సూత్రము – 4
అవతారిక
ఇతిహాసములు యొక్క గొప్పతనమును పిళ్ళై లోకాచార్యులు ఇంకనూ వివరించుచున్నారు.
సూత్రము
అత్తాలే అదుముఴ్పట్టత్తు
సంక్షిప్త వ్యాఖ్యానము
ఆ కారణము చేతనే ఇది మొదటగా పేర్కొనబడినది
వ్యాఖ్యానము
అత్తాలే…
ఛాందోగ్య ఉపనిషత్తు 7.21 “ఇతిహాస పురాణం పంచమం”(ఇతిహాసములు మరియు పురాణములు పంచమ వేదము) అనియు బార్హస్పత్య స్మృతి “ఇతిహాస పురాణాభ్యామ్”(ఇతిహాసములు మరియు పురాణములతో) అని శృతి, స్మృతులలో ఈ రెంటిని గూర్చి చెప్పినప్పుడు ఇతిహాసములు పురాణముల కంటే ముందుగా పేర్కొనబడినది.
ద్వంద్వ సమాసములో(సంబంధిత వస్తువుల మధ్య సంబంధము) తక్కువ అచ్చులు ఉన్న పదము గాని గొప్ప అర్ధము గల పదము గాని ముందు చెప్పవలెను. కానీ “ఇతిహాస”(సంస్కృత పదము) అను పదములో తక్కువ అచ్చులు లేనప్పటికీ ఇతిహాసమునే ముందు చెప్పుటకు గల కారణము ఏమి అనగా పురాణముల కంటే ఇతిహాసములు గొప్పవైనవి అవ్వడము చేత అని అర్ధము అవుతున్నది.
వేరొక వివరణ – ఈ విధముగా రెండు భాగములను గల వేదము యొక్క అర్ధమును నిర్ణయించునప్పుడు మొదటి సూత్రమున “ఇతిహాసాశ్చ పురాణిచ ఇతిహాస పురాణాని స్మృత్యశ్చ ఇతిహాస పురాణిచ స్మృతీతిహాస పురాణాని”(ఇతిహాసములను మరియు పురాణములను కలిపి “ఇతిహాస పురాణాని” అని పేర్కొనబడినవి మరియు స్మృతి, ఇతిహాసములు, పురాణములను కలిపి “స్మృతీతిహాస పురాణాని”గా పేర్కొనబడినవి)అని చెప్పినట్టు ఇక్కడ పిళ్ళై లోకాచార్యుల వారు ద్వంద్వ సమాసము పైన దృష్టి సారించడము చేత “ఇవై ఇరణ్డిలుమ్”తో మొదలుకొని కృప చేసిన వివరణ ఏమి అనగా ఇతిహాసములో తక్కువ అచ్చులు లేనప్పటికీ పురాణముల కంటే ముందుగానే పేర్కొనబడడము. ఈ సూత్రములో ఈ పద్ధతిని అనుసరించి మనకు అర్ధము అవుచున్నది ఏమి అనగా – ఇతిహాసములకు గల గొప్ప ప్రామాణ్యము చేత “ఇతిహాస పురాణన్గళాలే”లో ఇతిహాసము ముందుగా చెప్పబడినది.
ఈ విధముగా పిళ్ళై లోకాచార్యుల వారు కృప చేయడము చేత వేదము యొక్క అర్ధములను నిర్ణయించునప్పుడు –
– పూర్వ భాగములో అర్థమును నిర్ణయించునప్పుడు స్మృతులను తెలుసుకొని అర్ధములను నిర్ణయింపవలెను.
– ఉత్తర భాగము అనగా ఉపనిషత్తుల అర్థమును నిర్ణయించునప్పుడు ఇతిహాస పురాణములలో ప్రబలమైన ఇతిహాసముల అర్థమును తెలుసుకొనియే నిర్ణయింపవలెను.
ఇక మీద చెప్పబోవు సూత్రములలో కావాలసిన ప్రమాణములను ఎత్తి చూపడము అయినది.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2020/12/09/srivachana-bhushanam-suthram-4-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org