యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 95

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 94

తన దివ్య అవతార ఉద్దేశ్యము పూర్తవడంతో, అలుపెరగని నిత్యసూర్యులకు స్వామి అయిన శ్రీమన్నారాయణుడు నివసించే శ్రీ వైకుంఠానికి తిరిగి వెళ్లాలని జీయర్ సంకల్పించారు. జగత్తుకి మూలాధారుడైన అతని సుందర స్వరూపాన్ని అనుభవించాలని, ఆ అనుభవ ఫలితంగా ఉద్భవించే ప్రేమతో ఆ సర్వోన్నతునికి అన్ని సేవలు చేయాలని వారు ఆశించారు. వారి దివ్య మనస్సు యొక్క దృష్టి ఇప్పుడు శ్రీ వైకుంఠంపై కేంద్రీకరించడంతో, వారి దివ్య శరీరం అనారోగ్యం పాలై ఎటూ తిరగలేని స్థితికి చేరుకున్నారు. ఆ పరిస్థితి (కోయిల్ కు వెళ్ళలేని స్థితి) కారణంగా, పెరుమాళ్ళ దర్శనం పొందాలని ఆరాటపడ్డారు. ఈ పాశురం ద్వారా తమ కోరికను వ్యక్తపరిచారు.

తిరునాళుక్కాగ త్తిరువీధియిల్ అరంగర్
వరునాళుమాఱు అదు ఎందైక్కిన్ఱు పెరుమాళ్ తన్
అంద వడివళగైత్తాన్ ఓర్ నాళుం కాణేనే
ఇంద ఉడంబోడు ఇని

(ఆలయ ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాధుడు దివ్య తిరుమాడ వీధుల్లో విహరించే సమయమైంది. ప్రస్తుతం నేనున్న స్థితిలో పెరుమాళ్ల దివ్య స్వరూపాన్ని దర్శించుకోలేక పోతున్నాను).

ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లే

సత్సంబంధోభవతిహితం ఇత్యాత్మనైవ ఉపతిష్టం
  శిష్టాచారం ద్రడయితుమిహ శ్రీసకో రంగతుర్యః
ద్వారం ప్రాప్య ప్రదితవిభవో దేవదేవస్త్వధీయం
  దృష్ట్వైవత్వాం వరవరమునే దృశ్యతే పూర్ణకామః

(ఓ మణవాళ మాముని! ఎన్నో మహిమలు కలిగిన ఆ లోకనాధుడు, శ్రీమహాలక్ష్మీ పతి, మహా పురుషుల సాంగత్యం మహా ఫలితాన్ని ఇస్తుందని తాను స్థాపించిన ఆచారాన్ని దృఢంగా స్థాపించడానికి, శ్రీ రంగనాధుడు ఇక్కడ మన ఇంటి వాకిటిలోకి వేంచేసాడు; దేవరివారిపై తమ కృపను కురిపించి, అతను తమ కోరిక నెరవేరి సంతృప్తి పడినట్లు కనిపిస్తున్నారు), పట్టు పీతాంబరాలు ధరించి దివ్యాభరణాల దివ్య అలంకారముతో తిరుమాఢ వీధుల్లోకి వేంచేశారు. మణవాళ మాముణుల తిరుమాలిగ వద్దకు వచ్చి, ఎంతో సేపు ద్వారం వద్ద నిలబడి, మాముణులకు దర్శనం ఇచ్చారు. ఎండిన పంటకు తిరిగి జీవం పోసి అంకురింపజేయగల మేఘంలాగా, ‘నీడుపుగళ్ త్తెన్నరంగర్ దేవియరుం తాముమాగ వందు ఎన్నిడర్ తీర్థార్ ఇప్పోదు’ (విశ్వ ప్రఖ్యాతి గాంచిన శ్రీ రంగనాధుడు తన ఉభయ దేవేరులతో దర్శనమిచ్చి నా కష్టాలను తొలగించాడు) అన్న పాశురములో వర్ణించి నట్లుగా, పెరుమాళ్ళు తమ ఉభయ నచ్చిమార్లతో (శ్రీదేవి, భూదేవి) తమ దర్శనానుభవంలో మాముణులు మునిగేలా చేసి, వారి తపన బాధను చల్లార్చారు. ఉభయ నాచ్చిమార్లతో పెరుమాళ్ళ సాయుజ్యా అనుభవం పొందిన తర్వాత, పారవశ్యంలో మునిగిన మాముణుల దివ్య స్వరూపం మళ్లీ కదలలేని దీన స్థితిలోకి జారుకుంది. పెరుమాళ్ళు మళ్లీ మాముణుల తిరుమాలిగకు వచ్చి, నిలబడి, అర్చకరుని చేతిల ద్వారా మాముణుల దగ్గరకు వచ్చారు. మాముణులు పెరుమాళ్ళను సేవించుకొని ఈ పాశురాన్ని పాడారు.

పారారుం అణ్ణల్ ఇరామానుశ శీయర్
శీరారుం సేనై ముదలియార్ నాయనార్ ఆరాద
అన్బుడైయ ఆత్తాన్ అఱిందిలరే ఎన్నుడైయ
తున్బత్తైత్ తీర్థఱ్కుత్తాన్

(వానమామలై జీయర్, సేనై ముదలియార్, నాయనార్ తదితర శిష్యులు నా బాధను ఎలా తొలగించాలో తెలియనివాళ్ళు). జీయర్ తమ పరిస్థితిని వివరిస్తూ ఒక సందేశం ద్వారా వానమామలై జీయర్తో పాటు ఇతరులకు తెలియజేశారు. సందేశం అందిన వెంటనే, ఆ దివ్య సందేశాన్ని శిరస్సుపై పెట్టుకుని హడావిడిగా మాముణుల మఠానికి చేరుకున్నారు. వారి దివ్య పాదాలను సేవించుకున్నారు. వీరిని చూడగానే జీయర్ అనారోగ్యం మాయమైపోయింది. జీయర్ పరిస్థితి మెరుగుపడటం చూసి వానమామలై జీయర్ రామానుజ దర్శన (రామానుజుల తత్వశాస్త్రం) వ్యాప్తి కొరకై ఉత్తర దేశ పట్టణాలకు వెళ్ల వలసి వచ్చి, మాముణుల నుండి అనుమతి కోరారు. మాముణులు త్వరగా తిరిగి రమ్మని చెప్పి వెళ్ళమని అనుమతించారు. వానమామలై జీయర్ ఉత్తర ప్రదేశాలకు బయలుదేరారు.

[ప్రొఫెసర్ ఇరా అరంగరజాన్ స్వామి వారి పుస్తకం “మన్ను పుగళ్ మణవాళ మామునిగళ్” నుండి గమనిక: వానమామలై జీయర్ ఉత్తర భారత దేశ ప్రాంతాల ప్రయాణం చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వరవరముని సంప్రదాయాన్ని వ్యాప్తి చేసి ఇతర భాషలు మాట్లాడే వారికి అరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం) గొప్పతనాన్ని తెలియజేయడం; వాళ్ళకు తమ ద్వారా తమ ఆచార్యుడైన మణవాళ మాముణుల (పెరియ జీయర్) తిరువడి సంబంధాన్ని ఏర్పరచడం రెండవది. ఆ విధంగా, తిరువాయ్మొళి పిళ్ళై అని పిలువబడే శ్రీశైలేశర్ వానమామలై జీయర్ల పరమాచార్యులు. శ్రీశైలేశర్ల వైభవం దక్షిణ దేశంలోనే కాకుండా ఉత్తర భారత దేశంలో కూడా వ్యాపించి ఉంది. శ్రీ రామాయణాన్ని హిందీ భాషలో అద్భుతంగా స్వరపరిచిన తుళసి దాసు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తుళసి దాసు రామానుజ దర్శనానికి చెందినవారని, వారి పూర్వీకులకు శ్రీశైలేశర్లు ఆచార్యులుగా ఉండేవారని ప్రతీతి. మణవాళ మాముణులు మరియు వానమామలై జీయర్లు ఇద్దరు ఉత్తర దేశంలో మహా ప్రసిద్ధి ఉన్నవారు. ఈ కారణంగా మణవాళ మాముణుల ఆదేశాలను అనుసరించి వానమామలై జీయర్ లోకాచార్య సిద్ధాంతాన్ని (పిళ్ళై లోకాచార్యుల తత్వశాస్త్రం) ఉత్తర భారత దేశంలో వ్యాప్తి చేసేవారు. వీరు అనేక తోతాద్రి మఠాల నిర్మాణం చేసి అనేక మహంతులను (సంప్రదాయ అధిపతులు) అక్కడ స్థాపించారు].

మూలము: https://granthams.koyil.org/2021/10/22/yathindhra-pravana-prabhavam-95-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment