శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
భగవత్ విషయ శాఱ్ఱుముఱ
ముందు లాగానే, దయామయుడైన ఎంబెరుమాన్ పరాంకుశ పరకాల భట్టనాథ యతివరర్ (నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్, రామానుజులు), పలు ఇతరులతో కలిసి దివ్యప్రబంధ వ్యాఖ్యాన శ్రవణం చేయుటకు వేంచేసారు. జీయర్ గొప్పతనాన్ని స్వయంగా స్తుతించాలని సంకల్పించారు. ఈ శ్లోకంలో చెప్పినట్లే
సమాప్తౌ గ్రంథస్య ప్రతితవివిధోపాయనచయే పరం సంజీభూతే వరవరమునేంగ్రి సవితే
హతాత్పాలః కశ్చిదృత ఇతినిరస్థోప్యుపగతః జగౌ రంగేశాక్యః పరిణతచతుర్హాయన ఇదం
(భగవత్ విషయం (తిరువాయ్మొళి వ్యక్యానం) శాఱ్ఱుముఱ (ముగింపు) సమయంలో తమలపాకులు, వక్క మొదలైన పదార్థాలు పల్లెంలో సిద్ధంగా ఉంచారు. రంగనాయకన్ అనే నాలుగేళ్ల పిల్లవాడు ఎక్కడినుండో అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. అక్కడున్న పెద్దలు “ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపో” అని అడ్డుకుంటుండగానే ఆ పిల్లవాడు జీయర్ దగ్గరికి వచ్చి ఈ తనియన్ పఠించారు) యాలకలు, లవంగం, కర్పూరం, తిరు పరివట్టం (దివ్య తల పాగ) మొదలైన పదార్థాలు సంభావనగా సిద్ధంగా ఉంచబడ్డాయి.
శ్రీశైలేశ దయాపాత్ర తనియన్ అవతారం
అళగియ మణవాళ భట్టర్ వారి నాలుగేళ్ళ కుమారుడు రంగనాయకన్, పైన పేర్కొన బడిన సంభావనలు పెరుమాళ్ళ పదార్థాల మధ్య నిలబడ్డాడు. ఆ పిల్లవాడిని అక్కడి నుండి తీసుకెళ్లి బయట నిలబెట్టినా మళ్లీ అక్కడికే వచ్చి నిలబడ్డాడు. “ఇది సాధారణ విషయం కాదు; అద్భుతమేదో జరగబోతోంది” అని అక్కడ ఉన్న వారందరూ అనుకున్నారు. ఆ చిన్నారిని “ఎందుకు ఇక్కడ నిలుచున్నావు?” అని అడగానే, ఆ పసివాడు చేతులు జోడించి అంజలి ముద్రలో నిర్భయంగా “శ్రీశైలేశ దయాపాత్రం” పఠించాడు. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అని అడుగగా, “ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం” అని చెప్పి పారిపోయాడు. అక్కడ ఉన్న పెద్దలు ఇది విని ఆశ్చర్యపోయారు; వెంటనే వారు ఈ శ్లోకాన్ని తాళపత్రపై వ్రాసి, పసుపు పూసి, నంపెరుమాళ్ళ దివ్య పాదాల వద్ద ఉంచారు. వారు దానిని ఒక కంచంలో ఉంచి, రంగనాయకుని పిలిచి, ఇంకా ఏమైనా పఠించ గలవా అని అడిగారు. “నాకేమీ తెలియదు” అని అన్నాడు. ఇంతకు ముందు చెప్పినదే మళ్ళీ చెప్పమని అడిగితే, “నాకేమీ తెలియదు” అని చెప్పి పారిపోయాడు.
వాళిత్తిరునామానికై ఆదేశం
తరువాత, అప్పిల్లైని (మణవాళ మాముణుల శిష్యులలో ఒకరు, 56 వ భాగంలో చూడవచ్చు) అరుళ్పాడు (కృపతో తమ ఆజ్ఞను ప్రకటించుట) ద్వారా ప్రశంశించి, వాళి తిరునామం (స్తుతి) పఠించమని కోరారు. అప్పిళ్ళై తమిళ భాష నిపుణులైనందున, ఈ క్రింది వాటిని పఠించారు.
వాళి తిరువాయ్మొళిప్పిళ్ళై మాదగవాల్
వాళుం మణవాళ మామునివన్ – వాళియవన్
మాఱన్ తిరువాయ్మొళిప్పొరుళై మానిలత్తోర్
తేఱుం పడి ఉరైక్కుం శీర్
(తిరువాయ్మొళి పిళ్ళైల అపారమైన అనుగ్రహ పాత్రులైన మణవాళ మాముణులు దీర్ఘకాలం వర్ధిల్లాలి. సమస్థ మానవాళికి అర్థమయ్యేలా, ఉద్ధరింపబడేలా తిరువాయ్మొళి అర్థాలను అనుగ్రహించిన వారికి వందనాలు)
శెయ్య తామరై త్తాళిణై వాళియే సేలై వాళి తిరునాభి వాళియే
తుయ్య మార్బుం పురినూలుం వాళియే సుందరత్తిరు త్తోళిణై వాళియే
కైయుం ఏందియ ముక్కోలుం వాళియే కరుణై పొంగియ కణ్ణిణై వాళియే
పొయ్యిలాద మణవాళ మాముని పుంది వాళి పుగళ్ వాళి వాళియే
(ఎర్రటి కమలముల వంటి వారి దివ్య పాదాలకు జోహార్లు; ఆతని దివ్య పట్టు పీతాంబరం, వారి దివ్య నాభీ దీర్ఘ కాలం వర్ధిల్లాలి; ఆతని స్వచ్ఛమైన మనస్సు, యజ్ఞోపవీతం దీర్ఘ కాలం వర్ధిల్లాలి; ఆతని దివ్య భుజాలు దీర్ఘ కాలం వర్ధిల్లాలి; ఆతని త్రిదండం దీర్ఘ కాలం వర్ధిల్లాలి; కరుణ పొంగిపొర్లుతున్న ఆతని దివ్య నేత్రాలు దీర్ఘ కాలం వర్ధిల్లాలి; సత్య వచనములు మాత్రమే పలికే మణవాళ మాముణులు దీర్ఘ కాలం వర్ధిల్లాలి; అతని మేధస్సు కీర్తి దీర్ఘ కాలం వర్ధిల్లాలి)
అడియార్గళ్ వాళ అరంగ నగర్ వాళ
శడగోపన్ తణ్ తమిళ్ నూల్ వాళ – కడల్ శూళ్ంద
మన్నులగుం వాళ మణవాళ మామునియే!
ఈన్నుమొరు నూఱ్ఱాణ్డు ఇరుం
(భక్తుల పురోగతి కోసం, శ్రీరంగం పురోగతి కోసం, నమ్మాళ్వార్ల దివ్య ప్రబంధం పురోగతి కోసం, సాగరంతో ఆవరించి ఉన్న ఈ భూమి పురోగతి కోసం, ఓ మణవాళ మామునీ! తమరు మరో వందేళ్లు జీవించాలి)
ఈ పాశురాలను వింటూ పెరుమాళ్ ఎంతో ఆనందించి అప్పిళ్ళైపైన తమ కృపను కురిపించి పలు సన్మానాలను ప్రసాదించి సత్కరించారు.
దివ్యదేశాలకు నంపెరుమాళ్ళ ఆదేశం
తక్షణం, జీయార్ గురించి నంపెరుమాళ్ పాడిన తనియన్ను పఠించాలని తిరుమల, పెరుమాళ్ కోయిల్ మొదలైన అనేక దివ్య దేశాలకు సెనై ముదలియార్ (విష్వక్సేనులు) దివ్య సందేశాన్ని పంపించారు.
శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం
(తిరువాయ్మొళి పిళ్ళై కృపా పాత్రుడు, దివ్య మేధస్సు, భక్తి సాగరుడు, రామానుజుల పరమ భక్తులైన ఆ మణవాళ మాముణులకు నా నమస్కారాలు.) ఏదైనా పారాయణం ప్రారంభంలో ఈ తనియన్ను పఠించాలని, ఆ పారాయణం సాఱ్ఱుముఱ సమయంలో “వాళి తిరువాయ్మొళి పిళ్ళై” తో ప్రారంభించి “మణవాళ మామునియే ఇన్నుం ఒరు నూఱ్ఱాండు ఇరుం” అని ఈ మూడు పాశురాలను పఠించాలని అని సందేశం పంపారు. ఆ తర్వాత మణవాళ మాముణులను ఆలయ మర్యాదలతో సత్కరించి, ఆలయ పరివార సమేతంగా వారి మఠానికి పంపాడు. మరో ఆశ్చర్యకరమైన సంఘటన సంభవించింది.
మూలము: https://granthams.koyil.org/2021/10/01/yathindhra-pravana-prabhavam-75-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org