యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 74

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 73

భగవత్ విషయంపై కాలాక్షేపం నిర్వహించమని పెరియ జీయరుని ఆదేశించిన నంపెరుమాళ్

ఈ శ్లోకానుసారంగా….

తతః కదాచిత్ ఆహూయ తమేనం మునిపుంగవం!
సత్కృతం సాధుసత్కృత్య చరణాబ్జ సమర్పణాత్
సన్నితౌ మేనిషీతేతి శశాసమురశాసనః
మహాన్ప్రసాద ఇత్యస్య శాసనం శిరసావహన్
తదైవత్ర వ్యాఖ్యాతుం తత్ క్షణాత్ ఉపచక్రమే
శ్రీమతి శ్రీపతిః స్వామి మంటపే మహతిస్వయం
తద్వంతస్య ప్రబంధస్య వ్యక్తంతేనైవ దర్శినం
శటవైరిముఖైః శృణ్వన్ దేశికైర్దివ్యదర్శినైః
అత దివ్యమునేస్థస్య మహిమానం అమానుషం
అనుభూయేమమాపాల గోపాలం అఖిలో జనః
అమన్యత పరంధన్యం ఆత్మానం తత్ర నిక్షిపన్

(కొంతకాలం తర్వాత, నిత్యసూరుల అధిపతి అయిన పెరుమాళ్, మునివర్ పెరుమాన్ (యతులకు అధిపతి) అయిన మణవాళ మాముణులను పిలిచి, వారికి తమ శ్రీశఠారితో సత్కరించి, “మా సన్నిధిలో తిరువాయ్మొళి అర్థాలను వివరిస్తూ ఉపన్యాసం ప్రారంభించుము” అని ఆదేశించెను. మాముణులు ఆ ఆదేశాన్ని గొప్ప అనుగ్రహంగా భావించి శిరసా వహించారు. తక్షణమే ఉపన్యాసం ప్రారంభించారు. శ్రీయః పతి శ్రీ రంగనాధులు కృపతో దివ్య అనుగ్రహ పాతృలైన నమ్మాళ్వార్లు మొదలైన వారితో కూడి, అందమైన పెరియ తిరుమండపం (దివ్య విశాల మండపం) లో ఆసీనులై తిరువాయ్మొళి అర్థాలను ఆనందంగా అనుభవించారు. పిల్లలు, పెద్దలందరూ ఆ మణవాళ మాముణుల మానవాతీత మహిమను విని ముగ్దులై తమను తాము వారికి సమర్పించి శరణాగతి చేశారు.)

కృపయా పరయా శరఙ్గరాట్ మహిమానం మహతాం ప్రకాశయన్
గురుచేస్వయమేవ చే ఆతసా వరయోగి ప్రవరసస్య శిష్యతాం

(యతులలో ఉత్తములైన ఆ మణవాళ మాముణుల గొప్పతనాన్ని ప్రదర్శించేందుకు, ఆ శ్రీరంగరాజు గొప్ప కృపతో, అతనికి శిష్యులు కావాలని తమ దివ్య మనస్సులో సంకల్పించారు). “పితరం రోచయామాస తథా దశరథం నృపం” అని చెప్పినట్లు, పెరుమాళ్ శ్రీ రాముడిగా అవతారం దాల్చబోయే ముందు దశరథుడు అతనికి తండ్రి కావాలని సంకల్పించినట్లే. శ్రీరంగానికి స్వామి అయిన పెరుమాళ్, పరమ కృపతో, అందరికి జీయర్ గొప్పతనాన్ని చాటి చెప్పెందుకు, మణవాళ మాముణులకు శిష్యుడు కావాలని కోరుకున్నారు. ఈ క్రింది శ్లోకంలో వర్ణించబడినట్లుగా, నంపెరుమాళ్ శ్రీరంగవాసులందరితో కలిసి గరుడమండపానికి వెళ్ళారు.

శ్రోతుం ద్రావిడవేదపూరి వివృతం సౌమ్యోపయంతృమునే
రుత్కటణ్టాస్థిమమైన మానయతదస్థార్క్ష్యాశ్రయం మంటపం 
ఆవి యార్చకముచి వ్వనిధిముతా నిశ్వోషలోకాన్వితో
రంగీవత్సరమేకమేవం అశృణోత్ వ్యక్తం యతోక్తం క్రమాత్

(దయామయుడైన శ్రీ రంగనాధుడు అర్చక ముఖేన ఇలా ఆజ్ఞాపించాడు, ‘ద్రావిడ వేదముగా పరిగణించబడే తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానం మణవాళ మాముణుల ద్వారా నేను వినాలనుకుంటున్నాను. అతనిని గరుడ మండపం వద్దకు తీసుకురండి’ అని ఆదేశించారు. తరువాత, మునివర్ ఒక సంవత్సరం పాట్లు ఇచ్చిన ఆ ఉపన్యాసాన్ని ఎంబెరుమానునితో పాట్లు అన్యులందరూ విని ఆనందించారు) జీయర్ ఉపన్యాసాన్ని అందించిన క్రమంలో అందరూ విన్నారు. ఉపన్యాసం ఎలా అందించబడింది?

మంగళాయతనేరంగే రమ్యజామాతృయోగిరాట్
యుగపద్ద్రావిడామ్నాయ సర్వ వ్యాఖ్యాన కౌతుకీ

(సమస్త శుభాలకు నిలవైన శ్రీరంగంలో, మణవాళ మాముణులు, తిరువాయ్మొళి వ్యాఖ్యానాలన్నింటి నుండి ఉపన్యాసాన్ని అందించాలని ఆశించారు).

దేశాంతరగతోవాపి ద్వీపాంతరగతోపివా
శ్రీరంగాపిముఖోభూత్వా ప్రణిపత్య నసీధతి

(ఒక వ్యక్తి ఈ దేశంలోనే కాక మరెక్కడున్నా, అతను శ్రీరంగం వైపు సాష్టాంగ నమస్కారం చేస్తే అతనికి ఎటువంటి దుఃఖాలుండవు).

ఆ శ్లోకాలలో వివరించబడినట్లుగానే, ద్రావిడ వేదమైన తిరువాయ్మొళికి ఆరాయిరప్పడి, ఒన్బదినియారప్పడి, పన్నీరాయిరప్పడి, ఇరుబత్తు నాలాయిరప్పడి, ముప్పత్తాఱాయిరప్పడి (ఈ ఐదు వ్యాక్యానాలు తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్, నంజీయర్, అళగియమణవాళచ్చీయర్ (పెరియ వాచ్చాన్ పిళ్ళై సత్శిష్యులు), పెరియ వాచ్చాన్ పిళ్ళై, వడక్కుత్తిరువీధి పిళ్ళైల ద్వారా నంపిళ్ళై రచించారు) వ్యాక్యానాల నుండి, ఇతర అరుళిచ్చెయల్ వ్యాక్యానముల అంగములు మరియు ఉపాంగముల ద్వారా ఉపన్యాసం ఇవ్వాలని అళగియ మణవాళ మాముణులు సిద్ధంగా ఉన్నారు. తిరుపవిత్రోత్సవం (సంవత్సరానికి ఒక సారి ఆలయం, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసే ఒక ఉత్సవం) ను వంకగా పెట్టుకొని పెరుమాళ్ ఉపన్యాసం వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ కరుణామయుడైన పెరుమాళ్ తిరుపవిత్రోత్సవ మండపంలోకి ప్రవేశించి, అణియరంగన్ తిరుముఱ్ఱత్తడియార్ (దివ్య శ్రీరంగనాధుని గోష్ఠి) – ఆచార్య పురుషులు, ఆలయాల పరిచారకులు, జీయర్ల మధ్య మహా మండపం ఉన్నారు. జీయర్ (మణవాళ మాముణులు) తమ శిష్యులతో కలిసి పెరుమాళ్ళకు తమ మంగళాశాసనాన్ని సమర్పించారు. ఒక విశేష రీతిలో పెరుమాళ్ళు జీయర్‌కు తమ శ్రీ శఠగోపాన్ని ప్రసాదించి తమ భక్తిని చాటుకున్నారు. “రేపటి నుండి, మా పెరియవణ్కురుగూర్ నంబి (కురుగూర్ నంబి అయిన నమ్మాళ్వార్) అందించిన తిరువాయ్మొళి అర్థాలను మా పెరియ తిరుమండపంలో ఈడు ముత్తాఱాయిరప్పడి ద్వారా ప్రసంగించండి” అని ఆజ్ఞా ఇచ్చెను. మణవాళ మాముణులు “ఏమి అనుగ్రహమిది!” అని సంతోషించి ఈ పాశురాన్ని రచించారు.

నామార్? పెరియతిరుమండపమార్? నంపెరుమాళ్
తామాగ నమ్మైత్తనిత్తళైత్తు – నీ మాఱన్
శెందమిళ్ వేదత్తిన్ శెళుం పొరుళై నాళుం ఇంగే
వందురై ఎన్ఱేవువదే వాయ్ న్దు

(నేనెవరు? తిరుమండపం అంటే ఏమిటి? నంపెరుమాళ్ స్వయంగా పిలిచి, “నీవు ప్రతిరోజూ, మాఱన్ (నమ్మాళ్వార్) స్వరపరిచిన స్వచ్ఛమైన తమిళ్ వేదార్థాలను తెలియజేయుము” అని ఆజ్ఞాపించాడు. “ఎంతటి అనుగ్రహం!”

శ్రీ రామాయణ శ్రవణ చేయుటకు శ్రీ రాముడు అప్పటి రారాజులందరినీ తమ ఆస్థానానికి పిలిచినట్లుగా, మరుసటి రోజే, సంగీత బృందం సంగీతాన్ని వినడానికి పోషించినట్లుగా, నంపెరుమాళ్ ఉభయ నచ్చియార్లతో కూడి తమ దివ్యసింహాసనంలో సిద్ధంగా ఉన్నారు. తమ సభలో తిరువనంతాళ్వాన్ (ఆదిశేషుడు), పెరియ తిరువడి (గరుడ), సేనాపతియాళ్వాన్ (విశ్వక్సేనుడు) మొదలైన దివ్యసూరులు, నమ్మాళ్వార్లతో మొదలు పెట్టి అందరు ఆళ్వార్లు, నాథమునులు, ఆళవందార్ మొదలైన ఆచార్యులు, శ్రీ రంగ నారాయణ జీయర్, తిరుమాలై తంద భట్టర్ మొదలైన స్థలపురుషులు, భక్తులు భాగవతుల మహా గోష్టి అయిన అణియరంగన్ తిరుముఱ్ఱం (శ్రీరంగ దివ్య ప్రాంగణం) అందరూ ఉపస్థితులై ఉన్నారు. మణవాళ మాముణులు ఈడు వ్యాక్యానం నుండి ప్రారంభించి, శృతి ప్రక్రియ (వేదంలో చూపినట్లుగా), శ్రీభాష్య ప్రక్రియ (శ్రీ రామానుజులు రచించన శ్రీభాష్యంలో చూపినట్లుగా). శృతప్రకాశికా ప్రక్రియ (దివ్య సూరీ భట్టర్ అనుగ్రహించిన శ్రీ భాష్య వ్యాక్యానంలో చూపినట్లు), గీతాభాష్య ప్రక్రియ (శ్రీ రామానుజులు అనుగ్రహించిన భగవద్గీత వ్యాక్యానంలో చూపినట్లు), శ్రీ పాంచరాత్ర ప్రక్రియ, శ్రీ రామాయణ ప్రక్రియ్ర, మహాభారత ప్రక్రియ, శ్రీ విష్ణు పురాణం ప్రక్రియ, మహాభాగవత ప్రక్రియల ఉల్లేఖనలతో వ్యాక్యానము అందించారు); వారు ఇది ప్రతి పదార్థం అని, ఇది వాక్యార్థం అని, ఇది మహావాక్యార్థం అని (అనేక వాక్యాల అర్థం), ఇది సమభివ్యాహారార్థం (ఇతర అర్థాలతో అనుబంధించిన) అని, ఇది ధ్వన్యార్థం (ప్రత్యేక శబ్దార్థం) అని, ఇది వ్యంగ్యార్థం అని, ఇది శబ్ధరసం (పద్య సౌందర్యం) అని, ఇది అర్థరసం (అర్థంలో ఉన్న సౌందర్యం) అని, ఇది భావరసం (భావ సౌందర్యం) అని, ఇది ఒణ్ పొరుళ్ (అర్థం యొక్క శ్రేష్ఠత) అని, ఇది ఉట్పొరుళ్ (అంతరంగార్థం) మొదలైనవి అన్నీ వివరించారు. ఈ విధంగా శ్రీ రంగనాధుడు ఒక సంవత్సరం పాటు మణవాళ మాముణుల శుద్ధ స్పష్ట కథన శ్రవణ చేశారు. చివరికి ఉపన్యాసం శాఱ్ఱుమురకి (ముగింపు) కి చేరుకుంది.

మూలము: https://granthams.koyil.org/2021/09/30/yathindhra-pravana-prabhavam-74-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment