలై జీయరుని పిలిచి, అప్పాచ్చియార్ అణ్ణాను తీసుకురమ్మని చెప్పారు. వానమామలై జీయర్ అప్పాచ్చియార్ అణ్ణాను తీసుకువస్తుండగా, జీయర్ అణ్ణాను చూపించి “మీరు మమల్ని ఎలా గౌరవించారో అదే విధంగా వీరితో కూడా వ్యవహరించండి” అని చెప్పి, అణ్ణాతో “మీరు ముదలియాండాన్ దివ్య వంశస్థులు కాబట్టి, ఆండాన్ (ముదలియాండాన్), తోళప్పర్ మొదలైన ఆ వంశం పెద్దలను గర్వించేలా చేయండి. మా మాటను అనుసరించి ఇక్కడి వారికి ఏది మంచిదో అది ఉపదేశించండి. మంగళాశాసనపరరుగా (దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయువారు) శాశ్వతంగా ఇక్కడే ఉండండి” అని చెప్పి అప్పాచ్చియార్ను ఆశీర్వదిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.

శ్రేయంసి కరిశైలేంద్రః కరుణా వరుణాలయః
తోదుహ్యాద్వారధమః శ్రీమాన్ అర్థినాం నిధిరవ్యయః

(తనను ఆశ్రయించిన వారికి నిధి, కరుణా సాగరుడు, హస్తిగిరికి నాయకుడు, శ్రీమాన్ అయిన పెరుమాళ్ తమ కృపను మీపై కురిపించుగాక)

తిరుక్కడిగై, ఎఱుంబి మార్గాన తిరుమలకి బయలుదేరిన జీయర్

ఎఱుంబి అప్పాతో పాటు జీయర్ బయలుదేరి దారిలో తిరుపుట్కుళిలో పుట్కుళి పోరేఱు (తిరుపుట్కుళి భగవానుని తిరునామము) ని సేవించుకొని, తిరుక్కడిగై (ప్రస్తుత షోలింగపురం) ని దర్శించుకున్నారు, ఈ క్రింది శ్లోకములో చెప్పినట్లుగా..

గడికాచల శేకరం తతో నరసింహం నయనేననిర్విశన్
ఉదజీవయదర్శ్రితైరజనైరవనీం దామపనీతపందనైః

(అనంతరం, విశాల కడిగై కొండల శిఖరాభరణంలా ఉన్న నరసింగ పిరాన్ (నరసింహ స్వామి) దివ్య దర్శనాన్ని పొందారు. ఈ సంసారంతో తమ సంబంధాన్ని తెంచుకున్న కొంతమంది వచ్చి వారి దివ్య పాదాల యందు ఆశ్రయం పొందారు). తరువాత వారు తక్కన్ కులం (పుష్కరిణి) “వండు వళం కిళరుం నీళ్ శోలై వణ్పూంగడిగై” (కడిగైలోని అందమైన దివ్య కొండలలో తుమ్మెదల సమూహాలు విహరించే విశాల తోటలు కలిగి ఉన్నాయి) వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎమ్పెరుమాన్ దివ్య పాదాలను సేవించుకున్నారు; దగ్గరలోని గ్రామాల నుండి అనుకూలర్లుగా (తగిన వారు) వచ్చిన వారిపై తమ కృపను కురిపించి, తమ తిరువడి సంబంధాన్ని వారికి అనుగ్రహించారు. అనంతరం, ఈ పాశురంలో చెప్పినట్లుగా “మిక్కార్ వేదవిమలర్ విళుంగుం అక్కారక్కని” (అక్కాక్కని (చక్కెర వంటి పండులోని విత్తనం) అని కూడా పిలువబడే భగవానుని ఏ దోషములేని వేద పండితులచే మ్రింగబడతాడు) అని అన్నట్లు సంతోషంగా వారు కడిగై కొండలను ఎక్కి, తిరుప్పల్లాండు పాశురమును సేవిస్తూ మంగళాశాసనము చేసి “అందియం పోదిల్ అరి ఉరువాగి అరియై అళిత్తవనై ప్పందనై తీర ప్పల్లాండు పల్లాయిరత్తాండెన్ఱు పాడుదమే” (భక్త రక్షణ, శత్రు నాశనం చేయుటకై సంధ్యా సమయములో సింహ రూపములో అవతరించిన ఆ భగవానుని గురించి పాడదాము). వారు ఎఱుంబికి వెళ్లి అక్కడి వాళ్ళపై తమ కృపను కురిపించి, ఆ పట్టణానికి వడతిరువరంగం (ఉత్తర శ్రీరంగం) అనే దివ్య నామాన్ని అనుగ్రహించారు. ఆ ప్రదేశంలో నివసించే వాళ్ళను వారు అళగియ మణవాళ దాసులు (శ్రీరంగంలోని పెరుమాళ్ పేరు అళగియ మణవాళన్. వారి సేవకులు) అని సంబోధించారు. అలా వారు తిరుక్కడిగై సమీపంలో ఒక శ్రీరంగాన్ని సృష్టించారు. వాణ్పూంగడిగై మరియు పణ్డెల్లాం మధ్య సంబంధం ఉన్నందున (మూన్ఱాం తిరువందాది 61వ పాశురం), [తిరుక్కడిగైలో తమ దర్శనాన్ని పూర్తి చేసిన తర్వాత] రత్నాభరణమును సేవించాలని ఆశించారు (ఇక్కడ తిరువేంకటేశ్వరుని సూచిస్తుంది). “దేవం దివ్యం శేషశైలేసంతం తద్పదాబ్జం వీక్షితుం” అని చెప్పినట్లుగా, తిరుమలలో నివాసమున్న ఆ భగవానుని దివ్య పాదాలను సేవించుటకు మొదట వారు తిరుపతి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ ఆచార్యపురుషులు కొందరు వారికి స్వాగతం పలికారు. తిరుపతిలో మొదట ఎమ్పెరుమానార్ (రామానుజులు) తిరువడిని సేవించుకొనిన పిదప వారు రామానుజులచే ప్రతిష్టించబడిన గోవిందరాజులను దర్శించుకోడానికి వారి సన్నిధికి వెళ్ళారు. గోవిందుని గుణగణాలను కొనియాడుతూ మంగళాశాసనం చేశారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/22/yathindhra-pravana-prabhavam-66-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment