శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
జీయర్ ప్రధాన శిష్యులకు ఆచార్య స్థానములలో పట్టాభిషేకం గావించారు
ఒకానొక రోజు, జీయర్ ప్రతివాది భయంకరం అణ్ణాను పిలిచి, కాందాడైయణ్ణన్, పోరేఱ్ఱు నాయనార్, అనంతయ్యనప్పై, ఎమ్పెరుమానార్ జీయర్ నాయనార్, కందాడై నాయన్లకు శ్రీభాష్యం (వ్యాస మహర్షి అందించిన బ్రహ్మ సూత్రానికి రామానుజులు రాసిన వ్యాఖ్యానం) బోధించమన్నారు. తరువాత వారు ప్రతివాది భయంకరం అణ్ణాను శ్రీభాష్యసింహాసనముపై ఆసీనపరచి, అభిషేకం (పట్టాభిషేకం) నిర్వహించి వారికి శ్రీభాష్యాచార్యర్ అను దివ్య బిరుదుని ప్రసాదించారు.
మరొక రోజు, జీయర్ కందాడైయణ్ణాన్ ను పిలిచి, పెరియ కందాడై అప్పన్, తిరుక్కోపురత్తు నాయణార్ భట్టార్, శుద్ధసత్వమణ్ణన్, అండ పెరుమాళ్ నాయనార్, అయ్యనప్పాలకు భగవత్ విషయం (తిరువాయ్మొళి వ్యాఖ్యానం) బోధించమన్నారు. ఆ తర్వాత కందాడైయణ్ణాన్ ను ఆచార్య సింహాసనంపై ఆసీనపరచి, అభిషేకం నిర్వహించి, ‘భగవద్ సంబంధాచార్యర్’ అను బిరుదును ప్రసాదించారు. వ్యాఖ్యానం రాయడంలో శుద్ధసత్వమణ్ణన్ సామర్థ్యాన్ని చూసి సంతోషించి, భగవత్ విషయ సింహాసనంపై ఆసీనపరచి, అభిషేకం నిర్వహించి, అతనికి తిరువాయ్మొళి ఆచార్య అను బిరుదును ప్రసాదించారు. ఒక నాడు రాత్రి, కందాడై నాయన్, జీయర్ నారాయణ్ భగవత్ విషయార్థాల గురించి చర్చించడం జీయర్ చెవిన పడింది. భగవత్ విషయార్థాలను కందడై నాయన్ సంస్కృతంలో ప్రసంగించడం వారు విన్నారు. సమస్కృతంలో భగవత్ విషయానికి అరుంపదవిళక్కం (అర్థ వివరాలు) వ్రాయమని నాయన్ ను నియమించారు.
జీయర్ ఎఱుంబి అప్పాని కోయిల్ కు పిలుచుట
జీయర్ దివ్య సాన్నిధ్యాన్ని విడిచి ఎఱుంబికి [భాగం-66 చుడండి] చేరుకున్న ఎఱుంబి అప్పా తట్టుకోలేక దుఃఖ సాగరంలో మునిగి బాధలో ఉన్నారు. జీయర్ దినచర్యను (రోజువారీ అనుష్టానాలు) ధ్యానించ సాగారు. ఆ అనుభవం పొంగి ఆ ప్రవాహ అనుభవంలో వారు దినచర్య ప్రబంధం అను గ్రంథాన్ని రచించి, ఒక శ్రీవైష్ణవుని ద్వారా జీయరుకి పంపారు. అది చదివి జీయర్ ఎంతో సంతోషించి, ఎఱుంబి అప్పాపై తమ కృపను కురిపించారు. “నిజమైన ‘అభిమానం’ అనుసరించే వారు, వీరిలా ఉండాలి కదా?” అని వారి దివ్య మనస్సు ఎఱుంబి అప్పా వైపు మల్లింది. వెంటనే కోయిల్ కి బయలుదేరి రమ్మని అప్పాకి సందేశం పంపారు. మాముణులను వెంటనే దర్శించాలని ఆశించి ఈ శ్లోకాన్ని వారు పఠించారు..
పారావారప్లవనచతురః కుంజరేవానరాణాం
ప్రియసహచర బద్రిణామీశ్వరోవా
వాయుర్భూత్వాసపతియతివా మార్గముల్లంగ్య దుర్గం కాలేకాలే
వరవరమునయే కామయే వీక్షితుం త్వాం
ఓ మణవాళ మాముని! వానరులలో (కోతులలో) ఉత్తముడు మరియు భారీ సముద్రాన్ని దాటడంలో నిష్ణాతుడైన ఆంజనేయుడిగా లేదా పెరియ తిరువడి (పక్షి రాజన్) గా నన్ను నేను మార్చుకోని ఈ అగమ్య మార్గాన్ని దాటడం ద్వారా దేవవార్ని తక్షణమే చూడాలని మరియు ఆనందించాలనుకుంటున్నాను. పొంగిపొర్లుతున్న వాత్సల్యంతో ఆ సందేశాన్ని తలపై పెట్టుకుని ఈ శ్లోకాన్ని వారు పఠించారు..
దేవః స్వామీ స్వయమిహభవన్ సౌమ్యజామాతృయోగీ
భోగీశ త్వద్విముఖామపిమాం భూయాసాభః యసిత్వం?
అర్తౌతార్యాతపిచ వచసామజ్ఞాసా సన్నివేశా
తావిర్ భాషపైరమలమపిధిర్ నిత్యం ఆరాధనీయం
ఆశాసానైర్ వరవరమునే నిత్యముక్తైరలభ్యం మర్త్యోలబ్దుం
ప్రభవధికతం మధ్వితః శ్రీముఖంతే
సారాసారప్రమితి రహితః సర్వధాశాసనంతే
సత్యశ్రీమాన్ కపికరకృతామాలికామేవ కుర్యాం
(ఓ తిరు అనంతాళ్వాన్ (ఆదిశేషుడు)! మా స్వామి అయిన మణవాళ మాముణులుగా మీరు అవతరించారు. మీ పట్ల నేను విముఖంగా ఉన్నప్పటికీ, నాకు విశేష అనుగ్రహం ప్రసాదించారు. ఓ మణవాళ మామునీ! దివ్య శ్రీసూక్తులు, వాటి అర్థాలు, స్వచ్ఛమైన మనస్సు గలవారు వారి ఆనంద బాష్పాలతో నిత్యం అరాధించువారికి, నిత్య సూరులు, ముక్తులు నిత్యం నీ పల్లాండు పాడే వారు అరాధించువారికి తగి ఉన్నప్పుడు, మాబోటి వారు మీ సందేశాన్ని పొందే అర్హత ఎలా పొందగలము? మంచి చెడుల మధ్య వ్యత్యాసం ఎరుగని ఈ అడియేన్, దేవర్వారు అందించే దివ్య సందేశాలను ఒక కోతి పూల దండను చీల్చి చెల్లా చెదరు చేసే విధంగా చింపివేస్తాను). మణవాళ మాముణుల నుండి వచ్చిన ఆ దివ్య సందేశంలో మునిగి, ఎంతో ఇష్టంగా కోరికతో వెంటనే శ్రీరంగానికి బయలుదేరారు. మఠంలోకి ప్రవేశించి, వారిని దర్శించాలనే వాంఛ, ఇంత కాలంగా జీయరుకు సాష్టాంగ నమస్కారం చేయలేదనే కోరికను పూరించడానికి, భక్తితో వారి దివ్య పాద పద్మాలను తమ కళ్ళకి, ఛాతికి హత్తుకొని, ‘సుధానిధిం స్వీకృతోతగ్ర విగ్రహం’ (తేనె సముద్రం వంటి జీయర్ తమ స్వసంకల్పానుసారంగా ఈ స్వరూపాన్ని స్వీకరించారు) అని ఈ క్రింది శ్లోకములో వివరించబడింది.
పొన్నిదనిల్ కుళిత్తు ఆంగు అందనిల్ పుగుద ప్పెఱ్ఱోం
పొరువరుం శీర్ నంపెరుమాళ్ పదం పుగళ ప్పెఱ్ఱోం
మన్నియ శీర్ మణవాళ మామునివన్ ఎన్నైయన్
వాళ్ందిరుక్కుం మడం తనిల్ వందిరుక్క ప్పెఱ్ఱోం
సెన్నిదనిల్ అవన్ అడియార్ పదం శూడ ప్పెఱ్ఱోం
తిరుమలైయాళ్వారిల్ ఎన్ఱుం శిఱందిరుక్క ప్పెఱ్ఱోం
పిన్నై అవర్ క్కు అందరంగ ప్పొరుళుం ప్పెఱ్ఱోం
పెరుం తివత్తిల్ ఇన్బం ఇంగే పెరుగవుం ప్పెఱ్ఱోం
(కావేరిలో స్నానమాచరించే భాగ్యము కలిగిన పిదప శ్రీరంగంలోకి ప్రవేశించాము. నంపెరుమాళ్ళ దివ్య పాదాలను సేవించుకునే అదృష్టం కలిగింది. మణవాళ మాముణులు నివసించే ప్రదేశంలో ఉండే భాగ్యం కలిగింది. వారి శిష్యుల దివ్య తిరువడిని ధరించే అవకాశం కలిగింది. తిరుమలైయాళ్వార్ (ఉపన్యాసం మొదలైనవాటి కోసం మాముణులు నిర్మించిన మండపం) లో ఉండే భాగ్యము కలిగింది. వారికి సన్నిహితులుగా ఉండే అవకాశం కలిగింది. ఈ భూమిపైన మా ఆనందం అంచలంచలుగా పెరడం మా అదృష్టం.
మణ్ణాడు వాళవందోన్ మణవాళమామునివన్ వణ్మై
కణ్ణారరుళుక్కు ఇలక్కాగ నల్వాళుం కండవన్ తన్
తిణ్ణార్ అడిగళిల్ కుఱ్ఱేవల్ శెయ్దు తిరియవుం నాన్
ఎణ్ణాదిరుక్క నడువే నమక్కు వందు ఎయ్దియదే
(ఈ భూమ్మీద అవతరించిన మణవాళ మాముణుల కృపకు పాత్రులైన వారికి సేవ చేయాలనే ఆలోచన కూడా లేని వ్యక్తిని నేను. అయినప్పటికీ, నేను ఎంత అదృష్టవంతుడిని అయ్యాను!)
మూలము: https://granthams.koyil.org/2021/09/28/yathindhra-pravana-prabhavam-72-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org