ఆచార్య హృదయం – 84

ఆచార్య హృదయం

 << చూర్ణిక 83

అవతారిక
“ఈ విధముగా పరోపకారమునకై జన్మించిన ఆళ్వార్లు మొదటి మూడు వర్ణములలో కాక తక్కువదైన నాల్గవ వర్ణములో ఎందుకు జన్మించారు?” అని అడుగగా దానికి సమాధానముగా “అది కూడా పరోపకారము కోసమే” అని నాయనార్లు చెప్పుచున్నారు.

చూర్ణిక
వంశ భూమికళై యుద్ధరిక్క కీళ్ కులమ్ పుక్క వరాహ గోపాలరైప్పోలే ఇవరుమ్ నిమగ్నరై యుయర్ త్త విళిన్దార్

సంక్షిప్త వ్యాఖ్యానము
ఎలా అయితే వరాహ పెరుమాళ్ళు భూమిని ఉద్ధరించుటకై మరియు కృష్ణుడు వంశమును ఉద్ధరించుటకై తక్కువ జన్మలు ఎత్తినారో అదే విధముగా ఆళ్వారు కూడా సంసారమున మునిగిన వారిని ఉద్ధరించుటకై తనకు తానుగా తక్కువ జన్మలో జన్మించారు

వ్యాఖ్యానము
అనగా – శ్రీ విష్ణు పురాణము 5.21.12 “యయాతి శాపాత్వమ్ శోయమ్ రాజ్యనర్హోహి సాంప్రదం”(యయాతి శాప కారణము చేత ఈ వంశమునకు రాజ్యమును పరిపాలించు యోగ్యత పోయినది) అని చెప్పినట్టు యయాతి శాపము చేత యదు వంశము రాజ్యము పరిపాలించుటకు యోగ్యతను కోల్పోయినది. [యయాతి తన కొడుకు అయిన యదు నుంచి యౌవనమును తీసుకొనదలచినప్పుడు అందుకు యదువు ఒప్పుకోలేదు అందు వలన యదు మరియు అతని వంశస్థులకు (తరువాతి తరాలకు)రాజ్యమును పరిపాలించుటకు యోగ్యత లేకుండా ఉండేలా శపించెను]. అప్పుడు కృష్ణుడు యదు వంశమును ఉద్ధరించుటకై గోకులమున అవతరించి శ్రీ విష్ణు పురాణము 5.20.49 “అయంసః గద్యతే ప్రాజ్ఞైః పురాణార్ధ విశారదైః గోపాలో యాదమ్ వంశమ్ మగ్నమభ్యుద్ధర్శయతి”(పురాణముల అర్ధములను నేర్చిన పండితులచే యదు వంశమును కృష్ణుడు ఉద్ధరించబోవుచున్నాడు అని చెప్పబడినది) అనియు తిరువాయిమొళి 6.4.5 “అన్గోర్ ఆయ్ క్కులమ్ పుక్కదుమ్”(గోకులమున అవతరించెను).

హిరణ్యాక్షుని బలము వలన నిరాధారమై ప్రళయమును పొందుచున్నట్టి భూమా దేవిని ఉద్ధరించుటకై తైత్తిరీయ ఉపనిషత్తు “ఉద్ధృతాహి వరాహేణ”(వరాహునిగా అవతరించిన ఆ సర్వేశ్వరుని గొప్ప శక్తిచే ఎత్తబడిన ఓ భూమా దేవి!) అనియు శ్రీ వరాహ పురాణము “నమస్తస్మై వరాహాయ లీలయోధారతే మహీమ్”(భూమా దేవిని ఉద్ధరించిన వరాహ భగవానునికి నమస్సులు) అని చెప్పినట్టు పాతాళము కిందకి పోయిన వరాహ రూపియగు సర్వేశ్వరుని వలె తిరువాయిమొళి 2.8.7 “కేళలాయక్కీళ్ పుక్కు”(అడవి వరాహముగా కిందకి ప్రవేశించి) అని చెప్పినట్టు కులము చేత కలుగు అహంకారము వలన సంసారమున మునిగి ఉండు వారిని ఆ స్థితి నుంచి తప్పించి వారికి గొప్పతనమును కలిగించేలా తిరుప్పల్లాండు 4 “అభిమాన తున్గన్”(శ్రీ వైష్ణవత్వము అన్న అభిమానముచే గొప్పవాడగు)అని చెప్పినట్టు అహంకారమే హేతువులగు వర్ణములు పనికిరానివి అని తోచునట్లు అట్టి అహంకారము లేనట్టిదైనది అయిననాల్గవ వర్ణమున తక్కువ వారిగా ఆళ్వారులు జన్మించారు.

“వీట్టన్బమ్”తో ఆరంభమగు 75వ సూత్రము మొదలుకొని ఇక్కడి వరకు అల్ప బుద్ధి కల వారి సందేహములను తీర్చుటకై కాను ఈ క్రిందవి చెప్పబడినవి.

– శ్రీ నమ్మాళ్వార్ల జన్మ నిరూపణము చేయడము వలన కలుగు పాపము
– వ్యాస మొదలగు వారి కంటే ఆళ్వార్ల అవతారమునకు గల గొప్పతనము
– వీరి అవతారము పరోపకారమునకై మరియు
– గొప్ప వారైనప్పటికీ నాల్గవ వర్ణమున అవతరించుట

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/11/acharya-hrudhayam-84-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

 

Leave a Comment