కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 2 – సంగ్రహం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి 

<< 1 – జననం 

తల్లి యశోదా భావంలో పెరియాళ్వార్, కృష్ణుడి లీలలను అనుభవించి సుందరమైన పాశురాల రూపంలో మనకు అందించారు. పెరియాళ్వార్ తిరుమొళి అనే గ్రంథంలోనీ అనేక పదిగాలలో, కృష్ణుడి లీలలు అనుభవించటమే కాక మనకు అత్యంత కృపతో మనకు వివరించారు.

పెరియాళ్వార్ తిరుమొళిలో, “వణ్ణ మాడఙ్గళ్ శూళ్ తిరుక్కోట్టియూర్ కణ్ణన్ కేశవన్ నంబి పిఱన్దినిల్ ఎణ్ణెయ్ శుణ్ణమ్ ఎదిర్ ఎదిర్ తూవిడ కణ్ణన్ ముర్ట్రమ్ కలన్దు ఆళరాయిఱ్ఱే” (అందమైన రంగురంగుల మేడలు కలిగిన తిరుకోష్ఠియూర్ అనే దివ్య దేశంలో, పరిపూర్ణుడు అయిన కేశవుడు, శ్రీకృష్ణుడిగా అవతరించారు. రంగులు ఒకరిపై ఒకరు చల్లుకొని , కృష్ణుడి భవనం ముందర భాగం అంత బురదగా మారింది), భగవానుడి అవతారం జనులు ఎలా జరుపుకున్నారు అని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఇంకా…

  • గోప జనులు, వారి నాయుడు నందగోపుడు మరియు యశోదా దేవికి సంతానం కలగడంతో ఆనందంగా రంగులు చెల్లుకుని ఆడుతూ పాడుతూ, సంతోషంగా ఉత్సవం జరుపుకున్నారు.
  • గోప స్త్రీలు అందరూ ఒక్కొకరిగా వచ్చి కృష్ణుడిని ఎత్తుకుని, లాలించి, విశేషమైన ఆనందాన్ని పొందారు.
  • బ్రహ్మ, ఇంద్ర, రుద్రాది దేవతలు వచ్చి కృష్ణుడికి బహుమతులు అందించారు.
  • చంద్రుడిని చూసి, యశోద వెన్నంటి ఊగుతూ, చేతులు చప్పరించి, పొట్టపై పడి, తడబడుతూ నడుస్తూ, తల్లి పాలు తాగుతూ, చెవులు పొడిపించుకుని, స్నానం చేసి, జుట్టు దిద్దించుకుని, పూలు ధరించి, దృష్టిదోషం తొలగించించుకుని, వెన్న దొంగిలించి పట్టుబడి, అనేక రాక్షసులను సంహరించి, వేణువు వాయించి, ఆవులు–దూడలను మేపుతూ, గోపికలతో రాసక్రీడను ఆస్వాదిస్తూ ఉండడం.

ఇంకా ఎన్నో సన్నివేశాలు ఆళ్వార్ చూపారు. ఇంకా మిగితా ఆళ్వార్లు కూడా కృష్ణుడి జననాన్ని మరియు ఇతర లీలలను విపులముగా అనుభవించి అనుగ్రహించారు.

కృష్ణుడికి వెన్న, నెయ్యి, పాలు, పెరుగు అంటే చాలా ఇష్టం. కృష్ణుడు వెన్న దొంగలించి పట్టుబడ్డ లీలను ధ్యానించిన నమ్మాళ్వార్ ఆరు మాసాలు మూర్ఛిల్లిపోయారు. నమ్మాళ్వార్, తిరుమంగైయాళ్వార్ మరియు కులశేఖరాళ్వార్, వారి పాశురాలలో కృష్ణుడి పైన ప్రణయకలహాన్ని వివరంగా అనుభవించారు. శ్రీమన్ నాథమునిగళ్ మొదలగు ఆచార్యులు అందరూ శ్రీకృష్ణావతారంలో లోతుగా మునిగి అనుభవించిన వారే.

శ్రీకృష్ణావతారం అనుభవించే క్రమంలో, ఆళ్వార్లు ఆచార్యులు అందరూ అర్చావతారం సంబంధంగా అనుభవించారు. అర్చావతారం, విభవావతారం యొక్క ప్రతీకగా, ఎవరైతే విభవావతారం అనుభవించలేక పోయారో వారి కొరత అర్చావతారం తీరుస్తుంది అని చెప్పారు. 

ఇలా, శ్రీకృష్ణుడి లీలలను వాటి సారాంశాన్ని ఒక్కోటిగా అనుభవిద్దాం 

మూలము: https://granthams.koyil.org/2023/08/23/krishna-leela-2-english/

ఆడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment