అవతారిక
పైన చెప్పిన వాటిలో ఏది వేదములోని ఏ భాగముల యొక్క అర్ధమును నిశ్చయించును అనునది పిళ్ళై లోకాచార్యుల వారు కృప చేయుచున్నారు.
సూత్రము – 2
స్మృతియాలే పూర్వభాగత్తిల్ అర్ధమ్ అఱుతి యిడక్కడవతు, మత్తై ఇరణ్డాలుమ్ ఉత్తర భాగత్తిల్ అర్ధమ్ అఱులి యిడక్కడవతు.
వేదము యొక్క పూర్వ భాగపు అర్ధములను స్మృతిచేత నిశ్చయించుకొనవలెను. ఉత్తర భాగము (అనగా వేదాంతము లేదా ఉపనిషత్తులు) యొక్క అర్ధములను ఇతిహాసములు మరియు పురాణములతో నిశ్చయించవలెను.
వ్యాఖ్యానము
స్మృతియాలే …
ఈ విధముగా వివరింపబడునట్టి వేదశాస్త్రమున ప్రతిపాదింపబడు అర్ధములు వేరుగా ఉండుట వలన వేదమున విభాగములు కలిగెను. వివరింపబడు అర్ధములను బట్టి వాటిని వివరించు గ్రంధములకు భేదము కలదు. వాటిలో స్మృతులు వేదపు పూర్వ భాగమును వివరించునవిగా, ఇతిహాస పురాణములు ఉత్తర భాగమును వివరించునవిగా నిర్మింపబడినవి అవ్వడము చేత ఆయా వివరణ గ్రంధమును ఆధారము చేసుకొనియే ఆయా భాగములలో ఉండు అర్ధములను నిర్ణయించవలెను. ఈ కారణము చేత ఆచార, వ్యవహార, ప్రాయశ్చిత్తాలను ప్రతిపాదించు ధర్మ శాస్త్రములచే కర్మ ప్రతిపాదకమగు పూర్వ భాగము యొక్క అర్ధములను నిర్ణయించవలెను.భగవత్స్వరూపము, గుణములు, రూపములు, విభూతి, లీలలు మొదలగు వాటిని ప్రతిపాదించు ఇతిహాస పురాణములు అనబడు తక్కిన రెండింటి చేత బ్రహ్మము ప్రతిపాదకమగు ఉత్తర భాగము యొక్క అర్ధము నిశ్చయింపతగును అని తెలుపుచున్నారు.
ఈ విధముగా రెండు విధములగు ఉపబ్రహ్మణ గ్రంధములచే వేదపు రెండు భాగముల యొక్క అర్ధములను నిశ్చయించుట అనగా ఏమి?
తాను చదివి ఉండని తక్కిన శాఖల అర్ధములను ప్రతిపాదించునవి అయినవాటిలో ఉండు విశేషముల సహాయముతో కూడా తాను చదివి ఉన్న శాఖ యొక్క అర్ధములను నిశ్చయించుట.
స్మృతులలో బ్రహ్మ ప్రతిపాదనమును, ఇతిహాసములలో కర్మ ప్రతిపాదనము కనబడుచున్ననూ స్మృతులు బ్రహ్మమును ప్రతిపాదించుట అనునది కర్మములు బ్రహ్మము యొక్క ఆరాధనా రూపములని తెలుపుటకుగాను, ఇతిహాస పురాణములు కర్మమును ప్రతిపాదించుట అనునది కర్మములు భగవదుపాసనమునకు అంగములు అని తెలియవచ్చును. అందుచేత పైన చెప్పిన ప్రకారము విభజించి చెప్పుట సరిపోవును అందువలననే బార్హస్పత్య స్మృతి “ప్రాయేణ పూర్వభాగార్ధ పురాణంధర్మశాస్త్రతః ఇతిహాస పురాణాభ్యాం వేదాంతార్థ: ప్రకాశ్యతే” (సామాన్యముగా వేదపు పూర్వ భాగ అర్ధమును స్మృతితో నిర్ణయించవలెను. బ్రహ్మము యొక్క స్వరూపమును ఇతిహాస పురాణములతోనే నిర్ణయించవలెను) అని చెప్పబడి ఉన్నది.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2020/12/06/srivachana-bhushanam-suthram-2-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org