
అవతారిక రెండవ భాగమును ఇప్పుడు చూద్దాము. ఇందులో మణవాళ మహామునులు ఈ ప్రబంధమునకు రెండు విధముల విభాగములను( ఆరు, తొమ్మిది) వివరించుచున్నారు.
మొదట ఈ ప్రబంధము ఆరు విభాగములుగా ఎలా కూర్చబడినదో చూద్దాము.
మొదటి సూత్రము(సూత్రము – 1) “వేదార్ధం అరుతియిడవతు” తో మొదలుకొని “అత్తాలే యతుముఴ్పట్టత్తు” అను నాల్గవ సూత్రము(సూత్రము – 4) వరకును ప్రమాణము యొక్క ప్రామాణికతను గురుంచి నిశ్చయించడమైనది. దీనితో గ్రంథములోని ఈ భాగము ఉపోద్ఘాతమును గురించినది.
ఐదవ సూత్రము(సూత్రము – 5) “ఇతిహాస శ్రేష్ఠమ్” మొదలుకొని “ప్రపత్తి ఉపదేశమ్ పణ్ణిత్తుమ్ ఇవళుక్కాగ” అను ఇరవై రెండవ సూత్రము(సూత్రము – 22) దాకా పురుషకార వైభవము మరియు ఉపాయ వైభవమును గురించి చెప్పబడినది. పురుషకారభూతురాలుగా పిరాట్టిమార్ల వైభవమును చెప్పబడినది – సమస్త దోషములతో నిండియున్న జీవాత్మలను చూచి తాను భగవానునికి తన స్వరూపమైన కరుణ మరియు తనకి శరణాగతి చేసిన జీవుల యూజీవనమును గూర్చి అనునిత్యము గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ విభాగము అత్యంత కృపా సముద్రుడైన భగవానుని ఉపాయముగా స్వీకరించడము మరియు ఆ పురుషకారమును మించి యుండు ఆ సర్వేశ్వరుని యొక్క కృప గురుంచి చెప్పడమైనది.
ఇరవై మూడవ సూత్రము (సూత్రము – 23) “ప్రపత్తిక్కు” మొదలుకొని డెబ్భై తొమ్మిదవ సూత్రము(సూత్రము – 79) “ఏకాన్తీ వ్యాప్తేష్తవ్యః” వరకు ప్రపత్తి యొక్క స్వరూపమును గురించి విస్తారముగా చెప్పబడినది. ప్రపత్తి అనగా ఆ సర్వేశ్వరునిని ఉపాయముగా స్వీకరించుట. ఈ కింద చెప్పబడినవి :
- సర్వేశ్వరుని ఉపాయముగా స్వీకరించుటకు దేశ కాల నియమములు లేకుండుట, ప్రపత్తిని చేయు వానికి ఎట్టి అధికార నియమము లేకుండుట.
- మన ప్రపత్తిని స్వీకరించు వాడు సర్వ సమర్థుడుగా ఉండుట
- ప్రపత్తి చేయు మూఢ విధముల మనుషులు
- ప్రపత్తిని ఉపాయముగా స్వీకరించుట విషయములో కల పరిమితులు
- ప్రపత్తి యొక్క స్వరూపము మరియు దాని అంగముల గురించి వివరణ.
దీనితో ఈ విభాగమున భగవానుడే ఉపాయముగా నిర్ధారించడమైనది.
ఇందులో డెబ్భైవ సూత్రము (సూత్రము – 70) “ప్రపత్తిక్కు ఉగప్పానుమ్ అవనే” వరకు అసలు సారము, 71-79 వరకు దానికి అనుబంధ విషయములు చెప్పబడినవి.
ఎనభైయవ సూత్రము (సూత్రము – 80) “ఉపాయత్తుక్కు” మొదలుకొని సూత్రము మూడు వందల ఏడు(సూత్రము – 307)”ఉపేయ విరోధిగళాయిరుక్కుమ్” వరకు ప్రపన్నునికి ముఖ్యముగా కావలసినవి వివరించబడినది. ఈ విభాగము కింద వాటి గురుంచి చెప్తుంది :
- సర్వేశ్వరుని ఉపాయముగా మరియు ఉపేయముగా స్వీకరించు జీవాత్మకు తప్పనిసరిగా కావలసిన గుణములు.
- ఉపాయాంతరములను విడిచిపెట్టుటకు గల ఆవశ్యకత
- మిగిలిన త్యాజ్యోపాధేయములు
సూత్రము మూడు వందల ఎనిమిది(సూత్రము – 308) “తాన్ హితోపదేశం పణ్ణుమ్బోదే” మొదలుకొని మూడు వందల అరవై అయిదు సూత్రము(సూత్రము – 365) “ఉగప్పుమ్ ఉపకార స్మృతియుమ్ నడక్క వేణుమ్” వరకు శిష్యుని లక్షణము(ఆచార్యుని పట్ల శిష్యుడు ప్రవర్తించవలసిన తీరు) విస్తారముగా చెప్పబడినది. దీనితో పాటు క్రిందివి కూడా చెప్పబడినవి:
- సిద్ధోపాయ నిష్ఠుల లక్షణము(సిద్ధోపాయమైన ఆ భగవానుని పైన ఆధారపడి ఉండు వారు)
- సదాచార్య లక్షణము
- సచ్చిష్య లక్షణము మరియు ఆచార్యుని పైనే ఆధారపడియుండుట
- ఆచార్య శిష్య సంబంధము
- తనను ఉజ్జీవింప చేసిన ఆచార్యుని పట్ల శిష్యునికి ఉండవలసిన కృతజ్ఞత(ఉపకార స్మృతి)
సూత్రము మూడు వందల అరవై ఆరు(సూత్రము – 366) “స్వదోషానుసంధానమ్ భయ హేతు” మొదలుకొని సూత్రము నాలుగు వందల ఆరు(సూత్రము – 406) “నివర్తక జ్ఞానమ్ అభయ హేతు” వరకు ఆ సర్వేశ్వరుని నిర్హేతుక కృప చెప్పబడినది. ఆ సర్వేశ్వరుని అట్టి నిర్హేతుక కృప చేతనే ఒకడు అద్వేషము మొదలుకొని ఆ పరమపదములో చెయు ఉత్క్రుష్టమైన కైంకర్యాము వరకు ముందుకు సాగును. దీనితో ఆ సర్వేశ్వరుని నిర్హేతుక కృప చేత దుఃఖము పోయి జీవునకు మోక్షము ప్రాప్తించును అనునది సిద్ధించడమైనది.
సూత్రము నాలుగు వందల ఏడు(సూత్రము – 407) “స్వతంత్రనై ఉపాయమాగప్ పత్తిన పోదిరే” మొదలుకొని చివరిదైన నాలుగు వందల అరవై మూడు (సూత్రము – 463) వరకు అంతిమోపాయ నిష్ఠ అనగా ఆచార్యుని పైనే ఆధారపడి ఉండుట గురించి చెప్పబడినది. ఈ అంశము మధుర కవి ఆళ్వార్ల కణ్ణినుమ్ సిరుత్తాంబు 9 “మిక్క వేదియర్ వేదత్తిన్ ఉత్పొరుళ్” లో చెప్పబడినది. (వేదము యొక్క సారమును ఆచరణలో పెట్టు మహనీయులు)
“వేదార్ధం అరుదియడువదు” తో మొదలు అవ్వడము చేత మరియు “చరమ పర్వ నిష్ఠ”తో ముగియడము చేత ఆచార్యుని పైనే పూర్తిగా ఆధారపడియుండుట అనునది వేదము యొక్క సారము అని సిద్ధించడమైనది.
ఎలా అయితే చరమ శ్లోకము (“సర్వ ధర్మాన్ పరిత్యజ్య….”) అనునది శ్రీ భగవద్గీత సారమో, చివరి ప్రకరణము ఈ ప్రబంధమునకు సారము. అందులో (భగవద్గీతలో ) భగవానుడు మొదట రక రకాల ఉపాయములు (కర్మ, జ్ఞాన, భక్తి) అర్జునునికి చూపి తరువాత అర్జునుని తన స్వాతంత్య్రముతో ఏదోక ఉపాయమును స్వీకరించుటకు భయపడిన విషయాన్ని గమనించి సిద్ధోపాయమును చూపును. ఇందులో (శ్రీ వచన భూషణములో) సిద్ధోపాయము యొక్క గొప్పతనమును వివరించి ఆ తరువాత భగవానుని నిరంకుశ స్వాతంత్య్రమును చూసి భయపడి ఆచార్యుని పైనే ఆధారపడి ఉండుట అను అంతిమోపాయ నిష్ఠ చూపించబడినది.
ఈ విధముగా ఈ ప్రబంధములో గల ఆరు ప్రకరణములు ఆరు అంశములను ప్రతిపాదించుట చెప్పబడినది.
ఇక మీద ఈ ప్రబంధము తొమ్మిది ప్రకారణములుగా ఎలా చెప్పబడినదో చూద్దాము.
ఇంతక ముందు చెప్పినట్టు ఒకటవ సూత్రము (సూత్రము – 1) మొదలుకొని ఇరవై రెండవ సూత్రము (సూత్రము – 22) వరకు ఉపోద్ఘాతము మరియు పురుషకార/ఉపాయ వైభవములు ఇందులోనూ సమానములే.
తదనంతరం ఇరవై మూడవ సూత్రము (సూత్రము – 23) “ప్రపత్తిక్కు” మొదలుకొని నూట పదునాల్గవ సూత్రము (సూత్రము – 114) “భగవత్ విషయ ప్రవృత్తి సేరుమ్” వరకు భగవానుని ఉపాయత్వమును గూర్చి వివరించబడినది.
నూట పదిహేనవ సూత్రము (సూత్రము – 115) “ప్రాపకాన్తర పరిత్యాగత్తుక్కు” మొదలుకొని నూట నలభై ఒకటవ సూత్రము(సూత్రము – 141) “ఆగైయాలే సుఖరూపమాయిరుక్కుమ్” వరకు ప్రపత్తి కాకుండా ఇతర ఉపాయములలోని దోషములను వివరించును. ప్రపత్తి యొక్క గొప్పతనము దీనికి అంగముగా చెప్పబడినది.
నూట నలభై రెండు సూత్రము (సూత్రము – 142) “ఇవెనైప్ పెత్త నినైక్కుమ్ పోదు” మొదలుకొని రెండు వందల ఇరవై రెండు సూత్రము (సూత్రము – 242) “ఇదైచ్చియాయ్ పెత్తువిడుదల్ సెయ్యుమ్ బడియాయిరుక్కుమ్” వరకు సిద్ధోపాయ నిష్టుల గొప్పతనము వివరించబడినది.
రెండు వందల నలభై మూడవ సూత్రము(సూత్రము – 243) “ఇప్పడి సర్వప్రకారత్తాలుమ్” మొదలుకొని మూడు వందల ఏడవ సూత్రము (సూత్రము – 307) “ఉపేయ విరోధిగళాయిరుక్కుమ్” వరకు ప్రపన్నుని దినచర్య చెప్పబడినది.
మూడు వందల ఎనిమిదవ సూత్రము (సూత్రము – 308)”తాన్ హితోపదేశమ్ పణ్ణుమ్ పోదు” మొదలుకొని మూడు వందల ఇరవై సూత్రము (సూత్రము – 320) “చేతననుడైయ రుచియాలే వరుగైయాలే” వరకు సదాచార్య లక్షణములను గూర్చి వివరించబడినది.
మూడు వందల ఇరవై ఒకటవ సూత్రము (సూత్రము – 321) “శిష్యనెన్బదు” మొదలుకొని మూడు వందల అరవై అయిదు సూత్రము (సూత్రము – 365) “ఉపకార స్మృతియుమ్ నడక్క వేణుమ్” వరకు సచ్చిష్య లక్షణములను గూర్చి వివరించబడినది.
మూడు వందల అరవై ఆరవ సూత్రము (సూత్రము – 366) “స్వదోషానుసంధానమ్” మొదలుకొని నాలుగు వందల ఆరవ సూత్రము (సూత్రము – 406) “నివర్తక జ్ఞానమ్ అభయ హేతు” వరకు తన నిర్హేతుక కృపతో ఆ సర్వేశ్వరుడు జీవులను ఉజ్జీవింప తీరును గూర్చి చెప్పబడినది.
నాలుగు వందల ఏడవ సూత్రము (సూత్రము – 407) “స్వతంత్రనై” మొదలుకొని చిట్టా చివరి సూత్రము 463 వరకు ఆచార్యుడే ఉపాయము మరియు ఉపేయము అని వివరింపబడినది.
ఈ పైన చెప్పబడిన రెండు విధముల (ఆరు, తొమ్మిది) పద్దతులను బట్టి “పేఴు తరువిక్కుమవర్ తన్ పెరుమై” (ఆరు ప్రకరణములను చెప్పు తనియన్) మరియు “తిరుమామగళ్ తన్” (తొమ్మిది ప్రకరణములు చెప్పు తనియన్) ఇట్లు రెండు తనియన్లు ప్రవర్తించినవి. కావున ఈ పైన చెప్పిన ప్రకారము రెండు విధములగాను అనుసంధించుకొనుటకు ఎట్టి బాధకము లేదు.
ఈ విధముగా పిళ్ళై లోకాచార్యుల శ్రీ వచన భూషణ ప్రబంధమునకు మణవాళ మహామునుల రెండు పద్ధతులకు ప్రసాదించిన గొప్ప ఉపోధ్ఘాతమును గురించి ఇక్కడ వివరించబడినవి.
ఇక మీద మణవాళ మహామునులు ప్రసాదించిన తక్కిన ఉపోధ్ఘాతమును మనము చూచెదము.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2020/12/03/srivachana-bhushanam-avatharikai-2-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org