యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 78

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 77

తిరుమాలిరుంజోలై అళగర్ ఈ తనియన్ ప్రచారం చేసెను

మణవాల మాముణుల తిరువడి సంబంధం ఉన్న ఒక జీయర్, అళగర్ తిరుమల (తిరుమాలిరుంజోలై) లో వివిధ కైంకర్యాలు చేస్తుండేవారు. అతను తమ ఆచార్యులు పెరియ జీయర్ల ఆత్మగుణాలను, విగ్రహగుణాలను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవారు. అతను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అందరూ నిత్యం జపించగలిగే ఒక తనియన్ (మణవాళ మాముణుల గురించి) పెద్దలనుండి వెలువడాలని మననం చేస్తూ ప్రదక్షిణగా విశ్వక్సేనుని సన్నిధికి చేరుకున్నారు. విశ్వక్సేనుని తిరువారాధన చేయడానికి ఒక అర్చాకుడు అక్కడికి వచ్చి సేవ నిర్వహిస్తున్నాడు. అతను ఈ క్రింది శ్లోకాన్ని బిగ్గరగా పఠించి తిరువందిక్కాప్పు (విగ్రహానికి రక్షణగా కర్పూర హారతి ఇచ్చుట) సేవ చేశాడు.

శ్రీశైలసుందరేశస్య కైంకర్యనిరతోయతిః
అమన్యత గురోస్స్వస్య పద్యసంభవం ఆర్యతః

(తెఱ్కు తిరుమల (దక్షిణ తిరుమల) లో అళగర్ పెరుమాళ్ళ కైంకర్యంలో ఉన్న జీయర్, ఉత్తముని నోటి నుండి తనియన్ వెలువడాలని భావించి), తమ నిత్య సేవను నిర్వహించడానికి పెరుమాళ్ళ సన్నిధికి వెళ్లాడు. ఆ సమయంలో, మణవాళ మాముణుల తిరువడి సంబంధం ఉన్న సేనై ముదలియార్ అనే ఒక వ్యక్తి, దక్షిణంలో ఉన్న వివిధ దివ్య దేశాలకు మంగళాశాసనం చేస్తూ, అళగర్ పెరుమాళ్ళను సేవిచడానికి అళగర్ కొయిల్‌కి చేరుకున్నరు. అతనిని చూసి జీయర్ సంతోషించి, సన్నిధికి తీసుకెళ్లారు. అళగర్ పెరుమాళ్ళు సేనై ముదలియార్ కు తీర్థం శఠారీలు అందించి తమ కృపను వారిపై కురిపించి అర్చక ముఖేన ఇలా అన్నాడు.

జిహ్వాగ్రే తవవయామి స్థిత్వావ సుపావనం
పద్యం త్వధార్యవిషయం మునేరస్య మమాజ్ఞయా

(నీ ఆచార్యుడు, మణవాళ మాముణుల ఏది అత్యంత ప్రీతికరమైనదో పవిత్రమైనదో, నేను నీ నాలుకపై కూర్చుని పారాయణం చేయబోతున్నానని మా ఆజ్ఞగా ఈ జీయర్‌కి చెప్పండి). ఇది విన్న సేనై ముదలియార్, ఆ శ్లోకంలో చెప్పినట్లు

ధన్యోస్మీతిచ సేనేశ దేశికోవదత స్వయం
వహన్శిరసి దేవస్య పాదౌ పరమపావనౌ

(సేనై ముదలియార్, అళగర్ పవిత్రమైన దివ్య పాదాలను తమ శిరస్సుపై ఉంచుకుని, గొప్ప అనుగ్రహంగా భావించి ఆ శ్లోకం పఠించారు), శ్రీ శఠారిని తమ శిరస్సుపై ఉంచుకుని, ‘శ్రీశైలేశ దయాపాత్రం’ తనియన్ ను సేవించారు. ఇది విన్న అర్చకుడు కూడా జీయర్ ను చూసి ఆ శ్లోకాన్ని పఠించారు. మరు క్షణం, సేనై ముదలియార్ మరియు ఆ అర్చకుడు ఇద్దరూ ఆ శ్లోకాన్ని మరచిపోయారు. వారిద్దరూ జీయర్ మఠానికి వెళ్లి జీయర్ను ఆ తనియన్ ను పఠించమని ప్రార్థించారు. “మీరు కదా అ తనియన్ ను సేవించారు. మీరు వినాలనుకుంటున్నారా?” అని జీయర్ ప్రశ్నించారు. సెనై ముదలియార్ “అడియేన్‌ ఏమీ ఎరుగడు. సుందరరాజర్ (తిరుమాలిరుంజోలై అళగర్ తిరునామం) స్వయంగా సుందరజామాతృముని (అళగియ మణవాళ మాముని) పై పాడినది” అని అన్నారు. జీయర్ ఆ తనియన్ ను పఠించారు, ముగ్గురూ పరవశులై ఆ తనియన్‌ ను తమ ఆశ్రయంగా స్వీకరించారు.

సేనై మొదలియార్ ఎంతో ఆతృతతో కోయిల్ (శ్రీరంగం) కి వెళ్లి ఈ సంఘటన గురించి అందరికీ చెప్పాలనుకున్నారు. శ్రీరంగానికి చేరుకుని జీయర్ గోష్ఠికి సాష్టాంగములు సమర్పించుకొని, జరిగిన సంఘటన గురించి అందరికీ వివరించారు. అది విన్న అందరూ, “తిరువేంకటేశ్వరుడు మరియు అళగర్లకు ఎంతో ప్రీతికరమైన దానిని మీరు వెలికి తీసుకొచ్చారు! ఎంతటి అనుగ్రహం!” అని ఆనందించారు.

జీయర్ను వానామామలై జీయర్ కీర్తించుట

వానమామలై రామానుజ జీయర్ పారవశ్యంతో నిశ్చేష్టులై ఉండిపోయారు. జీయర్ అతని చేతులను తాకి, “నీ ఆనందాన్ని ప్రకటిస్తూ కొన్ని మాటలు చెప్పండి?” అని అన్నారు. వానమామలై జీయర్ వెంటనే కందాడై అన్నన్ వైపు చూసి “రెండు రొమ్ముల నుండి పొంగి శ్రవిస్తున్న పాలను గ్రహిస్తున్నది మనమే కదా!” [ఇక్కడ జీయర్ తనియన్ లోని రెండు పంక్తులను సూచిస్తుంది]; అణ్ణన్ “దేవర్వారు చెప్పిన విధానం ఆ పాల కంటే తీయగా ఉంది” అని అన్నారు; ప్రతివాది భయంకరం అణ్ణా, అణ్ణన్ ను పొగుడుతూ, “మీరిద్దరి మాటలు ఒకరికంటే ఒరరిది గొప్పదిగా ఉంది!” అని అన్నారు; దీనికి అప్పిళ్ళై జోడిస్తూ, “ఈ మంత్ర రత్నంలో రెండవ పంక్తి [దీనిని ద్వయ మహా మంత్రం లేదా మణవాళ మాముణుల తనియన్‌ గా తీసుకోవచ్చు] మొదటి పంక్తి కంటే గొప్పది” అని అన్నారు; భట్టర్ పిరాన్ జీయర్ “శఠగోప ద్వయం, ద్వయ మహా మంత్రం కంటే గొప్పది; శఠగోప ద్వయం కంటే రామానుజ ద్వయం గొప్పది; మా ఆచార్యుని నమస్కరించే ఈ తనియన్ అంతకంటే గొప్పది”, అంటూ జీయర్ మహిమలను అనర్గళంగా కొనియాడారు.

వాఖ్య ద్వయం:

శ్రీమన్ నారాయణ చరణౌ శరణం ప్రపద్యే
శ్రీమతే నారాయణాయ నమః 

శఠగోప ద్వయం:

శ్రీమన్ శఠగోప చరణౌ శరణం ప్రపద్యే
శ్రీమతే శఠగోపాయ నమః 

రామానుజ ద్వయం:

శ్రీమన్ రామానుజ చరణౌ శరణం ప్రపద్యే
శ్రీమతే రామానుజాయ నమః 

పాద ద్వయం:

శ్రీశైలేశ దయా పాత్రం ధీభక్త్యాధి గుణార్ణవం
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం 

మూలము: https://granthams.koyil.org/2021/10/05/yathindhra-pravana-prabhavam-78-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment