శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఇళైయాళ్వాఅర్ పిళ్ళై మరియు రామానుజ దాసర్ యాత్రకు పూనుకొనుట
చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) తన పాదుకలను భరతునికి ఇచ్చినప్పుడు, లక్ష్మణుడికి (ఇళైయ పెరుమాళ్) ఆ భాగ్యం కలుగలేదు. ఇళయ పెరుమాళ్ళ దివ్య నామం ఉన్న ఇళైయాళ్వార్ పిళ్ళై, జీయర్ పాదుకలను పొందినప్పుడు, వారు అందరికీ ఆనందాన్ని కలిగించారు. రామానుజ దాసరుకి న ఉత్తరీయం ఇచ్చినట్లే, ఇళైయాళ్వార్ పిళ్ళైకి తమ ప్రతినిధిగా పాదుకలను ప్రసాదించారు. ఇళైయాళ్వార్ పిళ్ళై ఆ పాదుకలను స్వీకరించి, ఆళవందార్ తమ స్తోత్ర రత్నంలో “ధనం మధీయం తవ పాద పంకజం” (మీ దివ్య చరణ కమలాలు నాకు నిధి లాంటివి) అని చెప్పినట్లు అతను గొప్ప నిధిని పొందినట్లు భావించాడు. “మదీయం మూర్ధానం అలంకరిష్యతి” (అవి నా శిరస్సుకి అలంకరణ వంటివి) లో చెప్పబడినట్లుగా, తన దివ్య శిరస్సుపై ఆ పాదుకలను ఉంచుకొని అంతులేని ఆనందానుభూతిని పొందాడు. నాచ్చియార్ తిరుమొళిలో “పెరుమాళ్ అరైయిల్ పీతగవాడై కొండు ఎన్నై వాట్టం తణియ వీసీర్” (పెరుమాళ్ నడుముపై ధరించిన ఆ పట్టు పీతాంబరంతో నా అలసట తీరే వరకు వీయండి) అని చెప్పినట్లుగానే రామానుజ దాసర్ కూడా ఆనందించారు.
వారిరువురూ తిరువారాధాన పెరుమాళ్ళను తమతో తీసుకెళుతున్నట్టుగా నిధి వంటి ఆ రెండు పాదుకలను మోసుకెళ్ళి ఆత్రుతగా గంగా నది ఒడ్డుకు చేరుకున్నారు. జీయర్ పాదుకలకు వారు శాస్త్రానుసారంగా గంగా నదిలో దివ్య స్నానం గావించారు. జీయర్ స్వయంగా అక్కడ స్నానమాచరిస్తున్నట్టు ఊహించుకుని అదే జలంలో వారునూ స్నానం గావించారు. ఆ ప్రాంతంలో ఉన్న స్థలాలను సేవించారు.
క్రమేణ తీర్థాని శరీర భాజాం పాపాపహాన్యుర్జిత సౌక్యతాని
పరిక్రమందావత్తిం దృశోస్థౌ వినిన్యసుః శ్రీబదరీనివాసం
విచిత్రాదేహసంపత్తిరీశ్వరాయ నివేదితుం
(ఆ ఇద్దరు (రామానుజదాసర్ మరియు ఇళైయాళ్వార్ పిళ్ళై) ప్రజల పాపాలను పోగొట్టగల మరియు సర్వోత్కృష్టమైన సౌఖ్యాన్ని ఇవ్వగల వివిధ దివ్య జలాల వద్ద సక్రమంగా స్నానం చేసి, శ్రీ బద్రికాశ్రమపు పెరుమాళ్‌ను సేవించారు) (అనేక రకాల శక్తులు కలిగిన చక్కని శరీరం మరియు దాని అవయవాలు భగవాన్‌కు కైంకర్యం చేయడానికి సృష్టించబడ్డాయి). ఈ స్లోకములలో చెప్పబడినట్లుగా, ఎవరికి దేహ పోషణ అనేది భాగవతార్థం (భగవంతుని కైంకర్యం కోసం) దివ్యదేశాలు (సర్వేశ్వరుని దివ్య నివాసాలు) వారి అన్ని అడ్డంకులను తొలగించి గొప్ప పురుషార్థాన్ని (ప్రయోజనం) అందిస్తాయి. రామానుజ దాసర్ మరియు ఇళయాళ్వార్ పిళ్ళై వారి మార్గంలో అటువంటి దివ్యదేశాలకు వెళ్లి, ప్పెరుమాళ్లకు మంగళాశాసనం చేస్తు బద్రి చేరారు.
అయోధ్య రామానుజదాసనామా సతా ముతా పూజయతి ప్రసన్న:
వశీనిజశ్రీకులశెకరస్సన్ హరిం బదర్యాశ్రమ వాసినంతం
(అయోధ్యా రామానుజ దాసర్ అనే పేరుగల వ్యక్తి, శ్రీవైష్ణవ కులానికి ఆభూషణం వంటి వారు. నిత్య ప్రఖ్యాతి చెందిన బదరికాశ్రమ పెరుమాళ్ళకు ఆనందంగా సేవ చేసేవారు), అందరి ఆదరణ ఉన్న అయోధ్యా రామానుజ దాసర్, సజ్జనుడు, వంశానికే నాయకుడు, వదరియాచ్చిరామ పెరుమాళ్ (బాదరియాశ్రమ పెరుమాళ్) కు దినవారి సేవలు నిత్యం చేసేవారు. ఈ శ్లోకంలో వివరించబడి ఉన్నట్లు-
సలక్ష్మణం వీక్ష్యపవిత్రరూపం సమేధ్య రామానుజదాసమేనం
సమర్చయిత్వా వివిధోపచారైస్స దర్శయామాస రమాసహాయం
(ఆ అయోధ్య రామానుజ దాసర్, శుద్ధస్వరూపుడైన ఇళైయాళ్వార్ పిళ్ళైతో కలిసి వచ్చిన రామానుజ దాసర్ ను స్వాగతించి అనేక విధాలుగా సత్కరించి, స్తుతించి, బద్రికాశ్రమ పెరుమాళ్ళ దర్శినం వారికి కలిపించారు) శ్రీరంగం నుండి వచ్చిన రామానుజ దాసర్ కు తమ నమస్కారాలు చేసి, వారికి నర నారాయణ పెరుమాళ్ళ దర్శనాన్ని కల్పించారు. నర నారాయణ పెరుమాళ్ల కొరకై విశేష ప్రసాదాలను తయారు చేసి పెరుమాళ్ళకు సమర్పించారు. ఆ తర్వాత వారిని దివ్య ప్రబంధం పఠించమని వారిని అభ్యర్థించారు. ఈ శ్లోకములో వర్ణించబడింది.
వరయోగివరాగతౌచైలతౌ నరనారాయణసన్నిధౌ పురస్థత్
ద్రమిడోపనిషన్మహాప్రబంధ ప్రథమోధాహరణే న్యయుంగ్తవిధ్వాన్
(మహా విద్వానులైన అయోధ్య రామానుజ అయ్యంగార్లు, మణవాళ మాముణుల సన్నిధి నుండి వచ్చిన ఈ ఇరువురిని నర నారాయణ పెరుమాళ్ళ సన్నిధిలో దివ్యప్రబంధం పారాయణం ప్రారంభించమని నియమనం చేశారు). ఈ క్రింద శ్లోకంలో వివరించబడి ఉంది.
తథా విధిగ్యోవిధివత్ ప్రసాదాత్వరోపయంతుర్ దురిరంగధామ్నా
నివేదితం పద్యవరం ద్వికంటం పతంజకౌ ద్రావిడవేదమేషః
(రామానుజ అయ్యంగార్ ఆదేశానుసారంతో సరైన క్రమాన్ని తెలిసిన ఇళైయాళ్వార్ పిళ్ళై, శ్రీ రంగనాధుడు దయాపూర్వకంగా పఠించన ‘శ్రీశైలేశ దయాపాత్రం’ తనియన్ పఠించడం ప్రారంభించారు. ఆపై దివ్య ప్రబంధం పఠించారు), ముందుగా ‘శ్రీశైలేశ దయాపాత్రం’ తనియన్ పఠించడం మొదలుపెట్టారు, ఆ తర్వాత దివ్య ప్రబంధ పాశురాలను పఠించారు.
మూలము: https://granthams.koyil.org/2021/10/06/yathindhra-pravana-prabhavam-80-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org