యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 103

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 102

మాముణులతో ఉన్న శిష్యులు

ఆ విధంగా, యతీంద్ర ప్రవణులు (రామానుజుల పట్ల భక్తి ప్రపత్తులతో ఉన్నవారు) అయిన జీయర్ దివ్య తిరువడి సంబంధం పొందిన శిష్యులందరూ ఆచార్య అభిమన నిష్ఠతో (ఆచార్యుల పట్ల భక్తితో దృఢంగా నిమగ్నమై), తమ శిష్యులను కూడా జీయరుని ఆశ్రయించమని బోధిస్తూ జీవించారు. వాళ్ళు కూడా ఉత్తర దినచర్య శ్లోకంలో చెప్పినట్లుగానే జీవనం సాగించారు.

అపగతమతమానైః అంతిమోపాయ నిష్ఠైః అతిగత పరమార్తైః అర్థకామానపేక్షైః
నిఖిలజనసుహృద్దిర్ నిర్జితక్రోధలోభైః వరవరమునిబృత్యైః అస్థుమే నిత్యయోగః

(మణవాళ మాముణుల శిష్యులు – ఆచార్యాభిమానమే (ఆచార్యుల పట్ల భక్తి ప్రపత్తులు) అత్యున్నత సాధనం (కర్మ, జ్ఞాన, భక్తి, ఆచార్యాభిమానం లలో) అనే దృఢ నమ్మకంతో, ఆచార్య పరతంత్రులై, అహంకార రహితులై, ఆచార్య కైంకర్యం చేస్తూ, అదియే పురుషార్థం (అత్యున్నత ఫలం) అని భావిస్తూ, భోగ భాగ్య ఆసక్తులు లేకుండా, విరోధుల పట్ల కూడా కోపరహితంగా ఉంటూ, క్రోధాన్ని జయించి, సకల సంపదలను గడ్డి పోచకు సమానంగా భావించే, ఆచార్య కైంకర్యం చేస్తూ, ఆచార్య అభిమానమే పరమావధి అనే దృఢ నమ్మకంతో ఉంటూ, ఉభయ విభూతులాను (సంసారం, శ్రీవైకుంటం) సమానంగా పరిగణించేవారు.

శ్రీ శఠారిగురోదివ్య శ్రీపాదాబ్జ మధువ్రతం
శ్రీమద్ యతింద్రప్రవణం శ్రీలోకార్యమునిం భజే

(రామానుజుల పట్ల భక్తి ప్రపత్తులు కలిగి, తమ దివ్య తిరువడి నుండి అమృతమయమైన తేనె కారుచు ఉండే శ్రీ పిళ్ళై లోకం జీయరుని నేను ఆరాధిస్తాను)

మూలము: https://granthams.koyil.org/2021/10/30/yathindhra-pravana-prabhavam-103-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment