శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
కోయిల్ విరహంతో బాధపడుతున్న జీయర్
ఈ విధంగా ఆళ్వార్ తిరునగరిలో జీయర్ ఉండగా, మార్గళి మాసం (ధనుర్మాసం) ఆసన్నమైంది. ఎమ్పెరుమానార్ల తిరుప్పావై గొప్పతనాన్ని విని జీయర్, సేవించలేక పోతున్నానే అని బాధ పడ్డారు. [తిరుప్పావైతో ఎమ్పెరుమానార్లకు ప్రగాఢ అనుబంధం ఉండేది; వారిని తిరుప్పావై జీయర్ గా సూచిస్తారు, జీయర్ వారిని ఎంబెరుమానార్ల తిరుప్పావై అని పిలుస్తారు]; ఈ పాశురాన్ని రచించారు..
ఎందై ఎదిరాశర్ శిఱప్పై ఎళిల్ అరంగా
శిందై మగిళ్ందు అముదు శెయ్య – అంద నిలం
శెన్ఱు నిన్ఱు సేవిక్కుం సెల్వం ఇన్ఱు పెఱ్ఱిలమే
ఎన్ఱు సేవిక్కుం ఇని యాం?
(ఓ సుందరమైన శ్రీరంగనాధా! ఈనాటి రోజున నేను శ్రీరంగ కోయిల్ కు వెళ్ళి, ఆలయంలో నిలబడి, నా స్వామి అయిన రామానుజులను స్తుతించి, సంతోషించి, అదే భోగ్యంగా భావించి, దర్శించుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఇక ఎప్పుడు దర్శిస్తానో? )
సంక్రమణం (దక్షినాయనం నుండి ఉత్తరాయణం సంక్రమణం, తై మాసం (మకర మాసం) ప్రారంభంతో) ప్రారంభమైనప్పుడు, జీయర్ నిరుత్సాహంతో ఈ పాశురాన్ని పఠించారు.
శీరరంగర్ తం దేవియరోడు శిఱప్పుడనే
ఏరారుమాఱన్ కలియన్ ఎదిరాశనోడు అమర
ప్పారోర్ మగిళ్ందేత్తుం తట్టుక్కళ్ తన్నుడన్ పోఱ్ఱ మంద
ప్పేరార వార్ త్తై ఇన్ఱు కండు ఇన్బుఱ ప్పెఱ్ఱిలమే
(నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, రామానుజులు, ఉభయ దేవేరులతో కలిసి ఆసీనులై ఉన్న శ్రీ రంగనాధుని దర్శించుకునే భాగ్యం నాకు లేకపోయింది. అందరు ఎంతో ఆనందంతో అడుగులు వేస్తూ, వారిని గొప్పగా స్తుతించే ఆ దృశ్యాన్ని నేను వీక్షించ లేక పోతున్నాను)
తై త్తిరునాళ్ (శ్రీ రంగంలో మకర మాస ఉత్సవాలు) ఉత్సవాలను గుర్తు చేసుకుంటూ ఈ పాశురాన్ని పఠించారు.
దేవియరుం తాముం తిరుత్తేరిన్ మేల్ అరంగర్
మేవి విక్కిరమన్ వీధి తనిల్ – సేవై శెయుం
అంద చ్చువర్ క్కత్తై అనుబవిక్క ప్పెఱ్ఱిలమే
ఇంద త్తిరునాళిలే నాం
(ఈ పవిత్రమైన రోజున, ఉభయ దేవేరులతో కలిసి నంపెరుమాళ్ళు దివ్య రథంపై ఆసీనులై తిరువిక్కిరమన్ వీధి (శ్రీరంగం ఆలయం ఏడు ప్రాకారాలలో ఒకటి) విహార అద్భుత దర్శనం నాకు కాలేదే!)
‘అణియరంగం ఆడుధుమో’, ‘తిరువరంగ ప్పెరునగరుళ్ తెణ్ణీర్ ప్పొన్ని తిరైక్కియాల్ వరుడి ప్పళ్ళి కొళ్ళుం కరుమణియై క్కోమళత్తై క్కణు కొండు ఎన్ కైణ్ణిణైగళ్ ఎన్ఱు కొలో కళిక్కుం నాళే’ (కులశేఖర ఆళ్వర్ల పెరుమాళ్ తిరుమొళి పాశురం 1.1.1), ‘ఊరరంగం ఎన్బదు ఇవళ్ తనక్కు ఆశై’ మొదలైన ఆళ్వార్ల పాశురాల మననం చేసుకుంటూ, శ్రీరంగ ఉత్సవ రోజులను అనుభవించ లేకపోతున్నానేనని దుఃఖించారు. జీయర్ తమ మనస్సులో ఆర్తితో, ఆళ్వార్ సన్నిధికి వెళ్లి ఈ పాశురాన్ని పఠిస్తూ మంగళాశాసనం చేసారు.
తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తు చ్చెవి ఎన్ఱుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరాశర్ క్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగావణ్ణం కాత్తరుళ్వోన్ వాళియే
కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాళియే
వరుత్తం అఱ వందు అన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తం పిరాన్ వాళి వాళి వాళియే
(తిరుక్కురుగూర్ స్వామి దివ్య తిరువడి చిరకాలం వర్ధిల్లాలి! ఆ దివ్య ముఖ తేజస్సు చిరకాలం వర్ధిల్లాలి! ఋగ్వేదం దివ్య వాక్కులు నా హృదయంలో నిలిచిపోయేలా చేసిన ఆ తీరు చిరకాలం వర్ధిల్లాలి! నా స్వామి అయిన రామానుజుల స్వామి చిరకాలం వర్ధిల్లాలి! మరొక గర్భంలో పడకుండా నన్ను కాపాడిన తీరు చిరకాలం వర్ధిల్లాలి! ఆ మహోన్నత వ్యక్తి చూపిన ఈ బాట చిరకాలం వర్ధిల్లాలి! ఏ పశ్చాత్తాపం లేకుండా జీవించడంలో నాకు తోడ్పడిన తీరు చిరకాలం వర్ధిల్లాలి! మధురకవి ఆళ్వార్ల ఉద్ధరణ పొందినవారు చిరకాలం వర్ధిల్లాలి!)
జీయర్ నమ్మాళ్వార్ల అనుమతి తీసుకుని తిరుక్కురుగూర్ నుండి బయలుదేరి, శ్రీవిల్లిపుత్తూర్ చేరుకుని, ఆలయంలోకి ప్రవేశించి, భట్టర్పిరాన్ (పెరియాళ్వార్, పొంగుం పరివు (పెరుమాళ్ పట్ల పొంగిపోతున్న భక్తి) ఉన్నవాడు) అలాగే వడపెరుం కోయిలుడైయాన్ (విశాల మందిరంలో ఒక మర్రి ఆకుపై కొలువై ఉన్నవాడు)ని సేవించుకున్నారు. ఆ తర్వాత వారు నాచ్చియార్ నివాసంలోకి ప్రవేశించి, ‘ఆళ్వార్ తిరుమగళార్ ఆండాళ్’ (పెరియాళ్వార్ దివ్య కుమార్తె అయిన ఆండాళ్) దివ్య చరణాలను దర్శించుకున్నారు. కోదై (ఆండాళ్ కు ఉన్న మరో పేరు, పెరుమాళ్‌ను అలంకరించే ముందు తాను ఆ మాల ధరించినందుకు ఆ పేరుతో పిలుస్తారు) వీరిపై తన కృపను కురిపిస్తూ, “కోయిలణ్ణన్ పునరవతారము కాదా నీవు!” అని పలికెను. ఆండాళ్ అనుగ్రహంతో, ‘అళగన్ అలంగారన్ మలైయాన్ సుందరత్తోలుడైయాన్’ (అందమైన భుజాలు గలవాడు, తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్నవాడు) దర్సించుకోడానికి అళగర్ కోయిల్ కు బయలుదేరారు. ఆండాళ్ అనుగ్రహంతో, అందంగా అలంకరింపబడిన ‘అళగన్ అలంగారన్ మలైయాన్ సుందరత్తోలుడైయాన్’ (అందమైన భుజాలు గలవాడు, తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్నవాడు) దర్శించుకోడానికి అళగర్ కోయిల్ కు బయలుదేరారు. పరమ స్వామిని (తిరుమాలిరుంజోలై మూలవర్ల పేరు) సేవించుకున్నారు. ‘అళగర్’ ఉత్సవర్లను తిరుక్కురుంగుడికి తరలించారని తెలిసింది. పెరియాళ్వార్ల పాశురం “నల్లాదోర్ తమరై ప్పొయ్గై నాణ్మలర్మేల్ పనిశోర అల్లియుం తాదుం ఉదిర్ందిట్టు అళగు అళిందాలొత్తదాలో, ఇల్లం వెఱిచ్చోడిఱ్ఱాలో ఎన్ మగళై ఎంగుం కాణేన్” (అందమైన సరస్సులో నిండుగా వికసించిన తామర పుష్పం పైన మంచు పడితే, ఆ పుష్పం లోపలి, బయటి రేకులు పడిపోతాయి; అలాంటిది జరిగినప్పుడు, కమలం దాని అందాన్ని కోల్పోతుంది. నా కూతురు ఎక్కడా కనిపించనందుకు, అందం కోల్పోయిన కమలం వలెనున్నది నా ఇల్లు ఇప్పుడు), అలాగే, అళగర్ ఆలయంలో లేనందుకు, ఈ ఆలయం కూడా అందం కోల్పోయినట్లుగా కనిపించింది. “పుత్ర ద్వయ విహీనం తత్” (రామ లక్ష్మణులద్దరు లేని ఇల్లు వంటిది) అని చెప్పినట్లుగా భావించి బాధపడ్డారు. ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళి 9-6 వ పాశురంలో “నాఱు నఱుం పొళిల్ మాలిరుంజోలై నంబిక్కు” (సువాసనలు వెదజల్లే తోటలున్న తిరుమాలిరుంజోలైలో నివాసమున్న ఆ పెరుమాళ్ళు) అని పలికినట్లుగా, రామానుజుల మాదిరిగానే, వీరు అన్ని పదార్థాలను తెచ్చి వాటితో ప్రసాదాన్ని తయారు చేసి, పెరుమాళ్లకు సమర్పించారు. ఆ ప్రసాదాన్ని భుజించినందుకు ‘కైక్కూలి’ (లంచం) గా, వీరు నాచ్చియార్ తిరుమొళి 9-7 వ పాశురం “పిన్నుమ్ ఆలుమ్ సెయ్వన్”, పెరియాళ్వార్ తిరుమొళి 5-3 పాశురం ‘ఉన్ పొన్నడి వాళ్గ’ పఠించి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసారు. పరమస్వామి యొక్క దివ్య ముఖారవిందాన్ని సేవించి, సత్య పలుకులు చెప్పే ఆళ్వార్ల పాశురం “నంగల్ కున్ఱం కైవిడాన్” (మా నివాసాన్ని విడిచివెళ్ళ నివ్వకుండా) సత్యంగానే ఉండాలని ప్రార్థించారు [ఉత్సవ మూర్తి త్వరగా తిరిగి రావాలని పెరుమాళ్‌ను ప్రార్థించారు).
మూలము: https://granthams.koyil.org/2021/10/16/yathindhra-pravana-prabhavam-90-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org