యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 77

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 76

తిరువేంకటేశ్వరుడు ఈ తనియన్ ప్రచారం

ఈ తనియన్ కు [‘శ్రీశైలేస దయాపాత్రం’ తో ప్రారంభించి ‘మణవాళ మామునియే ఇన్నుం ఒరు నూఱ్ఱాండు ఇరుం’ తో తో ముగుస్తుంది] సంబంధించిన మరోక అద్భుతం ఉంది . తెన్నన్ ఉయర్ పొరుప్పులోని (దక్షిణంలో ఉన్న దివ్య పర్వతం, అనగా తిరుమాలిరుంజోలై) అళగర్ (తిరుమాలిరుంజోలై ఎమ్పెరుమాన్), దివ్య వడమలైలోని (ఉత్తరాన ఉన్న దివ్య పర్వతం) అప్పన్ (తిరువెంకటేశ్వరుడు) ఇరువురు ఈ తనియన్ ప్రచారంలో సహకరిస్తారు. ఈ తనియన్ పుట్టక ముందే, ఒక ముముక్షువు వివిధ దేశాల సంచారం చేస్తూ నిత్యం భగవానుని చింతన చేస్తూ ఉండేవాడు. అతన్ని ఉద్ధరించాలని సర్వేశ్వరుడు అతనికి ఈ తనియన్ ను బోధించెను. అతను ఈ తనియన్ ను తన శరణుగా భావించి నిరంతరం పారాయణం చేస్తూ ఉండేవాడు. తరువాత, పురట్టాసి (బాద్రపద) మాసంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరగాల్సి ఉన్న సమయంలో, అతను తిరుమలకు చేరుకున్నాడు. అర్చకుని ద్వారా, ఆ వేంకటేశ్వరుడు అతని చేయి పట్టుకుని, ‘ఇయల్ గోష్టి శాఱ్ఱుముఱ’ (దివ్య ప్రబంధ ఉదయం పారాయణం పూర్తి చేసే విధి) పఠిస్తున్న శ్రీవైష్ణవుల గోష్ఠికి తీసుకు వచ్చాడు. ఆ అర్చకుడు వాళ్ళు ఏమి పఠిస్తున్నారో గమనించమని అతడికి చెప్పాడు. ఆ శ్రీవైష్ణవులకు కూడా “అతను పఠించేది మీరు వినండి” అని చెప్పాడు. పెరియ కేల్వి జీయర్ -పెద్ద జీయర్, విశ్వక్సేనుల సందేశం ద్వారా వచ్చిన తనియన్ ను పఠించారు. ఇది విన్న ఆ వ్యక్తి గోష్ఠికి సాష్టాంగము చేసి “దయచేసి అడియేన్ ప్రార్థన వినండి” అని చెప్పి “ఇది ఎంతటి ఆశ్చర్యం! అడియేన్ కలలలో విన్న శ్లోకమే ఇక్కడ పఠించారు.” జీయర్ అతనితో “అలా అయితే, ఆ శ్లోకాన్ని పఠించుము” అని అన్నారు. ఆ వ్యక్తి వెంటనే ‘శ్రీశైలేశ దయాపాత్రం’ పఠించాడు… ఇది విన్న ప్రతి ఒక్కరూ చాలా సంతోషించి, ఆ శ్లోకాన్ని వారు ఎలా పొందారో అతనికి చెప్పారు. మొత్తం వృత్తాంతాన్ని విన్న తర్వాత, ఆ వ్యక్తి పూర్తి భక్తితో కోయిల్ (శ్రీరంగం) చేరుకుని, జీయర్ దివ్య పాదాల యందు పెలికివేసిన చెట్టులా నిటారుగా సాష్టాంగపడ్డాడు. అత్యంత దయాపూర్ణులైన జీయర్ తమ దివ్య హస్తాలతో అతనిని పైకి లేపి “ఎవరు నువ్వు? ఏమి కావాలి నీకు?” అని అడిగారు. ఆ వ్యక్తి బదులిస్తూ, “ముముక్షువైన అడియేన్ వివిధ దివ్య దేశాల యాత్ర చేశను” అని ప్రారంభించి, తన స్వప్నంలో జరిగిన సంఘటనలను వివరించాడు. అతను ఆ తనియన్ ను పఠించి, జీయర్ దివ్య పాదాలను తన శిరస్సుపై పెట్టుకున్నాడు. అతను జీయర్ తో “ఆ వేంకటేశ్వరుడు అడియేనుపై విశేష దయను కురిపించాడు, గోష్ఠిలో (తిరుమలలో) ఈ తనియన్‌ ను పఠించేలా చేసాడు, పైగా దేవర్వారి దివ్య చరణాలను సేవించేలా చేసాడు” అని చెప్పాడు. జీయర్ అతని మాటలు విన్న తర్వాత, “నీవు భగవానుని విశేష కృపకు పాత్రుడవైనావు. నీ కోరిక ఏమిటి?” అని అడిగారు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “మోక్షం సాధన ఉపాయమైన మంత్రాన్ని తనియన్‌ రూపంలో అందుకున్నాను; అడియేన్ మంత్రప్రద ఆచార్యుడి (మంత్రం ఉపదేశించిన వారు) రూపంలో తిరుమలై అప్పన్ ని పొందాను; అడియేన్ మంత్ర ప్రతిపాధ్యా దేవత (ఆ మంత్రం ద్వారా పొందిన వ్యక్తి) అయిన దేవర్వారిని పొందాను. ఇక అడియేన్ కోరదగినది ఇంకేముంది?” అని చప్పట్లు కొడుతూ నాట్యం చేశాడు.

అది వినగానే జీయర్ ఈ శ్లోకాన్ని పఠించారు

మత్రేత్ దేవతాయాంచ తథామంత్రప్రదే గురౌ
త్రిషుభక్తిస్సదాచార్యా శాసిప్రతమసాధనం

(మూడిటి పట్ల నిరంతరం మన భక్తి ప్రపత్తులని చూపాలి. అవి మంత్రం, ఆ మంత్రంలో వివరించబడిన దేవత, ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుడు; అటువంటి భక్తియే భగవానుని పొందేందుకు సాధనమౌతుంది), ఆటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడని చెప్పండి. ఈ మూడు గుణాలు వీరిలో ఉన్నాయి, అర్హత పొందడానికి కావాల్సిన గుణం ఇదే కదా! వారు హర్షించి పంచ సంస్కారాలను నిర్వహించి అతనికి “తిరువేంగడరామానుజదాసర్” అను దాస్య నామం ప్రసాదించారు. పెరుమాళ్ళు కూడా అతనిని “ఓ తిరువేంగడరామానుజ దాసు! అని సంబోధించి, “రండి! మేము మీకు మేల్వీడు (శ్రీవైకుంటం) ప్రసాదిస్తున్నాము” అని చెప్పి వారికి శ్రీ శఠగోపురాన్ని అందించారు. వెంటనే ఆ వ్యక్తి తిరునాడు (శ్రీవైకుంఠం) ని అధీరోహించాడు. అక్కడ సమావేశమైన ప్రముఖులందరూ వారికి విధి పూర్వకంగా తగిన చరమ సంస్కారాలు నిర్వహించి, జీయరుని కొనియాడారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/04/yathindhra-pravana-prabhavam-77-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment