శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఎఱుంబి అప్పా కోరిక
తరువాత, జీయర్ తిరునాడుకు చేరుకున్న విషయం గురించి ఎఱుంబియప్పా కూడా తెలుసుకున్నారు. ఈ శ్లోకం ద్వారా తెలుపబడింది.
వరవరముని పతిర్మే తద్పదయుగమేవ శరణమనురూపం
తస్యైవ చరణయుగళే పరిచరణం ప్రాప్యమితి ననుప్రాప్తం
(అడియేనుకి స్వామి అయిన మణవాళ మాముణుల దివ్య పాద పద్మాలు అత్యున్నత ఫలాన్ని [శ్రీవైకుంఠం చేరుకోవడం] పొందే సాధనాలు; కమలముల వంటి వారి తిరువడి కైంకర్యం లభించుట పరమ ప్రాప్తం. ఇది నా ప్రగాఢ నమ్మకం కూడా) తమ ఆచార్యుడి పట్ల దృఢ నిష్ఠతో ఉన్న వీరు, తమ ఆచార్యులు దూరమవ్వడం సహించలేకపోయారు. ఆ విరహ బాధనే వారిని ఈ పాశురాన్ని రచింపజేసింది.
వపురవిః సపదిమధీయం వరవరవమునివర్య మోచనీయమితం
పరిచరతి నహిభవంతం భగవనినహి భగవదభిమతా నపివా
(ఓ మణవాళ మామునీ! మంగళ గుణాల పూర్ణుడా! అడియేనుని ఈ దేహం నుండి విడిపించుటకు తామే తగినవారు; ఈ శరీరంతో దేవర్వారికి కైంకర్యం చేసే అదృష్టం అడియేనుకి కలుగలేదు; ఎంబెరుమానార్ దాసులకు కూడా ఈ శరీరంతో కైంకర్యం చేయలేకపోయాను)
ఇతిపునరేష వితన్నభితురి తరధిదూరనిమ్నపతరూడః
వరవరమునివర కరుణాం నిగ్నన్ పదనృపసురశ్నుతే నియమాన్
(జ్ఞానం ఉండికూడా, పాప కర్మల చేస్తూ “ఇతడు మానవ రూపంలో ఉన్న జంతువు” అని అనిపించుకున్నాను; పాప కర్మల ఫలాలను అనుభవిస్తూ, మణవాళ మాముణులు కురిపించిన కరుణను నాశనము చేస్తూ అతి నీచమైన జీవితాన్ని గడిపాను)
ఆయుపహరతి జగతాం అయముధయం విలయమపిభజన్ భానుః
మయిపునరితమ నృశంసో వరవరమునివర్య వర్తయత్యేవ
(ఓ మణవాళ మామునీ! ఈ సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ [సూర్యోదయం మరియు సూర్యాస్తమయం] ఈ లోకుల ప్రాణ ఘడియలను తరిగిస్తున్నాడు; కానీ అడియేన్ విషయంలో మాత్రం, ఈ ప్రపంచంలో నా జీవితాన్ని పెంచి అతి దారుణమైన శిక్ష నాకు వేస్తున్నాడు)
తదితః పరమనురూపం నవిళంబితుమితి చింతయంతయయా
మలభజనాధితోమాం వరవరమునివర్య మోచయధ్వరితం
(ఆ కారణంగా, ఓ మణవాళ మాముని! అడియేన్ విషయంలో, ఇక ఆలస్యం చేయడం తగదు; దేవర్వారి దివ్య సంకల్ప కృపతో, దయచేసి ఈ శరీరం నుండి నన్ను విముక్తుడిని చేయుము). అతను ఎంతో ఆర్తితో ఉన్నాడు; జీయర్ గుణాలను అనుభవించాలని, అతనికి కైంకర్యం చేయాలనే కోరికతో ఉన్న ఎఱుంబికి ఈ సంసారంలో ఉండడం అనేది, శ్రీ రాముడికి దూరమై రావణుని అశోక వాటికలో బాధపడుతున్న సీత పరిస్థి వంటిది. తిరువిరుత్తం 1వ పాశురంలో “పొయ్ నిన్ఱ జ్ఞానముం పొల్లా ఒళుక్కుం అళుక్కుడంబుం ఇన్నిన్ఱ నీర్మై ఇనియాం ఉఱమై” (ఈ తప్పుడు జ్ఞానాన్ని, అనుచిత ప్రవర్తనను, ఈ అపవిత్ర దేహాన్ని నేను సహించలేకపోతున్నాను), “ఆవిక్కోర్ పఱ్ఱుక్కొంబు నిన్నలాల్ అఱిగిన్ఱిలేన్ యాన్” (నీవు తప్ప ఈ ఆత్మకు ఆధారం ఇంకెవరూ నాకు గోచరించుటలేదు) అని తిరువాయ్మొళి పాశురములో అన్నట్లు, తమ ఆచార్యులను చేరే వరకు వీరి విరహ బాధ తగ్గేటట్లు లేదు. ఒక్క రోజు కూడా వేయి యుగాలనిపించాయి వారికి. మాముణుల దివ్య నామ జపం చేస్తూ, తరచూ స్పృహ కోల్పోతున్న స్థితిలో అలాగే ఉన్నారు.
మూలము: https://granthams.koyil.org/2021/10/29/yathindhra-pravana-prabhavam-102-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org