యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 79

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 78

ఉత్తర దివ్య దేశాల పెరుమాళ్ళను స్మరించిన పెరియ జీయార్

జీయర్ ఒకరోజు తెల్లవారు జామున తిరుమలయాళ్వార్ (కాలక్షేప మండపం) కు వెళ్లి, దివ్య దేశాలను స్మరించుచున్నారు. దీనమైన మనస్సుతో దాదాపు నాలుగు గంటల పాటు అలాగే దివ్యదేశాల నామ స్మరణ చేశారు. “సింధిక్కుం దిశైక్కుం తేరుం కై కూప్పుం”, “వెరువాదాళ్ వాయ్ వెరువి”, “ఇవఱిరాప్పగల్ వాయ్ వేరీ” అంటూ అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) పాశురాలను స్మరింస్తూ నిస్సహాయ స్థితిలో ధ్యానిస్తున్నారు. అప్పటికే కలాక్షేపం కోసమని ఆచార్యులు వచ్చి ఉన్నారు, మరికొందరు రావలసి ఉంది. ఈ శ్లోకంలో వివరించబడి ఉంది

అవ్యాజభందోర్ గరుడధ్వజస్య దివ్యాఞ్చిధాన్యాయతనానిభూయః
ధ్యాయంస్థమోనాశకరాణి మోహావశాత్తదేవప్రహరత్వయంసః
ధ్యాత్వా దివ్యాఞ్చిధార్చా విలసితనిలయాన్యౌత్తరాణ్యాసు
విష్ణోః తత్సేవా యత్తచిత్తే ప్రణిగతతిముహుర్నామతః తాని తాని
తూష్ణీం భూతేస భాష్పం సపుళగనిచయం రమ్యజామాతృయోగి న్యప్
యేత్యానమ్యసర్వే కిమితమితి పరామార్థిం ఆపుర్మహాంతః

(మణవాళ మాముణులు, గరుడ ధ్వజ స్తంభ రూపంలో ఉన్న దివ్య దేశాలను, అందరి బంధువైన భగవానుని ధ్యానం చేయుచున్నారు. వారు అనుభవానికి లోనై సుమారు యాభై నిమిషాల పాటు ఆ స్థితిలోనే ఉన్నారు. భగవాన్ తమ అర్చావతార స్వరూపాన్ని దర్శనమిస్తున్న ఉత్తర దేశపు దివ్య దేశలను వారు ధ్యానిస్తూ, ఆ దివ్యాదేశాలను దర్శించాలని ఆశించి వాటి దివ్యనామ జపం చేశారు. వారి శరీరం నిక్కపొడుచుకొని, కన్నుల నుండి కన్నీరు కారుతున్నాయి. ఆ స్థితిలో వారి శిష్యులు కొందరు వారిని చూచి ఆశ్చర్యపోతూ, ఏమి జరుగుతుందోనని అయోమయ స్థితిలో వారికి సాష్టాంగ నమస్కారం చేసారు). జీయర్ “కిళర్ ఒళి ఇలమై కెడువదన్ మున్నం” (తిరువాయ్మొళి 2-10-1) వంటి కొన్ని పాశురములను పఠిస్తున్నారు. వారు ఉత్తరాన ఉన్న అయోధ్య మొదలైన దివ్యదేశాలను స్మరిస్తూ బాధతో, “ఈ దివ్య క్షేత్రాలను సేవించుకునే అదృష్టం నాకు లేకపోయింది” అని అనుకున్నారు. అక్కడ ఉన్న అష్టదిగ్గజ ఆచార్యులు ఏమి జరిగుతుందని ఆశ్చర్యపోతూ బాధపడ్డారు. వాళ్ళు ఓదార్చడానికి ప్రయత్నించిననూ, జీయర్ కళ్ళెంబడి కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. వారి ఈ స్థితిని చూసి ఆచార్యులందరూ దుఃఖించసాగారు. అదే సమయంలో, “కండియూర్ అరంగం మెయ్యం కచ్చి పేర్ మల్లై” అని పేర్కొన్న విధంగా, చరమపర్వ (ఆచార్యుడే సర్వస్వంగా భావించే అత్యున్నత స్థితి) స్థితిలో దృఢ నిశ్చయులై, జీయర్ తిరువడికి విశ్వాసపాత్రులై ఉండి, దివ్యదేశంలో కైంకర్యం చేస్తున్న రామానుజ దాసర్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ క్రింది శ్లోకం ద్వారా చెప్పబడింది.

సమేత్య రామానుజదాస నామావ్య జిజ్ఞ బద్ధం వరయోగివర్యం
నిషేవ్య సర్వాణి పధాని విష్ణోః సమర్పయిష్యామిత్తైవ తత్వః

(రామానుజ దాసర్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తమ ఒక విన్నపాన్ని వ్యక్తపరచారు. “అడియేన్ విష్ణువు దివ్యదేశాలను దర్శించుకొని తిరిగి వచ్చి ఆ సేవను దేవర్వారి తిరువడి యందు సమర్పించు కోవాలనుకుంటున్నాను” అని విజ్ఞప్తి చేసాడు.) జీయర్ వద్దకు వెళ్ళి “రామానుజ దాసర్ అను ఈ అడియేన్ దేవర్వారి దివ్య పాదాలను మార్గదర్శిగా ముందుంచి, ఉత్తర దివ్య దేశాలకు వెళ్ళి, దేవర్వారి మంగళాశాసనాలుగా ఆ పెరుమాళ్ళను సేవించి వచ్చి వాటన్నింటినీ దేవర్వారి పాదాలకు సమర్పించుకుంటాడు” అని చెప్పాడు. ఈ క్రింది శ్లోకంలో చెప్పిబడింది

ఆసేతోరాపదర్యాశ్రమవరనిలయా దాసపూర్వాపరాప్తేః
క్షేత్రాణి శ్రీధరస్య ధృహిణ శఠజితాధ్యంచితాని ప్రణమ్య
ప్రాప్స్యేరామానుజోయం భవదనుజయధనుచతశ్చిత్తయంస్థవత్
పదావిద్యస్మిన్ విగ్యాపయిత్వా ప్రణమతి భుభుతేసౌమ్యజామాతృ యోగీ

(రామానుజ దాసర్ మణవాళ మాముణుల దివ్య పాదాలకు నమస్కరించి ఇలా అన్నారు, “ఉత్తర దేశంలోని భద్రికాశ్రమం నుండి దక్షిణంలోని సేతు వరకు, ఇటు తూర్పు మహాసముద్రం నుండి పడమర సముద్రం వరకు అన్ని ప్రాంతాలలో సకల దేవతలు, ఆళ్వార్లు ఆరాధించిన విష్ణువు యొక్క దివ్యదేశములను సేవించుకోలేదే నని దేవర్వారు బాధపడుతున్నారు. అడియేన్ దేవర్వారి తిరువడిని ధ్యానిస్తూ ఈ దివ్యాదేశాలకు వెళ్లి పెరుమాళ్ళను సేవిస్తాను” అని అన్నారు; ఈ మాటలు విన్న వెంటనే మాముణులు తమ ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చారు) రామానుజ దాసర్ జీయరుకి విజ్ఞప్తి చేసి సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే, జీయర్ తమ నేత్రాలను తెరిచి “ఓ రామానుజ దాసర్! రమ్ము!” అని పలికారు. అక్కడ ఉన్న అష్టదిగ్గజులు, ఆచార్యులందరి మనస్సు కుదుటపడి రామానుజ దాసర్ను కొనియాడారు. జీయర్ పైకి లేచి నిలబడి “ఎంతో కాలం గడిచిపోయింది, కలాక్షేపం చేయలేదు” అని అన్నారు. అక్కడ ఉన్న వారు, “దేవర్వారు అనుభవించిన దివ్య దేశ అనుభవాన్ని మేము సేవించి అనుభవించలేకపోయాము, ఎంతో కలరవరబడ్డాము.” అని అన్నారు. వెంటనే జీయర్ రామానుజ దాసర్ తో “ఓ రామానుజ దాసా! నీవు ఇప్పుడు చెప్పినది సంభవిస్తుందా?” అని అడిగారు. దాసర్ వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. జీయర్ తిరువడి సంబంధం ఉన్న కుమాండూర్ ఇళైయాళ్వార్ పిళ్ళైని పిలిచి, “నీవు రామానుజ దాసర్‌ తో వెళతావా?” అని అడిగారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పిబడినట్లు, వారు మహా భాగ్యమని అన్నారు.

తతోన్యయుంగ్త స్వగముత్తరీయం విధీర్య రామానుజదాసమాశు
సహస్వ పాదావని నిత్య యోగ మహోజుషాయాచిక లక్ష్మణేన

(తరువాత, జీయర్ కృపతో తమ ఉత్తరీయాన్ని రామానుజ దాసర్ కు ఇచ్చి, తమ దివ్య చరణ సంబంధ గొప్పతనం ఉన్న ఇళైయాళ్వార్‌ తో వెళ్ళమని దాసర్ ను ఆదేశించారు) రామానుజ దాసర్ కు తమ పై వస్త్రం ఇచ్చి, కుమాండుర్ ఇళైయాళ్వార్‌ కు తమ చరణ పాదుకలను ఇచ్చి త్వరగా ప్రయాణం చేయమని ఆదేశించారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/06/yathindhra-pravana-prabhavam-79-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment