అవతారిక
ఇక మీద ఆళ్వార్ల అవతారము యొక్క పరోపకారత్వమును దృష్టాంతముతో నాయనార్లు కృప చేయుచున్నారు.
చూర్ణిక
జనక దశరధ వసుదేవ కులఙ్గళుక్కు మూత్తపెణ్ణుమ్ నడువిల్ పిళ్ళైయుమ్ కడైకుట్టియమ్ పోలే ఇవరుమ్ పిఴన్దు పుకళుమ్ అక్కముమాక్కి అన్జిఴైయుమ్ అఴుత్తార్
సంక్షిప్త వ్యాఖ్యానము
జనకుని జ్యేష్ఠ పుత్రిక, దశరధుని మధ్యమ కుమారుడు, వసుదేవుని చివరి కొడుకు వలెనె ఆళ్వార్లు కూడా అవతరించి కీర్తిని, కులమర్యాదను కాపాడి చెరను(చెరశాలలో బంధించిపడి యుండుట) పోగొట్టినారు.
వ్యాఖ్యానము
అనగా – జనకుని జ్యేష్ఠ కుమార్తె అయిన సీతా పిరాట్టి జన్మించి తన కులమునకు కీర్తిని తెచ్చినట్టు శ్రీ రామాయణము బాల కాండము 67.21 “జనకానామ్ కులే కీర్తిమాహరిష్యతి మే సుతా సీతా భర్తారమాసాధ్య రామమ్ దశరధాత్మజమ్”(నా కుమార్తె అయిన సీత దశరధ కుమారుడు అయిన శ్రీరాముని పెళ్లి చేసుకొని వంశమునకు కీర్తి తెచ్చెను).
దశరధుని మధ్యమ కుమారుడు అయిన శ్రీ భరతాళ్వాను జన్మించి పెద్ద కుమారుడు ఉండగా చిన్న వాడికి రాజ్య పరిపాలనము కూడదు అను కుల మర్యాదను కాపాడటమే కాకుండా శ్రీ రామాయణము 82.12 “రాజ్యంచ అహంచ రామస్య ధర్మమ్ వక్తుమ్ యిహార్హసి కధమ్ దశరధా జ్జాతో భవేత్ రాజ్యపహారకాః”(నేను, రాజ్యము రెండూ శ్రీ రాముని యొక్క సొత్తు. ఈ విషయమున ధర్మముగా మాట్లాడు. దశరధుని వంశమున జన్మించి రాజ్యమును అపహరించువాడను ఎలా కాగలను?) అని చెప్పినట్టు పెద్దవాడైన శ్రీ రామచంద్రుని విడిచి ఉండునప్పుడు జడలు ధరించి, నార వస్త్రములను ధరించి కన్నీరుచే ఏర్పడిన బురదలో క్రింద పడి ఉండి తమ వంశమున అంతకముందు లేనట్టి వైభవములను కలుగజేసినట్లు శ్రీ రామాయణము అయోధ్యా కాండము 100.1 “జటిలం చీర వసనం ప్రాంజలిమ్ పరితం భువి”(జడలు దాల్చి, నార వస్త్రములను ధరించి అంజలి ముద్రతో దండము సమర్పించువాడు) అనియు శ్రీ రామాయణము యుద్ధ కాండము 127.5 “పఙ్గదిగ్ధస్తు జటిలో భరతస్త్వామ్ ప్రతీక్షతే”(బురద పూసుకొనిన వాడు, జాడలు దాల్చి ఉన్న వాడు అయిన భరతుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు).
వసుదేవుని వంశములో చిన్న వాడైన కృష్ణుడు జన్మించి పెఴియాళ్వార్ తిరుమొళి 5.3.1 “మక్కళ్ అఴువరై క్కల్లిడై మోదయిళందవళ్ తన్ వయిత్తిల్ శిక్కిన వన్దు పిఴందు నిన్ఴాయ్”(ఇంతక ముందు పుట్టిన ఆరుగురి పిల్లలను కంశుడు రాతి మీద వేసి కొట్టి చంపగా వారిని పోగొట్టుకొనిన దేవకీ యొక్క గర్భమున నీవు అవతరించావు) తమ తల్లితండ్రులను చెర నుంచి విముక్తులను చేసావు పెఴియ తిరుమొళి 7.5.1 “తందై కాలిల్ పెరు విలంగు తాళవిళ”(తన తండ్రి కాళ్ళకి ఉన్న పెద్ద గొలుసులను విడిపించినవాడు).
ఆళ్వార్లు కూడా కృపతో అవతరించి తాను అవతరించిన ఊరికి కీర్తిని తెచ్చి తిరువాయిమొళి 4.2.11 “మలి పుగళ్ వణ్కురుగూర్”(గొప్పదైన కీర్తిని మూటగట్టుకున్న ఆళ్వార్ తిరునగరి) అని చెప్పినట్టు శేషత్వ రూపమగు కులమర్యాద తప్పకుండా ఉండుట మాత్రమే కాకుండా తిరువాయిమొళి 9.2.2 “కుడిక్ కిడన్దు ఆక్కమ్ సెయ్దు”(కుల మర్యాదలో అనగా శేష వృత్తిలో అతిశయమును కలుగజేసి) ఓ సర్వేశ్వరా! కనుబడవా! అని కళ్ళను, నోటిని తెరుచుకొని కన్నీళ్లను చేతులతో తుడుచుకొనుచూ తిరువాయిమొళి 8.5.2 “కాణ వారాయ్ ఎన్ఴెన్ఴు కణ్ణుమ్ వాయుమ్ తువర్ న్దు”(అదే పనిగా చూస్తూ “నాకు కనుబడవా” అని పిలుస్తూ నా కళ్ళు నోరు ఎండిపోయినవి) తిరువాయిమొళి 7.2.1 “కణ్ణ నీర్ కైగళాయ్ ఇఴైక్కుమ్” (తన కన్నీళ్లను తన చేతులతో తాను తుడుచుకొనుచూ)ఏమి చేయకుండా నిశ్చేష్ఠులై కిందపడి ఉండి తిరువాయిమొళి 7.2.4 “ఇట్ట కాల్ ఇట్ట కైయళాయ్ ఇరుక్కుమ్”(నా కుమార్తె యొక్క చేతులు, కాళ్ళు కదలకుండా నిశ్చేష్ఠులైనది) – ప్రీతి విశేషముచే నీ కులమున ఇంతక ముందు లేని వైభవుమును కలుగజేసి తిరువాయిమొళి 1.3.11 “అఴువర్ తమ్ పిఴవి అమ్ సిఴైయే” అని చెప్పినట్టు తమ తిరువాయిమొళి ప్రబంధమును చదువుటచే తమ సంబంధము కల వారి యొక్క సంసార రూపమగు క్రూరమైన బంధమును తీసివేసినారు అని చెప్పుట.
ఈ పైన చెప్పిన ఉదాహరణమున చెప్పబడిన ముగ్గురు చేసిన దానిని వీరొక్కరే చేయడము చేత అందునా స్వరూపమునకు అనుగుణముగా చేయడము చేత వీరి జన్మమే గొప్ప పరోపకారమైనది కదా!
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/09/acharya-hrudhayam-82-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org