యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 71

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 70

తిరుమంగై ఆళ్వారుకి మంగళాశాసనం చేసిన తర్వాత, తిరుమంగై ఆళ్వారుకి అత్యంత ప్రియమైన వాయలాలి మణవాళన్ (తిరువాలి తిరునగరి ఎమ్పెరుమాన్) ను జీయర్ దర్శించుకున్నారు. ఆ తర్వాత కరుణాపూర్వకంగా వారు తిరుమణంగొల్లై [తిరుమంగై ఆళ్వారుకి పెరుమాళ్ళు తిరుమంత్రం ఉపదేశించిన చోటు) చేరుకొని ఈ క్రింది పాశురాన్ని పఠించారు:

ఈదో తిరువరసు? ఈదో మణంగొల్లై?
ఈదో ఎళిలాలి ఎన్నుమూర్? – ఈదోదాన్
వెట్టుంగలియన్ వేలై వెట్టి నెడుమాల్
ఎట్టెళుత్తుం పఱిత్తవిడం 

(ఇది పవిత్ర రావి వృక్షమా? ఇది తిరుమణంగొల్లై? తిరువాళి అని పిలవబడే అందమైన ప్రదేశమా? తిరుమంగై ఆళ్వార్ తమ బల్లెము చూపించి ప్రజలను బెదిరించి, తిరుమాళ్ (సర్వేశ్వరిని) నుండి తిరుమంత్రం (అష్టాక్షరి) ని బలవంతంగా లాక్కున్న ప్రదేశమేనా ఇది)).

జీయర్ తమ దివ్య మనస్సులో తిరుక్కణ్ణపురానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు, దీనిని తిరుమంగై ఆళ్వార్ తన పెరియ తిరుమొళిలో “నీణిలా ముఱ్ఱత్తు నిన్ఱవళ్ నోక్కినాళ్ కాణుమో కణ్ణపురం ఎన్ఱు కాట్టినాళ్” (పరకాల నాయకి {తిరుమంగై ఆళ్వార్ నాయికా భావంలో} మిద్దెపై నుంచి దూరంగా తిరుక్కణ్ణపురం ఆలయాన్ని చూసి, ఆశ్చర్యంపోయి ఇదే తిరుక్కణ్ణపురమని తమ స్నేహితులకు చూపించింది.) జీయర్ వెంటనే గొప్ప కోరికతో బయలుదేరి తిరుక్కణ్ణపురాన్ని చేరుకున్నారు. చక్కటి అవయవ సౌందర్యంతో నల్లని కొండలా కనిపించే సౌరిరాజు [తిరుక్కణ్ణపురం ఉత్సవ పెరుమాళ్పే] ని దర్శించుకున్నారు. క్కణ్ణపురత్తాన్ (తిరుక్కణ్ణపురం పెరుమాళ్) పెరుమాళ్ళని దాసుడని గుర్తింపు పొందిన తిరుమంగై ఆళ్వార్ల విగ్రహాన్ని దయతో జీయర్ అక్కడ ప్రతిష్టించారు. తరువాత వారు తిరునఱైయూరుకి వెళ్లి నంబిని (సర్వ గుణ సంపూర్ణుడైన తిరునఱైయూర్ నంబి పెరుమాళ్), నచ్చియారుని దర్శించుకున్నారు. తరువాత ఎర్రటి మణులకు నిధి అయిన తిరుక్కుడందై (ప్రస్తుత కుంభకోణం) చేరుకున్నారు, అక్కడ ఆరావముదాళ్వార్ (అక్కడి పెరుమాళ్ళు) యొక్క ఎరార్ కోలత్తిరువురువు (సుందరమైన దివ్య స్వరూపం) ని దర్శించుకున్నారు. అక్కడి నుండి బయలుబేరి ‘తిరుమాల్ సెన్ఱు శేర్విడం’ (ఎమ్పెరుమాన్ నివాసమున్న దివ్య ప్రదేశం) అని పాడబడిన ‘తెన్ తిరుప్పేర్’ చేరుకుని తిరుప్పేర్ నగరాన్ దివ్య తిరువడిని సేవించుకున్నారు. ఆ క్రింది శ్లోకంలో వర్ణించబడింది.

దివ్యాని తత్రనగరాణి దిగంతరాళేర్ దేవేనయాని హరిణా విషయీకృతాని
సత్యం త్వదీక్షణ సమర్థ మహోత్సవాని ధన్యాని తాని జగతశ్శమయంత్వకాని

(పెరుమాళ్ళు కొలువై ఉన్న దివ్య దేశాలన్ని, మీ కటాక్షంతో, ఆ దివ్య దేశాలలో విశిష్టమైన ఉత్సవాలు జరపబడుతున్నాయి, ఆ దివ్య దేశాలలన్నీ మన పాపాలను తొలగిస్తాయి), వారు దయతో వివిధ దివ్య దేశాలకు వెళ్లి మంగలాసాసనాలు చేశారు. “ఏషబ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే సీతమిలహ్రతం” (వేసవి కాలంలో చెరువులో మునక వేసినట్లే నేను పరబ్రహ్మంలో లీనమై ఉన్నాను) అని చెప్పినట్లుగా, వారు దయతో శ్రీరంగానికి బయలుదేరారు.

పెరుమాళ్ కోయిల్ లో అప్పాచ్చియారణ్ణ ను నియమించుట

ఆ తర్వాత తమ నివాసస్థలమైన శ్రీరంగం చేరుకుని పెరుమాళ్ళను సేవించుకున్నారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పబడింది.

చిత్రాణి దీప్తర రత్నవిభూషణాని ఛత్రాణి చామరయుగం వ్యజనాశనాని
తన్నామలాంచగనయ్ తాని తతౌ తదైవ రంగాధిపాయ దయితా సహితాయతస్మై 

(అళగియ మణవాలన్ అనే దివ్యనామంతో పాటు దివ్య శంఖ చక్రాలను, అద్భుతమైన, ప్రకాశవంతమైన, రత్నాలతో పొదిగి ఉన్న దివ్యాభరణాలను; దివ్య శ్వేత గొడుగులను; అలంకార సింహాసనాలను పెరియ పిరాట్టితో కూడి ఉన్న ఆ అళగియ మణవాలనుడికి లొబడి ఉన్నారు), అతను పెరుమాళ్ళ కోసమై తమ వెంట తీసుకెళ్లిన సమర్పణలను [దివ్య దేశ యాత్రా సమయంలో సమర్పించిన] సమర్పించారు – దివ్యాభరణాలు, దివ్య తెల్లని గొడుగులు, చామర, దివ్య వింజామర, కెంపులు పొదిగబడిన తివాచీ, దివ్య దిండ్లు మొదలైనవి పెరుమాళ్ళకు సమర్పించుకొని మంగళాశాసనం చేసి వినయంగా నిలబడ్డారు. పెరుమాళ్ళు వారికి తీర్థ శఠారీలు మొదలైనని అందించి, ఆలయ పరిచాలకులను, నంబిని (ప్రధాన అర్చకులు) మణవాళ మాముణులకు తోడుగా తమ మఠం వరకు వెళ్ళమని ఆదేశించాడు. పెరుమాళ్ళు నంబిని అష్టాదశవాద్యాలతో (పద్దెనిమిది రకాల సంగీత వాయిద్యాలు) మహోత్సవ రూపంలో ఊరేగింపుగా వెళ్ళమని ఆదేశించాడు. జీయర్, తమ మఠానికి చేరుకున్న తర్వాత అప్పిళ్ళైని, తిరువాళి ఆళ్వార్ పిళ్ళైని, అక్కడ ఉన్న ఇతర ప్రముఖులను, శ్రీవైష్ణవ కైంకర్యపరర్లపై తమ కృపను కురిపించారు. వివిధ దివ్య దేశాలనుండి వారు తెచ్చిన తీర్థ ప్రసాదాలను వారందరికీ దయతో అందించారు.

తరువాత జీయర్ ముందు చెప్పినట్లుగా అప్పాచ్చియారణ్ణాను పిలిచి, పెరుమాళ్ కోయిల్ (కాంచిపురం) లో కైంకర్యం చేయమన్నారు. అప్పాచ్చియారణ్ణా సంకోచించి “ఈ సేవను, ఈ గోష్ఠిని వదలడం సాధ్యమా?” అని జీయరుని అడిగారు. జీయర్ అతని చేయి పట్టుకుని, సన్నిధి లోపలికి తీసుకెళ్లి, ‘రామాసుశన్’ అను నామంతోనున్న ఒక రాగి బిందెను అతనికి ఇచ్చారు. జీయర్ వాడిన ఈ బిందెను వానమామలై జీయర్ తమ బుట్టలో ఉంచుకునేవారు. ఆ బిందెపైన చెక్కిన ‘రామానుశ’ నామము, శంఖ చక్రాలు కాలక్రమేణ అరిగిపోయి ఉన్నాయి. ఆ కడవను ఉపయోగించి తనను పోలిన రెండు విగ్రహాలు తయారు చేసి ఒకటి ఆచార్యులకు సమర్పించి, మరొకటి తమ వద్ద ఉంచుకోమని అప్పాచ్చియారణ్ణాను జీయర్ ఆదేశించారు. దానితో పాటు తమ కోయిలాళ్వార్ (తిరువారాధన పెరుమాళ్ ఆసీనమై ఉన్న మందిరం) లో ఉన్న ఎన్నై తీమనం కెడుత్తార్ విగ్రహాన్ని కూడా అణ్ణాకు అందజేసి, “ఇంతకుముందు ఈ విగ్రహం ఆట్కొండవిల్లి జీయర్ తిరువారాధన పెరుమాళ్. కందాడైయాండాన్ దివ్య వంశీయుడివి అయినందున, ఈ పెరుమాళ్ళకి తిరువారాధనం చేసే పూర్ణ అర్హత నీకుంది” అని అన్నారు. ఆ తర్వాత వారు శ్రీవైష్ణవుల గోష్టికి [తిరుమలైయాళ్వార్‌లోని ] వెళ్లి ఈ శ్లోకాన్ని పఠించారు.

శ్రీతీర్థ దేవరాజార్య తనయాంభేడి విశృతా
తస్యాస్థనుజో వరదః కాంచీనగర భూషణః

(తిరుమంజనం అప్పా కుమార్తె అయిన ఆచ్చి కుమారుడు వరదాచార్యర్ (అప్పాచ్చియారణ్ణ), దేవరాజార్యార్ అని కూడా పిలువబడే వీరు కాంచీపురానికి ఆభరణం వంటివారు). ఎంతో ప్రేమతో, పేరారుళాళర్ (దేవరాజ పెరుమాళ్) ఆచ్చి కుమారునిగా అవతరించారని కృపతో జీయర్ తెలిపారు. వారు “కోయిల్ లోనే శాశ్వతంగా ఉండి కైంకర్యం చేయండి” అని అణ్ణాను ఆదేశించారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/27/yathindhra-pravana-prabhavam-71-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment