యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 104

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 103

మణవాళ మాముణుల వాళి తిరునామాలు

ఇప్పువియిల్ అరంగేశర్ క్కు ఈడళిత్తాన్ వాళియే
ఎళిల్ తిరువాయ్మొళిప్పిళ్ళై ఇణైయడియోన్ వాళియే
ఐప్పశియిల్ తిరుమూలత్తవదత్తాన్ వాళియే
అరవసప్పెరుంజోది అనంతన్ ఎన్ఱుం వాళియే
ఎప్పువియుం శ్రీశైలం ఏత్తవందోన్ వాళియే
ఏరారుం ఎతిరాశర్ ఎన ఉదిత్తాన్ వాళియే
ముప్పురినూల్ మణివడముం ముక్కోల్ దరిత్తాన్ వాళియే
మూదరియ మణవాళ మామునివన్ వాళియే

నాళ్ పాట్టు 

సెందమిళ్ వేదియర్ శిందై తెళిందు శిఱందు మగిళ్ందిడి నాళ్
శీరులగారియర్ శెయ్దరుళ్ నఱ్కలై తేశు పొలిందిడు నాళ్
మందమది ప్పువి మానిడర్ తంగళై వానిల్ ఉయర్ త్తిడు నాళ్
మాశఱు జ్ఞానియర్ శేర్ ఎదిరాశర్ తం వాళ్వు ముళైత్తిడు నాళ్
కందమలర్ పొళిల్ శూళ్ కురుగాదిబన్ కలైగళ్ విళంగిడు నాళ్
కారమర్ మేని అరంగ నగర్ క్కిఱై కణ్గళ్ కళిత్తిడు నాళ్
అందమిల్ శీర్ మణవాలమునిప్పరన్ అవదారం శెయ్దిడు నాళ్
అళగు తిగళ్ందిడుం ఐప్పశియిల్ తిరుమూలం అదు ఎను నాళే

మంగళం

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీనిత్య మంగళం 

శ్రీ పిళ్ళై లోకార్య జీయర్ వైభవం

మణవాళ మాముణుల వైభవాన్ని వివరిస్తూ యతీంద్ర ప్రవణ ప్రభవం అనే ఈ దివ్య గ్రంధాన్ని కృపతో పిళ్ళై లోకార్య (పిళ్ళై లోకం) జీయర్ రచించారు. గోవిందప్ప తాదర్ (దాసర్) వంశస్థులైన వీరు, మధురకవియాళ్వార్లు నమ్మాళ్వార్ల పట్ల ఉన్నట్లే, వీరు మణవాళ మాముణుల తిరువడి యందు నిష్ఠతో ఉండేవారు. ఈ గోవిందప్ప దాసర్ సన్యాశ్రమాన్ని స్వీకరించాక భట్టర్ పిరాన్ జీయర్ అనే దివ్య నామాన్ని పొందారు. మణవాళ మాముణుల అష్టదిగ్గజులలో వీరు ఒకరు. అళగియ మణవాళర్ గోవిందప్ప దాసర్ల తిరు కుమారుడు. అళగియ మణవాళర్ మనవడు వరదాచార్యుడు. వరదాచార్యులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాక, వీరు పిళ్ళైలోకం జీయరుగా ప్రసిద్ధి చెందారు. మణవాళ మాముణులు రచించిన యతిరాజ వింశతి, ఉపదేశ రత్న మాల, తిరువాయ్మొళి నూఱ్ఱందాది, ఆర్థి ప్రబంధాలకు వీరు మణి ప్రవాళ వ్యాఖ్యానాలు వ్రాశారు. రామానుజుల దివ్య మహిమలను వర్ణిస్తూ వీరు ‘రామానుజార్య దివ్యచరితం’ అను గ్రంధాన్ని రచించారు. ఇరామానుశ నూఱ్ఱందాదికి నాలాయిర తనియన్లకు వ్యాఖ్యానాలు రచించారు. వీరి తిరు నక్షత్రం మేష మాసంలో (చిత్తిరై) శ్రావణం (తిరువోణం) నక్షత్రం.

సముద్రంలో కొట్టుకు పోయిన తిరుక్కడన్మల్లై గుడిలో ఇప్పుడున్న చోట సన్నిధిని పునర్నిర్మానం చేసి, పెరుమాళ్, భూదత్తాళ్వార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ సన్నిధిలో మొదటి తీర్థం మొదలైన ఆలయ గౌరవాలను పొందారు. ఇప్పటికి కూడా వారి పూర్వాశ్రమ సంతతి ఈ గౌరవాలను పొందుతున్నారు. ఈ జీయర్ జీవిత చరిత్ర గురించిన వివరాలు అంతగా అందుబాటులో లేవు.

శ్రీ పిళ్ళైలోకం ​​జీయర్ తిరువడిగళే శరణం

మూలము: https://granthams.koyil.org/2021/10/30/yathindhra-pravana-prabhavam-104-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment