<< చూర్ణిక 84
అవతారిక
ఇంకనూ ఆళ్వార్ల వైభవమునకు అనుకూలముగా ఉండు సామాన్యమగు భాగవత వైభవమును అనేక ఉదాహరణములచే తెలుపుతూ ఇటువంటి వైభవములను తెలిసిన వారికే కదా జన్మము యొక్క హెచ్చుతగ్గులు తెలియును అని ఈ చూర్ణికలో నాయనార్లు తెలుపుచున్నారు.
చూర్ణిక
మ్లేఛ్ఛనుమ్ భక్తనానాల్ చతుర్వేదికళ్ అనువర్తిక్క అఱివికొడుత్తు పావనతీర్ధప్రసాదనామెన్గిఱ తిరుముఖప్పడియుమ్, విశ్వామిత్ర – విష్ణుచిత్త – తులసీభృత్యరోడే ఉళ్ కలన్దు తొళుకులమానవన్ నిలైయార్ పాడలాలే బ్రాహ్మణవేళ్వికుఱై ముడిత్తమైయుమ్, కీళ్ మకన్ తలైమకనుక్కు సమసఖావాయ్ తమ్బిక్కుమున్ పిఱన్దు వేలుమ్ విల్లుఙ్గొణ్డు పిన్ పిఱన్దారైచ్చోతిత్తు తమైయనుక్కు ఇళయోన్ సద్భావమ్ శొల్లుమ్ బడి యేకకులమానమైయుమ్ తూతుమొళిన్దు నడన్దువన్దవర్ కళుడైయ సమ్యక్ సగుణ సహభోజనముమ్, ఒఱుపిఱవియలే ఇఱుపిఱవి యానారిరువర్ క్కు ధర్మసూనుస్వామికళ్ అగ్రపూజై కొడుత్తమైయుమ్, ఐవరిల్ నాల్వరిల్ మూవరిల్ ముఱ్పట్టవర్ కళ్ సందేహియామల్ సహజరోడె పురోడాశమాకచ్చెయ్ త పుత్ర కృత్యముమ్, పుష్పత్యాగభోగమండపంగళిల్ పణిప్పూవుమ్ ఆలవట్ణముమ్ వీణైయుమ్ కైయుమాన అన్తరంగరై ముడిమన్ననుమ్ వైదికోత్తమరుమ్ మహామునియుమ్ అనువర్తిత్త క్రమముమ్ యాగానుయాగ ఉత్తర వీధి కళిల్ కాయాన్నస్థలశుద్ధిపణ్ణిన వృద్ధాచారమరివార్కిఱే జన్మోత్కర్షాపకర్షఙ్గల్ తెరివతు
సంక్షిప్త వ్యాఖ్యానము
ఈ క్రింది చెప్పబడిన సంఘటనలలో లోతుగా ఉన్న సంప్రదాయ సూత్రములను తెలిసినవారికి మాత్రమే జన్మము యొక్క హెచ్చు తగ్గులు తెలియును.
– ఆ సర్వేశ్వరుని దివ్య ఆజ్ఞ అయిన “మ్లేఛ్ఛుడు అయినప్పటికీ (నాలుగు వర్ణముల కంటే వేరైన వాడు) నా భక్తుడు అయినచో నాలుగు వేదములను తెలుసుకున్నవాడు అయినా తమ కుల దైవము వలెనే ఆతనిని సేవించి, ఆరాధించి, జ్ఞానమును ఇచ్చి మరియు అతను ఆరగించిన అన్న పానీయాదులను గౌరవముతో తీర్థ ప్రసాదము వలే సేవింపవలెను.
-విశ్వామిత్ర, పెరియాళ్వార్లు, తొండరడిప్పొడి ఆళ్వార్లతో (ముగ్గురూ ఆ స్వామికి సుప్రభాతమును పాడిన వారు). అలానే ఆశ్రయింపతగిన నంపాడువాన్లు బ్రాహ్మణుని (బ్రహ్మ రాక్షసుడు) యజ్ఞము యొక్క కొరతను తీర్చెను.
-తక్కువ కులమువాడైనట్టి గుహ ప్పెరుమాళ్ళు ఎక్కువ కులము వారు అయిన శ్రీ రామ చంద్రునికి [తన సొంత సోదరుల కంటే ముందుగా కూడా], తమ్ముడై బల్లెమును, బాణమును తీసుకొని(రాముని తరువాత పుట్టిన) శ్రీ లక్ష్మణ స్వామిని పరీక్ష చేసెను. మరియు తమ్ముడైన లక్ష్మణ స్వామి యొక్క సత్ప్రవర్తనను తన అన్నయైన భరతునికి తెలిపెను.ఈ విధముగా గుహుడు శ్రీ రాముని వంశము వాడు అయ్యెను.
-దూతను పంపిన శ్రీ రాముడు శబరి వద్ద మంచి భోజనమును తినుట, దూతగా వెళ్లిన శ్రీ కృష్ణుడు విదురుని వద్ద భోజనము తినుట మరియు హనుమంతునితో కలసి శ్రీ రాముడు భుజించుట.
– ఒక్క జన్మలోనే రెండు జన్మలుగల శ్రీ కృష్ణునికి మరియు తిరుమళిశై ఆళ్వార్లకు క్రమముగా ధర్మరాజు మరియు పెరుమ్బుళియూర్ అడిగళ్ అను వారు చేసినట్టి సత్కారములు.
– అయిదుగురిలో ఒకరు, నలుగురిలో ఒకరు, ముగ్గురిలో ఒకరు (యుధిష్ఠర, శ్రీ రామ, పెరియ నంబి)వేరొకళ్ళకి ఉత్తర కార్యములను చేయుట(విదుర, జటాయు, మాఱనేఱి నంబి)
-మట్టి పుష్పాలతో కైంకర్యము చేసిన కుఴుమ్బుఴుత్త నంబిని, విసనకర్రతో కైంకర్యము చేసిన తిరుక్కచ్చి నంబిని, వీణతో కైంకర్యాలు చేసిన తిరుప్పాణి ఆళ్వారులను క్రమముగా తొండమాను చక్రవర్తి, శ్రీ రామానుజులు వారు, శ్రీ లోక సారంగ మహామునులు ఆశ్రయయించిన విధమును.
– తిరువారాధన సమయమున శరీర శుద్ధిని, తదీయారాధన సమయమున అన్న శుద్ధిని, ఉత్తర వీధియందు స్థల శుద్ధిని చేసిన విధానము.
వ్యాఖ్యానము
మ్లేఛ్ఛనుమ్ భక్తన్ ఆనాల్
శ్రీ పాంచరాత్రము “మద్భక్త జనవాత్సల్యమ్ పూజాయాన్చ అనుమోదనమ్ స్వయమభ్యర్చనం చైవ మదర్ధే డమ్భవర్జనమ్ మత్కధాశ్రవణే భక్తిః స్వరనేత్రాజ్గవిక్రియా మమానుస్మరణం నిత్యం యచ్ఛమాం నోపజీవతి భక్తిరష్టవిధాహ్యేషా యస్మిన్మ్లేచ్ఛేపి వర్తతే” చాండాల కులమున జన్మినించిన వాడైననూ ఎనిమిది అంగములతో కూడిన భక్తిని కలిగి ఉన్నట్లు అయితే ,
1. నా భక్తుల పట్ల మాతృ వాత్సల్యమును కలిగి ఉండుట
2. నన్ను ఆరాధించు విషయమున ప్రీతిని కలిగి ఉండుట
3. నన్ను ఆరాధించుచూ ఉండుట
4. నా విషయమున దంభము లేకుండుట
5. నా చరిత్ర వినే విషయమున భక్తిని కలిగి ఉండుట
6. అట్టి భక్తి మూలకముగా స్వర, నేత్ర, అంగ వికారములు కలుగుట
7. నన్నే ఎప్పుడూ ధ్యానించుచూ ఉండుట
8. నా వలన వేరొక ప్రయోజనములు ఆశించకుండా ఉండుట
చతుర్వేదిగళ్ అనువర్తిక్క అఱివు కొడుత్తు
శ్రీ పాంచరాత్రము “స విప్రేన్ద్రో మునిః శ్రీమాన్ స యతిః చ పండితః తస్మై దేయం తతో గ్రాహ్యం”(ఒకడికి అట్టి ఎనిమిది విధములగు భక్తి కలిగినట్లైయితే అతడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు, ముని, శ్రీమంతుడు, యతి, పండితుడు అవుతాడు, అట్టి వాడికి ఇవ్వచ్చును వాడి నుంచి స్వీకరించవచ్చును) అనియు తిరుమాలై 42 “పళుదిలా ఒళుగలాత్తు, పలశదుప్పేది మార్గళ్, ఇళికులత్తవర్ గళేనుమ్, ఎమ్మడియార్ గళాగిల్, తొళుమినీర్ కొడుమిన్ కొళ్ మిన్”(తమ వంశ పరంపరలో దోషము లేనివారై నాలుగు వేదములను అభ్యసించినవారైన బ్రాహ్మణులైనప్పటికీ మా దాసులగు వారు మిక్కిలి తక్కువ కులమున జన్మించినవారైననూ, మీరు వారిని సేవించి వారికి విశేషార్ధములను ఉపదేశించి వారి వద్ద విశేషార్ధములను వినండి) అని చెప్పినట్టు గొప్ప వారై, గొప్ప కులమున జన్మించిన చేతుర్వేదులు తాము గొప్ప కులమున జన్మించినామని అహంకారము వలన దూషితమైన స్వస్వరూపమును పరిశుద్ధి చేసుకొనుటకుగాను, ఆశ్రయించుటకు విషయమై వారికి ఙ్ఞానాపేక్ష ఉన్నట్లు అయితే జ్ఞానమును ఇచ్చి
[గమనిక : జ్ఞానమును ఇచ్చిపుచ్చుకొనుట తగినదే అయినప్పటికీ వర్ణ ధర్మములను అతిక్రమించి వర్ణాంతర వివాహములు బహిష్కృతములే]
కులదైవతోడ ఒక్కప్ పూజై కొణ్డు
శ్రీ పాంచరాత్రము “స చ పూజ్యో యధాహ్యహం”(అట్టి భక్తుడిని నన్ను ఆరాధించినట్టు ఆరాధించవలెను) అనియు తిరుమాలై 42 “ఎన్రు నిన్నోడుమ్ ఒక్క వళిపద అరుళినాయ్ ప్పోల్”(నిన్ను ఆరాధించినట్టే అట్టి వారిని కూడా ఆరాధించవలెను అని నీవు మమ్మలను ఆజ్ఞాపించలేదా?) అని చెప్పినట్టు వారిని కులదైవముగా భావించి శ్రీ వైకుంఠ గద్య చూర్ణిక 3 “మమ కుల ధనం మమ కుల దైవతం”(ఆయన మమ్మల్ని రక్షించువాడు, మా కుల దైవము) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరునితో సమానముగా పెఱియ తిరుమొళి 2.6.4 “అవర్ ఎన్గళ్ కుల దేవ్యమే”(వారు మా కుల దైవము) అని చెప్పినట్టు కుల దైవముగా వారిని పూజించి
పావనతీర్ధప్రసాదనామ్ ఎన్గిఱ తిరుముఖప్పడియుమ్
విహాకోశము అనబడు సంహితలో “తత్పాదామ్బ్వతులం తీర్ధమ్ తదుచ్ఛిష్ఠం సుపావనం”(అతని శ్రీపాదములను స్పృశించిన నీరు పవిత్ర తీర్థము అగును; అతను తినిన తరువాత మిగులు ప్రసాదము పవిత్రమగును) అని చెప్పినట్టు అహంకారము అను సురాపానము త్రాగి అపరిశుద్ధములైన వారిని కూడా ఈ తీర్థ ప్రసాదములు పరిశుద్ధి చేయును అని భగవానుని శ్రీసూక్తి మరియు దానితో సమానమైనట్టి తొండరడిప్పొడి ఆళ్వార్ల తిరుమాలై 41 వ పాశురము.
విశ్వామిత్ర విష్ణుచిత్త తులసీభృత్యరోడే ఉళ్ కలన్దు తొళుకులమ్ ఆనవన్ –
విశ్వామిత్రుడు, పెరియాళ్వారు, తొండరడిప్పొడి ఆళ్వార్లతో సమాన అభిప్రాయమును గల భాగవతుడు అయిన నమ్పాడువాన్లు అపరాత్రియందు పాటలు పాడి నంబిని మేల్కొలుపటచే శ్రీ రామాయణము బాల కాండము 23.2 “కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం” (కౌసల్య యొక్క మంచి సంతానము అయిన ఓ రామ చంద్రా! తెల్లవారినది మేల్కొనుము, దైవికమగు ఆహ్నికములను చేయవలెను) అనియు పెరియాళ్వార్ తిరుమొళి 2.2.1 “అరవణైయాయ్! ఆయరేఴే! అమ్మమ్ ఉణ్ణత్ తుయిల్ ఎళాయే” శేషశాయి పై పవ్వళించిన గోకులమున ప్రధానమైన వాడా! నిద్ర నుండి మేల్కొనుము!) అనియు తిరుమాలై 45 “తుళావత్ తొణ్డాయ తొల్ శీర్త్ త్తొండరడిప్పొడి”(తులసి కైంకర్యముతో భాగవత శేషత్వమున ఉన్న తొండరడిప్పొడి ఆళ్వారు) తిరుప్పళ్ళిఏళుచ్చి 1 “అరజ్గత్తమ్మాప్పళ్ళి మెళున్దరుళాయే”(శ్రీరంగ క్షేత్రమున పవ్వళించిన ఓ స్వామీ! శ్రీ రంగనాధా! దయ చేసి మేల్కొనుము) అని ఈ విధముగా ఆ సర్వేశ్వరుని మేలుకొలిపిన వారు అయిన విశ్వామిత్రుడు, పెరియాళ్వార్లు, వినయపూర్ణులగు శ్రీ తొండరడిప్పొడి ఆళ్వారులను వీరితో సమాన వంశము వాడు అయి తిరువాయిమొళి 3.7.9 “వలమ్ తాన్గు శక్కరత్తణ్ణల్ మణివణ్ణర్కాళెన్ఴు ఉళ్ కలన్దార్”(కుడి చేతిలో సుదర్శనమును ధరించిన స్వామియైన మాణిక్యము వంటి శరీరమును గల శ్రీయఃపతికి దాసుడని అభిప్రాయముతో) అన్నట్లు భగవంతునికి శేషభూతుడను అను జ్ఞానముతో వేరొక ప్రయోజనము ఏదియూ లేనట్టి నడవడిక యందు అన్వయించిన వాడై తిరువాయిమొళి 3.7.8 “ఎమ్ తొళుమ్ కులమ్”(ఆశ్రయయింప తగిన కులము) అన్నట్టు గొప్ప ప్రయోజనమును కలిగిన వారు ఆదరించునట్టి వైభవముతో కూడి ఉన్న జన్మసిద్ధ నైచ్యము గల భాగవతుడు(నమ్పాడువాన్లు).
నిలైయార్ పాడలాలే బ్రాహ్మణ వేళ్వికుఱై ముడిత్తమైయుమ్ –
చరక వంశమునకు చెందిన వాడు అయిన సోమ శర్మ అను బ్రాహ్మణుడు తాను ఆరంభించిన యజ్ఞమును చేయలేనివాడై దానిని సమాప్తము చేయకుండానే చనిపోవడము చేత బ్రహ్మరాక్షసునిగా పుట్టి సంచరించుచుండగా కైశిక మాహాత్మ్యము “త్వం వై గీత ప్రభావేన నిస్తారయితుమర్హసి | ఏవం ఉక్త్వాధ ఛండాలం రాక్షసశ్శరణం గతః|| “(చాండాల కులమున జన్మించిన నమ్పాడువానుని బ్రహ్మరాక్షసుడు ఈ విధముగా శరణు వేడెను :”నీ పాట మహిమ చేత నా శాపమును పోగొట్టగలవు”) అన్నట్టు నీవు నీ పాట ప్రభావముచేత నన్ను ఈ దుస్థితి నుంచి కాపాడవలెను అని శరణు వేడగా “యన్మయా పశ్చిమం గీతం సర్వం కైశిక ముత్తమమ్ ఫలేన తస్య భద్రం తే మోక్షయిష్యసి కిల్బిషాత్”(కైశిక స్వరముతో నేను పాడిన పాట యొక్క ఫలితము చేత నీవు నా పాపమును పోగొట్టుకొనుగాక నీకు మంగళము కలుగుగాక) అన్నట్టు నంబి సన్నిధిలో పాడిన పాట కైశిక స్వరముచే “ఏవం తత్ర వరం గృహ్య రాక్షసో బ్రహ్మ సంజ్ఞితః యజ్ఞపాశాద్వినిర్ముక్తః సోమశర్మా మహా యశాః” ఈ విధముగా వరమును పొంది బ్రహ్మరాక్షసత్వము నుండి సోమశర్మ విముక్తుడు అయ్యెను అని చెప్పినట్టు రాక్షస జన్మను పోగొట్టి ఉజ్జీవింపచేయుటచే నమ్పాడువాన్లు ఆ బ్రాహ్మణుని యజ్ఞ కొరతను పూర్తి చేసిన విధము.
కీళ్ మకన్ తలైమకనుక్కు సమసఖావాయ్ –
నిషాద కులమున పుట్టిన గుహ పెరుమాళ్ళు జన్మను బట్టి, నడవడికను బట్టి, జ్ఞానమును బట్టి తక్కువ వారై పెరియ తిరుమొళి 5.8.1 “ఏళై ఏదలన్ కీళ్ మగన్”(అజ్ఞాని, హంతకుడు మరియు తక్కువ జన్మ గల వాడు) అనియు పెరియ తిరుమొళి 5.8.1 “ఉగన్దు తోళన్ నీ”(సంతోషించి స్నేహితుడివి అయినావు) అయోధ్యాధిపతి అవ్వడము చేత వాటి అన్నింటి(జన్మ, నడవడిక, జ్ఞానము) విషయమున ఉత్క్రుష్టుడవ్వడమే గాక ధర్మైక్యముచే నిత్యసూరులకు నాయకుడు అయిన శ్రీ రామచంద్రునికి సమానమైన మిత్రుడై.
తమ్బిక్కు మున్ పిఱన్దు –
పెరియ తిరుమొళి 5.8.1 “ఉమ్బి ఎమ్బి”(నా తమ్ముడు నీ తమ్ముడు) అని చెప్పడము చేత శ్రీ రాముని తమ్ముడైన లక్ష్మణ స్వామికి గుహ ప్పెరుమాళ్ళు అన్న అయ్యెను.
వేలుమ్ విల్లుమ్ కొణ్డు పిన్ పిఱన్దారైచ్ చోదిత్తు –
ఈ విధముగా గుహ ప్పెరుమాళ్ళను స్వీకరించిన రోజు శ్రీరామ చంద్రుడు శయనించి ఉండగా వారి యొక్క సౌకుమార్యమును అనుసంధించుకొనుటచే కలిగిన భయముతో మేలుకొని చేతిలో ధనుస్సు పట్టుకొని నిలబడి ఉన్నట్టి లక్ష్మణ స్వామి విషయమున అనుమానము కలిగి పెరియాళ్వార్ తిరుమొళి 3.10.4 “కూర్ అణిన్ద వేల్ వలవన్”(పదునైన బల్లెము కలిగి ఉన్నాడు) అనియు శ్రీ రామాయణము 87.23 “తతస్త్వహంచోత్తమ బాణ చాప ధృత్ స్థితోభవమ్ తత్ర స యత్ర లక్ష్మణః”(అంతట నేను మంచి ధనస్సును చేతబట్టిన లక్ష్మణ స్వామి లాగా నిలిచి ఉంటిని) అని చెప్పినట్టు ఆయుధము కలవారై రామచంద్రుని పైన దృష్టిని ఉంచి వారి(లక్ష్మణ స్వామి) యొక్క ఉద్దేశ్యమును పరీక్షించి.
తమైయనుక్కు ఇళయోన్ సద్భావమ్ శొల్లుమ్ బడి ఏకకులమానమైయుమ్ –
శ్రీ రామాయణము అయోధ్యా కాండ 86.1 “ఆచ్చక్షేధ సద్భావం లక్ష్మణశ్య మహాత్మనః భరతాయాప్రమేయ గుహేన గహనగోచరః”(అరణ్యమున సంచరించు వాడైన గుహప్పెరుమాళ్ళు, ఇళైయ ప్పెరుమాళ్ల (లక్ష్మణ స్వామి) యొక్క గొప్పతనమును గూర్చి మహాత్ముడైన భరతాళ్వానుకు వివరించెను)అన్నట్టు శ్రీ రాముని విషయమున ప్రేమ, పారతంత్ర్యములే తన (లక్ష్మణ స్వామి) యొక్క స్వరూప నిరూపకములుగా ఉండు స్వభావమును గూర్చి గుహుడు శోకముతో అన్న కోసము తిరుచ్చిత్రకూటమునకు పోవుచున్న భరతునికి వివరించెను. శ్రీ రామాయణము బాల కాండము 18.27 “బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధః”(తన బాల్యము నుంచే లక్ష్మణుడు రామునికి భక్తునిగా ఉండెను) అనియు శ్రీ రామాయణము అరణ్య కాండము 15.7 “పరవానస్మి”(నేను నీ కొరకే ఉన్నాను) అని చెప్పినట్టు ఈ విధముగా ఇక్ష్వాకు వంశస్థులు అయిన శ్రీ రామచంద్రాదులతో గుహుడు కుల ఐక్యమును కలిగిన వారు అగుట.
తూతు మొళిన్దు నడన్దువన్దవర్ కళుడైయ సమ్యక్ సగుణ సహభోజనముమ్ –
సీతా పిరాట్టికి హనుమంతుని ద్వారా సందేశమును పంపిన చక్రవర్తి తిరుమగన్ (చక్రవర్తి అయిన దశరధుని కుమారుడు అయిన శ్రీ రాముడు) పెరియ తిరుమొళి 2.2.3 “మున్నోర్ తూదు వానరత్తిన్ వాయిల్ మొళిన్దు”(శ్రీ రామావతారములో చక్రవర్తి తిరుమగన్ అద్వితీయమైన సందేశమును హనుమంతుని తిరువాక్కుల ద్వారా వెలువడాలని అతనిని అక్కడ దూతగా పంపెను) అని చెప్పినట్టు శ్రీ శబరి చేతులతో చేయబడిన మంచి భోజనమును శ్రీ రామాయణము బాల కాండము 1.57 “శబర్యా పూజితస్సమ్యక్ రామో దశరధాత్మజః”(దశరధుని కుమారుడైన శ్రీ రాముల వారిని శబరి ఆదరించినది)అనియు పెరియ తిరుమొళి 6.2.9 “కుడై మన్నర్ ఇడై నడన్ద తూదా”(రాజుల మధ్యకు వెళ్లిన దూత) అని చెప్పినట్టు పాండవులకు దూతగా వెళ్లిన శ్రీ కృష్ణుడు భీష్మ, ద్రోణుల గృహమును విడిచి మహాభారతము ఉద్యోగ పర్వము “విదురాన్నాని బుబుజే సుచీని గుణవంతి చ”(భోగ్యమైన విదురుని భోజనమును స్వీకరించిన కృష్ణుడు) అని చెప్పినట్టు విదురుని గృహమున చేసిన పరిశుద్ధమైన భోగ్యమైన భోజనమును ఆనందముగా స్వీకరించెను.
హనుమను చూసి అత్యంత ఆదరమును కలవాడై పెరియ తిరుమొళి 10.2.6 “దృష్టా సీతా”(సీతను చూసాడు)అన్నట్టు ప్రీతితో తన దివ్య హృదయమున తలచి పద్మోత్తర పురాణము ఉపకారాయ సుగ్రీవో రాజ్యకాంక్షీ విభీషణః నిష్కారణాయ హనుమాన్ తత్తుల్యం సహభోజనమ్”(శ్రీ రాముడు చేసిన ఉపకారములకు ప్రత్యుపకారముగా సుగ్రీవుడు కైంకర్యములు చేసెను, కానీ హనుమంతుడు ఎట్టి ఆపేక్షా లేకుండా శ్రీ రామునికి కైంకర్యము చేసెను. విభీషణుడు రాజ్యము కోసము చేసెను. అందువలన హనుమంతునితో కలిసి శ్రీ రాముడు భోజనము చేయుట సమంజసము) అని చెప్పినట్టు సహ భోజనమును చేసెను(ఒకే కంచములో ఇద్దరు కలిసి ఆహారమును తినుట) పెరియ తిరుమొళి 5.8.2 “కోదిల్ వాయ్ మయినామోడుమ్ ఉడనే ఉణ్ణన్ నాన్”(ఎట్టి దోషము లేని మధురమైన వాక్కులను కలిగిన నీతో నేను కలిసి భోజనము చేసేదెను)
ఒఱుపిఱవియలే ఇఱుపిఱవి యానారిరువర్ క్కు ధర్మసూనుస్వామికళ్ అగ్రపూజై కొడుత్తమైయుమ్ –
యదు వంశమున పుట్టి గోపకులమున గోపా బాలునిగా పెరుగుటచేత ఒక జన్మనే రెండు జన్మలుగా గల శ్రీ కృష్ణునికి ధర్మరాజు తన యాగమున మొట్టమొదటి సత్కారములను ఇచ్చెను. ఋషి పుత్రునిగా(భార్గవ ఋషి) జన్మించి వేరొక కులమున వారితో సమానముగా పెరిగిన తిరుమళిశై ప్పిరాన్లకు పెరుంబులియార్ అడిగళ్ అను వారు తమ యాగమున మొట్టమొదటి సత్కారములను ఇచ్చెను.
ఐవరిల్ నాల్వరిల్ మూవరిల్ ముఱ్పట్టవర్ కళ్ సందేహియామల్ సహజరోడె పురోడాశమాకచ్చెయ్ త పుత్ర కృత్యముమ్ –
అయిదుగురు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు జ్ఞానాధిక్యమును మరియు అశరీరి(ఆకాశవాణి) వాక్కును స్వీకరించి సందేహింపకుండా శ్రీ విదురునకు కొడుకు చేయవలసిన ఉత్తర క్రియను తానే చేసెను.
దశరధుని కుమారులలో పెద్దవాడైన పెరుమాళ్ళు శ్రీ రామాయణము అరణ్య కాండము 68.27 “సౌమిత్రే హర కాష్ఠాణి నిర్మతిష్యామి పావకమ్ గృధ్రరాజం దిదక్షామి మత్ కృతే నిదనం గతం(ఓ లక్ష్మణా! నా కార్యము కోసము తన ప్రాణమును కోల్పోయిన పక్షి రాజైన జఠాయువునకు నేనే ఉత్తర కర్మలను చేసెదను, నీవు సమిధలను తీసుకొని రా) అని చెప్పినట్టు ఇళయ ప్పెరుమాళ్ళు శ్రీ రామునికి పక్కనే ఉన్నప్పటికీ ఆతని చేత చేయించకుండా తానే స్వయముగా అంతిమ సంస్కారములను చేసెను. శ్రీ రామాయణము అరణ్య కాండము 68.31 “ఏవం ఉక్త్యా చిత్తామ్ దీప్తాం ఆరోప్య పతగేశ్వరమ్ దధాహ రామో ధర్మాత్మా స్వ బంధుం ఇవ దుఃఖితః”(ఈ విధముగా పలుకుతూ ధర్మాత్ముడైన శ్రీ రాముడు మండుతున్న కాష్ఠము పైన జఠాయువును ఉంచి దుఃఖించినవాడై బంధువు వలే దహనము చేసెను)
పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, పెరియ తిరుమలై నంబి అను వీరు సహాధ్యాయులై శ్రీ ఆళవందార్లను ఆశ్రయించిన వారై శ్రీ రామానుజులకు ఆచార్యులై ప్రసిద్ధులగు ఈ ముగ్గురు నంబులలో ప్రధానులైన పెరియ నంబి మాఱనేఱి నంబి అను వారు సాయించినట్టి “పురోడాశత్తై నాయక్కు ఇడదే కొళ్ళుమ్”(పురోడాశమును కుక్కలకు వేయొద్దు) అన్నట్టు వారి చరమ శరీరమును పురోడాశముగా తలచి చేసిన ఉత్తర క్రియలు.
పుష్పత్యాగభోగమండపంగళిల్ పణిప్పూవుమ్ ఆలవట్ణముమ్ వీణైయుమ్ కైయుమాన అన్తరంగరై ముడిమన్ననుమ్ వైదికోత్తమరుమ్ మహామునియుమ్ అనువర్తిత్త క్రమముమ్ –
తిరువాయిమొళి 3.3.2 “సింధు పూ మగిళుమ్ తిరువేంగడమ్”(సమర్పించిన పుష్పములు పరిమళించుచున్నట్టి వెంకటాద్రియందు) అని చెప్పినట్టు పుష్ప మండపముగా పిలువబడు తిరుమలలో పుష్పములను చేతితో పట్టుకొని కురుంబురుత్త నంబిని తిరువాయిమొళి 5.8.9 “తుళన్దు నీళ్ ముడి అరసర్ తమ్ కురిసిల్ తొణ్డనై మన్నవన్”(ప్రకాశించుచున్న కిరీటమును కలిగిన తొణ్డమానుడు అను రాజులకే రాజు అయిన చక్రవర్తి) అనబడు తొణ్డమాను చక్రవర్తిచే ఆరాధింపబడిన తిరువేంగడముడైయాన్లు (శ్రీనివాసుడు)
“వేగవత్యుత్తరే తీరే పుణ్యకోట్యామ్ హరిస్స్వయమ్ వరదస్సర్వ భూతానామ్ అధ్యాపి పరిదృచ్యతే”(వేగవతీ నది ఉత్తర తీరమున పుణ్యకోటి విమానములో విష్ణురూపమైన వరదుడు అందరికీ వరములను ప్రసాదించుటకు వేంచేసియున్నాడు) అని చెప్పినట్టు త్యాగమండపముగా పిలువబడి పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)లో పెరుమాళ్ళకి అత్యంత ఆంతరంగికులైన ఆలవట్ట కైంకర్యమును చేయు వైదికొత్తములైన తిరుక్కచ్చి నంబిని శ్రీ రామానుజులు వారు సేవించుకొనుట.
పెరుమాళ్ తిరుమొళి 1.1 “తెణ్ణీల్ప్ పొన్ని తిరైక్కైయాల్ అడి వరుదప్ ప్పళ్ళి కొళ్ళుమ్”(తన చేతుల వంటి కెరటములతో పెరియ పెరుమాళ్ళ పాదములను మర్దన చేయు కావేరీ) అని చెప్పినట్టు భోగ మండపముగా పిలువబడు కోయిల్(శ్రీరంగము)న పెరియ పెరుమాళ్ళకు తమ వీణతో కైంకర్యము చేసిన అత్యన్త ఆంతరంగీకులైన తిరుప్పాణి ఆళ్వార్లను లోక సారంగ మహా మునులు సేవించుట.
యాగానుయాగ ఉత్తర వీధి కళిల్ కాయాన్నస్థలశుద్ధిపణ్ణిన వృద్ధాచారముమ్ –
“యజ దేవ పూజాయామ్”(యజ అనగా ఆ భగవానుని ఆరాధించుట) అని చెప్పినట్టు యాగముతో తెలియబడు తిరువారాధనములో పిళ్ళై ఉఱంగా విల్లి దాసులను స్పృశించి ఉడయవర్లు తమ దివ్య తిరుమేనిని శుద్ధి చేసుకొనుట.
యాగము అయిన తిరువారాధనము సమాప్తి అయిన తరువాత తదీయారాధన జరుగును కనుక అది అనుయాగముతో సూచించబడినది. అట్టి తదీయారాధనములో అనగా ప్రసాద సేవనములో పిళ్ళై ఏఱు తిరువుడైయార్ దాసర్ అనువారి చేతులతో ప్రసాదమును స్పృశింపజేసి నంబిళ్ళై ఆ ప్రసాదమును శుద్ధి చేయుట.
శ్రీరంగమున ఉత్తర వీధిలో కొత్త తిరుమాళిగకు వెళ్తున్న నడువిల్ తిరువీధి ప్పిళ్ళై భట్టరు అనువారు పిళ్ళై వానమామలై దాసర్ అనువారితో అక్కడ నడిపించి శుద్ధి చేయుట.
గమనిక : ఈ ఘట్టములు అన్నియూ భాగవతుల గొప్పతనమును వారు జన్మించిన వర్ణములతో నిమిత్తము లేకుండా సూచించును.
అరివార్కిఱే జన్మ ఉత్కర్ష అపకర్షఙ్గల్ తెరివతు –
ఈ పైన చెప్పిన వీటన్నింటినీ తెలిసికొని ఉన్న వారికి కదా ఈ జన్మము గొప్పది ఈ జన్మము తక్కువది అని ఈ విధముగా జన్మముల యొక్క హెచ్చు తగ్గులు తెలియవచ్చును అని అనడము అంటే!
దీనితో ప్రమేయమైన ఆ ఈశ్వరుని మరియు ప్రమాతా అయిన భాగవతుల ఆచరణ అల్ప బుద్ధి గల వారికి సైతం ఈ క్రింద చెప్పబడిన సూత్రములతో నాయనార్లు స్పష్టము చేసెను :
– తక్కువ కులము వారు భగవద్భక్తులు అయినచో వారు ఎక్కువ కులము వారిచే ఆశ్రయింపతగినవారు.
– వారికి జ్ఞానమును ఇచ్చువారై
– సర్వేశ్వరుని వలె పూజింపతగినవారై
– తమ యొక్క తీర్థ ప్రసాదములచేత ఇతరులను పరిశుద్ధులను చేయతగినవారై
– ఎక్కువ కులములో పుట్టి పాపములలో మునిగిన వారిని సైతం తమ సాంగత్యముతో ఉజ్జీవింపతగినవారై
– వీరి పట్ల భగవంతునికి, భాగవతులకు గల ప్రేమ, ఆదరములు
– వారి స్పర్శయే పరమ పావనము
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-85-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org