యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 73

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 72

ఉత్తమ పురుషుల గోష్టిని సేవిస్తూ, తాను పొందిన అదృష్టాన్ని ప్రతి నిత్యం ధ్యానించారని ఈ పాశురాలలో వర్ణించబడింది.

అంతః స్వాన్తం కమపిమధురం మంత్రం ఆవర్తయంతీం ఉత్యద్భాష్ప                        స్థిమితనయనాముజ్జితా శేషవృత్తిం
వ్యాక్యాగర్భం వరవరమునే త్వన్ముఖం వీక్షమాణాం కోణేలీనః
క్వచిత్ అణురసౌ సంసతంతాం ఉపాస్తాం

(ఓ మణవాళ మాముని! ఆ ఉత్తమ పురుషుల గోష్టిలో అల్పమైన ఈ అడియేన్ ఒక మూలన దాక్కొని, ఉభయ వేదాంతములు (సమస్కృతం, తమిళ వేదాంతాలు), రహస్యార్థాల వివరణలు తమ దివ్య శ్రీముఖంలో కలిగి, మనస్సులో మధురమైన మంత్రాన్ని జపిస్తూ, చలించని వారి కళ్ళు, కానీ ఆనంద బాష్పాలను కార్చే దివ్య నేత్రాలు కలిగి ఉన్న దేవర్వారిని సేవిస్తూనే ఉంటాను). వారు వరవరముని ఇతర శిష్యులతో కలిసి అక్కడ నివసించసాగారు. వాళ్ళల్లో, వరం తరుమ్ పెరుమాళ్ పిళ్ళై అనే ఒక శిష్యుడు ఉండేవాడు, అతను జీయర్ వారి తిరుక్కై చెంబు (చెంబు), తిరువొఱ్ఱువాడై (తుడుచుకోడానికి వాడే దివ్య బట్ట) ను మోసుకెళ్లేవాడు. అతను పొడవాటి జుట్టుని పెంచుకొని ఉన్నాడు. అతన్ని చూసి జీయర్ ప్రశ్నించగా, అతను తనకు బిడ్డ పుట్టబోతున్నాడని, అందుకే వెంట్రుకకు కత్తిరించుకోలేదని చెప్పాడు. వెంటనే వెళ్ళి వెంట్రుకలు కత్తిరించుకోమని జీయర్ అదేశించారు. అతను అలాగే చేశాడు. అతను తిరిగి వస్తుండగా, అతని గ్రామం నుండి ఒక వ్యక్తి వచ్చి, అతనికి పది రోజుల క్రితం ఒక కుమారుడు జన్మించాడని కబురిచ్చాడు [ఆచారం ప్రకారం, బిడ్డ జన్మించిన పదవ రోజున తన వెంట్రుకలు కత్తిరించుకోవాలి) . అది విని అక్కడున్న వాళ్ళందరూ ఏమిటీ విచిత్రం అని ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి తన కుమారుడికి జీయార్ దివ్య నామమైన ‘నాయనార్’ అని నామకరణం చేశాడు. ఉపదేశ రత్నమాల “వందు పరందదు ఎంగుం ఇత్తిరునామం” (దూర దూరం వరకు వ్యాపించింది ఈ దివ్య తిరునామం) లో చెప్పినట్లుగానే, అనేక మంది తమ కుమారులకు ‘నాయనార్’ అని నామకరణం చేయడంతో, ఆ పేరు మహా ప్రసిద్దికెక్కింది.

కందాడై అణ్ణన్, మాముణుల తిరువడి యందు భక్తితో నిత్యం వారిని ఆరాధిస్తుండేవారు. ఆ రోజుల్లో, వారు మాముణులకు ప్రియమైన కాయకూరల ఏర్పాట్లు చూసుకునేవారు. అణ్ణన్ తమ తిరువారాధన కోసం నివేదనల ఏర్పాట్లు కష్టంగా ఉన్న పరిస్థితిలో, అది గమనించిన జీయర్ దయతో తాను అందుకున్న నివేదనలను వారికి ఇచ్చేవారు. ఈ విధంగా, జీయర్ తమ శిష్యుల యొక్క కనీ కనిపించని అవసరాలను చూసుకునేవారు. ఆ సమయంలో, ఆ పాశురంలో వివరించినట్లుగా, భట్టర్పిరాన్ జీయర్ గోష్టిలో లేని వెలితిని జీయర్ భావించారు.

అప్పిళ్ళై కందాడై అణ్ణన్ ముదలానోర్
శెప్పముడన్ శేర్ంద తిరళ్తన్నై ఎప్పొళుదుం
పార్తాలుం ఎమక్కు ఇళవాం భట్టర్పిరాన్ తాదర్ తన్నైచ్
చూర్ తీరక్కాణామైయాల్

(అప్పిళ్ళై, కందాడై అణ్ణన్ మొదలైన ప్రముఖులున్న ఈ గోష్టిని నేను చూసినప్పుడల్లా, భట్టర్పిరాన్ జీయర్ గోష్టిలో లేని వెలితికి నేను బాధపడ్డాను).

ఈ పాసురంలో పేర్కొన్న విధంగా భట్టర్పిరాన్ జీయర్ వెంటనే వచ్చి జీయర్ పాదాలను సేవించుకున్నారు.

అప్పిళ్ళానుం కందాడై అణ్ణనుమ్ అరుళ్ పిరింద శడగోప దాసరుం
ఒప్పిల్లాద శిఱ్ఱానుం కూడియే ఓంగువణ్మై మణవాళ యోగిదాన్
శెప్పి వాళ్ందు కళిత్తు త్తెన్ కోయిలిల్ శిఱంద వణ్మైయై చ్చేవిత్తిరామలే
తప్పియోడి త్తవిత్తు త్తిరివదు తలైయెళుత్తు త్తప్పాదు కాణుమే

(దయాశీలుడైన మణవాళ మాముణుల దివ్య కృపకు పాత్రులైన అప్పిళ్ళాన్, కందాడై ఆండాన్, శఠకోప దాసర్ల దివ్య దర్శినానికి నోచుకోని నా దురదృష్ఠాన్ని నేను ఏమని వివరించాలి? ఈ దివ్య గోష్టికి దూరమై భ్రమిస్తున్నాను)

ఈ పాసురంలో వర్ణించబడినట్లు, అనేక విద్వాంసులు, ప్రముఖ ఆచార్యులు, సామాన్యులు, విద్యావంతులు మొదలైన అనేక వర్గాల వారితో మణవాళ మాముణుల మఠం నిండిపోయింది.

వాదు శెయవెన్ఱు శిల వాదియర్గళ్ వందు మనముఱియ నిఱ్పర్ ఒరుపాల్
వాళియెనవే పెరియ శాబమఱ వెన్ఱు శిలర్ వందనైగళ్ శెయ్వర్ ఒరుపాల్
పోదుం ఇని వాదం ఉన పాదం అరుళెన్ఱు పుగళ్ందు నిఱ్పర్ ఒరుపాల్
పొంగివరుం ఎంగళ్ వినై మంగ అరుళ్ ఎన్ఱు శిలర్ పోఱ్ఱి నిఱ్పర్ ఒరుపాల్
ఈదివై కిడక్క మఱై నూల్ తమిళ్ తెరిందు శిలర్ ఏదమఱ వాళ్వర్ ఒరుపాల్
ఏదమఱ వాదులర్గళ్ పేదైయర్గళ్ తామయంగి నిఱైందు ఇఱైంజి నిఱ్పర్ ఒరుపాల్
మాదగవినాల్ ఉలగం ఏళైయుం అళిక్క ఎన వంద ఎదిరాశన్ అడిశేర్
మామునివర్ దీపం అరుళాళర్ మణవాళ మాముని మన్ను మడం వాళుం వళమే

(కొంతమంది మణవాళ మాముణులతో చర్చలో పాల్గొనాలని వచ్చి, చర్చలో ఓడిపోయి, మనస్సు విరిగి ఒక వైపు నిలబడేవారు; మరి కొంతమంది తమ పాపాలను తొలగించుకోవాలని మాముణులకు సాష్ఠాంగ నమస్కారాలు చేసి ఒకవైపు నిలబడేవారు; ఇంకే చర్చ అక్కర్లేదని కొందరు, వారిని స్తుతించి, వారి దివ్య తిరువడి కృపను కోరుతూ, ఒక వైపు నిలబడేవారు; మరికొందరు, పొంగిపొర్లుతున్న తమ పాపాలను తొలగించమని వేడుకుంటూ, ఒకవైపు నిలబడేవారు; ఇవన్నీ ఇలా ఉండగా, తమిళ వేదం తెలిసిన కొందరు, నిర్మలమైన జీవనం సాగించే కొందరు ఒకవైపు నిలబడేవారు; ఈ లోకంలో భ్రమిస్తూ సామాన్య మనస్తత్వం గల కొందరు తమను ఉద్ధరించమని వచ్చి వేడుకొని ఒక వైపు నిలబడేవారు; ఏడు లోకాలను తమ దివ్య కృపతో ఉద్దరించాలని అవతరించిన రామానుజుల తిరువడి యందు ఆశ్రయం పొందిన మణవాళ మాముణుల దివ్య మఠం ఈ విధంగా సుసంపన్నంగా కొనసాగింది.)

మూలము: https://granthams.koyil.org/2021/09/29/yathindhra-pravana-prabhavam-73-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment