శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీ వైకుంఠానికి వెళ్లాలన్న జీయర్ కోరిక
కొన్ని రోజుల గడిచాక వానమామలై జీయర్ తమ యాత్రకై బయలుదేరారు. పెరుమాళ్ళ అనుభవం లేక జీయర్ (మాముణులు) మరలా ప్రాప్య భూమి (పొందవలసిన ఆ శ్రీ వైకుంఠం) పై తపనను పెంచుకుని, త్యాజ్యభూమి (త్యజించవలసిన ఈ సంసారం) పట్ల విరక్తి అయిష్టత పెంచుకున్నారు. పైగా, వారి చరమ లక్ష్యమైన ఉడయవర్ల (రామానుజులు) పట్ల తమ భక్తి ప్రపత్తులు రెట్టింపు అయినాయి. ఆ అనుభవాన్ని పొందకపోవడం వల్ల [ఈ సంసారంలో ఉన్నందున], కోరిక మరింత ప్రబలమైంది. దాని ఫలితంగా పరమ భక్తి (తమ లక్ష్యాన్ని చేరుకోకుండా ఉండలేనే ఒక భక్తి స్థితి) దశకు చేరుకున్నారు; ప్రతిరోజూ రామానుజులను విన్నపించేవారు; ఈ విజ్ఞప్తులే ఆర్తి ప్రబంధంగా (వారి కోరికను వ్యక్తపరిచే దివ్య స్తోత్రాలు) ముగిశాయి. వాళి ఎతిరాశన్ (రామానుజులు చిరకాలం వర్ధిల్లాలి) అనే వాక్యాలతో మొదలైయ్యి, ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం (రామానుజులు దివ్య తిరువడి యందు శరణు వేడుతున్నాను), ఇరామానుశాయ నమః (అడియేన్ కేవలం రామానుజులకు మాత్రమే చెందిన వాడను, మరెవరికీ కాదు); రామానుజులు ఆనందించే విధంగా అన్ని కైంకర్యాలను నిర్వహిస్తాను) అని మధ్య శ్లోకాలతో, ‘ఇంద అరంగత్తు’ (ఈ శ్రీరంగంలో) అంతిమ పాశురంగా, మొత్తం అరవై పాశురాలతో ఆర్థి ప్రబంధం తయారు అయ్యింది. ఆ తపన అంతటితో ఆగలేదు, తమను తాము జీయర్ ఓదార్చుకుంటూ, ఇలా అన్నారు.
ఎంపెరుమానారై త్తం పిరాన్ ఎన్నుం అవరై
నంపెరుమాళ్ తాముగందు నాళ్దోఱుం తం పరమా
ఏఱిట్టుక్కొండు అళిపర్ ఎన్నుం అవర్ తమ్మై
వేఱిట్టు త్తాం కై విడార్
(ఎంపెరుమానార్లను తమ స్వామిగా స్వీకరించిన వారిని ఉద్ధరించే బాధ్యతగా నంపెరుమాళ్ళు సంతోషంగా వహిస్తారు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అతడు నిరాశపరచడు)
వారు పూర్వాచార్యుల సహాయం కోరుతూ, ఈ పాశురాన్ని పఠించారు.
పొల్లాన్ ఇవన్ ఎన్ఱు పోదిడెన్ఱు నం కురవర్
ఎల్లారుం ఎన్నై ఇగళ్ందారో నల్లార్గళ్
వాళ్వాన వైగుందవాన్ సభైయిల్ వణ్కూరత్తు
ఆళ్వాన్ ఇరుందిలనో అంగు?
(ఈ వ్యక్తి [తనను సూచిస్తూ] దుర్మార్గుడని, శ్రీవైకుంఠానికి రాకూడదని మన పూర్వాచార్యులు నన్ను అలక్ష్యము చేస్తారా? శ్రీవైకుంఠంలో, ఆ ఉత్తముల గోష్ఠిలో, కురత్తాళ్వాన్ ఉపస్థితులై లేరా? (కురత్తాళ్వానుని ఇక్కడ ప్రస్థావించారు. ఎందుకంటే, చోళ రాజు సభలో తనకు, పెరియ నంబికి హాని కలిగించిన నాలూరాచ్చాన్ పిళ్ళై కోసం కూడా కురత్తాళ్వాన్ శ్రీవైకుంఠాన్ని కోరారు)
ఈ పాశురం ద్వారా, వారు శ్రీవైకుంఠంలో తన తరపున సిఫార్సు పాత్ర వహించే అనేక తత్వాలను వారు ప్రస్థావించారు.
ఆరియర్గాళ్! ఆళ్వీర్గళ్! అంగుళ్ళ ముక్తర్గళ్!
సూరియర్గళ్! దేవియర్గళ్! శొల్లీరో నారణఱ్కు
ఎంగళ్ అడియాన్ ఇవనుం ఈడేఱవేణుం ఎన్ఱు
ఉంగళ్ అడియారుం ఉళర్
(ఓ ఉత్తములారా! ఓ ఆళ్వార్లారా! అక్కడ ఉన్న ఓ ముక్తాత్మలారా! ఓ నిత్యసూరులారా (శ్రీవైకుంఠం నిత్య నివాసులు)! ఆ నిత్యసూరుల పత్నులారా! ఈ దాసుడు (మణవాళ మాముణులు, తనను తాను సూచిస్తూ) కూడా ఉద్ధరణ పొందాలని ఆ శ్రీమన్నారాయణునికి చెప్పగలరా?)
అతను పాశురముల ద్వారా శ్రీమహాలక్ష్మిని తన తల్లిగా భావిస్తూ ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెన్నరంగర్ దేవియే! సీరంగనాయగియే!
మన్నుయిర్గట్కెల్లాం మాతావే! ఎన్నై ఇని
ఇవ్వులగం తన్నిల్ ఇరుందు నలంగామల్
అవ్వులగిల్ వాంగి అరుళ్
(ఓ దక్షిణాన ఉన్న శ్రీ రంగనాధుని దివ్య పత్ని! ఓ శ్రీరంగ నాయకీ! సకల లోకాల జననీ! ఏ బాధ లేకుండా నన్ను నీవు ఈ సంసారం నుండి పైకెత్తుకెల్లి ఆ శ్రీవైకుంఠంలో ఉంచాలి)
సీరంగ నాయగియే! తెన్నరంగన్ దేవియే!
నారంగట్కెల్లాం నఱ్ఱాయే! మారుదిక్కు
వంద విడాయ్ తన్నై ఒరు వాసగత్తాల్ పోక్కిన నీ
ఎందనిడర్ తీరాదదు ఎన్?
(ఓ శ్రీరంగ నాయకి! శ్రీ రంగనాధుని దివ్య పత్ని! ఓ! సకల జీవ జననీ! హనుమంతుని తోకకు రావణుడు నిప్పంటించినప్పుడు, అతనికి ఏ హాని చేకూర కూడదని అగ్ని దేవుడిని వేడుకున్నావు; నీవు నా అవరోధాలను ఎందుకు తొలగించట్లేదు?)
పాశురంలో పేర్కొన్న విధంగా తమ ఆర్తిని వెల్లడి చేస్తూ పెరుమాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు
ఇంద ఉడంబోడు ఇని ఇరుక్క ప్పోగాదదుదాన్
శెంగమల త్తాళ్ తన్నైత్తందు అరుళ్ నీ అందో
మైయార్ కరుంగణ్ణి మణవాళా! తెన్నరంగా!
వైయామల్ ఇరుప్పాయే ఇంగు
(ఇక ఈ శరీరంతో ఉండటం సాధ్యం కాదు; దయచేసి మీ ఎర్రటి పాద పద్మాలను నాకు ప్రసాదించండి. నల్లని నేత్రాలు కలిగి ఉన్న శ్రీమహాలక్ష్మీ పతి! ఓ శ్రీ రంగనాధా! నన్ను ఇక ఈ లోకంలో ఉంచకుము)
“పెరుమాళ్ళ దాసులతో నేనెప్పుడు కలిసి సహవాసం చేస్తాను” అని తపనతో కులశేఖర ఆళ్వార్లకు విజ్ఞప్తి చేస్తూ ఈ పాశురము ద్వరా తెలుపుతున్నారు.
శెన్ఱు తిరుమాళ్ అడియార్ దెవ్యక్కుళాం కూడుం
ఎన్ఱుం ఒరు నాళామో? ఆళ్వారే! తున్ను పుగళ్
క్కమలం పాడినీరైయో అడియేనుం ఇక్ (వైవిధ్యం: కమలం పాడి నీఱైయా అడియేనుం ఇక్)
కమలం శేర్ కాయం విట్టు
(పెరుమాళ్ళ దాసులతో కలిసి సహవాసం ఇక చేస్తానా? ఓ ఆళ్వార్! మీరు ఎంబెరుమాన్ల దివ్య పాదాల గురించి పాడారు (వైవిధ్య అర్థం: ఎంబెరుమాన్ల దివ్య పాదాల గురించి పూర్తిగా పాడారు). ఈ భౌతిక స్వరూపాన్ని పక్కన పెట్టి ఆ దివ్య చరణాలను చేర గలుగుతానా?)
ఈ పాశురం ద్వారా తన పట్ల కరుణ చూపమని పెరుమాళ్ళకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నారు
ఇంద ఉడంబోడు ఇరువినైయాల్ ఇవ్వళవుం
ఉందన్ అడి సేరాదు ఉళల్గిన్ఱేన్ అందో
అరంగా! ఇరంగాయ్ ఎదిరాశరక్కాగ
ఇరంగాయ్ పిరానే ఇని
(నీ దివ్య పాదాలను పొందలేక, కర్మలు (పాప పుణ్యాలు) వేంటాడుతూ నేను ఈ భౌతిక శరీరంతో పోరాడుతున్నాను. అయ్యో! శ్రీ రంగనాధా! రామానుజుల కోసమైనా కరుణ చూపండి. ఓ మహోపకారి! ఇకనైనా నాపై కరుణ చూపండి).
తిరువిరుత్తం పాశురంలో “తిరువరంగా! అరుళాయ్ ఇనియున్ తిరువరుళన్ఱి కాప్పరిదాల్” (ఓ శ్రీరంగనాథా! నీ కరుణను కురిపించు. నీ దివ్య అనుగ్రహం లేకుండా, ఆమెను రక్షించడం అసాధ్యం) చెప్పినట్లుగా, చెట్లు కూడా కరుణ చూపుతాయని తన ఆర్తిని వ్యక్తపరచుచున్నారు. కృపను కోరుతూ రామానుజుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీవైకుంఠం చేరుకోకపోతే తన భారము తాను మోయలేని పరిస్థితికి చేరుకున్నానని వారు వేడుకుంటున్నారు.
మూలము: https://granthams.koyil.org/2021/10/23/yathindhra-pravana-prabhavam-96-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org