<< చూర్ణిక 82
అవతారిక
ఇక మీద ఆళ్వార్ల అవతారము వల్ల ఈ లోకమునకు కలిగిన ఉపకారమును గూర్చి నాయనార్లు కృప చేయుచున్నారు.
చూర్ణిక
ఆదిత్య రామ దివాకర భానుకళుక్కు పోకాత ఉళ్ళిరుళ్ నీఙ్గి శోషియాత పిఴవిక్కడల్ అత్తి వికసియాత పోతిల్ క్కమలమలర్ న్దతు వకుళభూషణ భాస్కరోదయత్తిలే
సంక్షిప్త వ్యాఖ్యానము
సూర్యునిచే, శ్రీ రాముడను సూర్యునిచే, శ్రీ కృష్ణుడను సూర్యునిచే పొనట్టి లోపలి అజ్ఞానమును చీకటి, ఎండిపోని సంసార సముద్రము, వకుళ భూషణ సూర్యులు అయిన నమ్మాళ్వార్లు ఉదయించినప్పుడు సంసార సముద్రము ఎండిపోయినదియై , లోపలి చీకటి పోయినదై మరియు వికసింపని హృదయ కమలములు వికసించినవి.
వ్యాఖ్యానము
అనగా – తిరుప్పళ్ళియెళుచ్చి 1 “కదిరవన్ గుణదిశై చ్చికరమ్ వన్దనైణ్దాన్ కనైయిరుళ్ అగన్ఴదు”(రాత్రి చీకట్లను పోగొట్టుచూ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినాడు) అని చెప్పినట్టు బయట ఉండు చీకట్లను పోగొట్టుచూ సూర్యుడు ఉదయించెను. కానీ లోపల ఉన్న అంధకారము అనగా తమస్సు నశింపలేదు. ఆ లోపల ఉన్న అంధకారము కూడా నశించినదియై “తమో బాహ్యం వినశ్యేత్తు పావకాదిత్య సన్నిధౌ బాహ్యమాప్యన్తరన్చైవ విష్ణు భక్తార్క సన్నిధౌ”(అగ్ని వలన సూర్యుని వలన బాహ్యముగా ఉండు అంధకారము నశించును. సూర్యుని వంటి విష్ణు భక్తుని ముందు బాహ్యమైన మరియు లోపలి అంధకారము కూడా నశించును) అని చెప్పినట్టు అయినది.
శ్రీ రామాయణము సుందరకాండము 37.16 “శర జాల అంశుమాన్ శూరః కపే రామ దివాకరః శతృ రక్షోమయం తోయం ఉపశోషం నయిష్యతి”(ఓ హనుమ! పరాక్రమశాలి అయిన శ్రీ రామచంద్రుడు అను సూర్యుడు శత్రువులగు రాక్షసులనబడు సముద్రమును ఎండిపోవునట్లు చేయగలడు కానీ అట్టి శ్రీ రాముడు సంసారమను సముద్రమును ఎండిపోవునట్లు చేయలేడు) అని పెఴియాళ్వార్ తిరుమొళి 5.4.2 “పిఱవి ఎన్నుమ్ కడల్”(సంసారమును సాగరము)కానీ అట్టి సంసార సాగరము కూడా ఆళ్వార్ల అవతారము చేత ఎండిపోయినది.
శ్రీ విష్ణు పురాణము 5.3.2 “తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా దేవకీ పూర్వ సంధ్యాయామ్ ఆవిర్భూతం మహాత్మనా”(కృష్ణుడు అనబడు సూర్యుడు సమస్త జగద్రూపమగు పద్మమును వికసింపజేయుటకై దేవకి పిరాట్టికి తూర్పు దిక్కున ఉదయించినాడు) అన్నట్లు జగద్రూపమగు పద్మము వికసించునట్లు దేవకీ అనబడు పూర్వ సంధ్య యందు ఉదయించిన మహా విష్ణువగు కృష్ణునిచే వికసింపజేయు వీలుకాని పెఱియాళ్వార్ తిరుమొళి 5.3.2 “పోదిల్ కమల వన్ నెన్జమ్”(జ్ఞానమునకు నిలయమైన మన కాఠిన్య హృదయ కమలము) ఆళ్వార్ల అవతారము చేత వికశించినవి.
పరాంకుశాష్టకం “యద్గోసహస్రం అపహంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర సశంఖ చక్రః యన్మండలమ్ శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళ భూషణ భాస్కరాయ”(ఎవరి వేయి పాశురములు అనబడు కిరణములు లోపల అజ్ఞానాంధకారమును పోగొట్టుచున్నవో, శంఖచక్రధరుడు అయిన నారాయణుడు ఎవరి లోపల నివసించి ఉన్నాడో, ఎవరిని బ్రాహ్మణులు నమస్కరించెదరో అట్టి వకుళ భూషణులగు నమ్మాళ్వార్లు అనబడు సూర్యునికి నమస్కరించుచున్నాను..) అని చెప్పినట్టు ఆళ్వార్ల హృదయ కమలములో శ్రీమన్నారాయణుడు తన దేవేరులతో, దివ్య ఆభరణములు, దివ్యాయుధములతో వేంచేసియున్నారు. తిరువాయిమొళి 8.8.1 “కణ్గళ్ సివన్దు” లోపల గల వారై వేదవేత్తలు అయిన శిష్ఠులందరూ తాము ఉండునట్టి ప్రదేశమును ఉద్దేశించి నమస్కరించునట్టి వైభవము గలవారై వకుళాభరణులగు ఆళ్వార్లు ఉన్నట్టు.
ఆళ్వార్లను ఆదిత్య, దివాకర, భాను శబ్ధములతో చెప్పక భాస్కరులు(అనగా తాము ప్రకాశించుచూ ఇతరులను ప్రకాశింపజేయు)అను శబ్ధముచే చెప్పడము చేత తనతో సంబంధము కలిగిన వారందరికీ యశస్సు/తేజస్సును కలిగించును అని అర్ధము అవుతున్నది. తిరువాయిమొళి 6.7.2 “ఊరుమ్ నాడుమ్ ఉలగముమ్ తన్నైప్పోల్ అవనుడైయ పేరుమ్ తార్గళుమే పిదత్త కఴ్పువాన్ ఇడఱి శేరు నల్ వళమ్ శేర్ పళన త్తిరుక్కోళుర్కే పోరునగల్? ఉఴైయీర్ కొడియేన్ కొడి పూవైగళే”(ఓ మనస్సా! నా కూతురు నాకు ఎడబాటును కలిగించి ఆయన లేకుండా తనకు తాను ఉనికిని లేనిదై ఆసరాను అపేక్షించు ఒక లత(తీగ) లాగా ఊరు, దేశము మొత్తము ఆయన పేరునే కీర్తిస్తూ ఆకాశము వంటి విశాలమైన తన స్త్రీత్వాన్ని సైతము లెక్క చేయక ఐశ్వర్యము మరియు జల వనరులు ఉండు ప్రదేశమైన తిరుక్కోళూరుకు చేరినది. ఆమె తిరిగి వస్తుందా? దయచేసి చెప్పు)
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/10/acharya-hrudhayam-83-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org