శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 3 – పూతన వధ

కృష్ణుడు శిశువు గా తొట్లల్లో ఆడుకుంటున్న సమయం లో జరిగిన ఇంకొక్క అద్భుతమైన లీల, శకటాసుర వధ. ఈ సంఘటన ను ఆళ్వార్లు పలు చోట్ల, ఎంతో అందముగా అనుభవించి, పాశురాలు అనుగ్రహించారు. నమ్మాళ్వార్, ఈ లీల గురించి చెప్తూ “తళరన్దుం ముఱిన్దుం శకటావసురర్ ఉడల్ వేఱా పిళన్దు వీయత్ తిరుకాల్ ఆండ పెరుమానే!” (శకటాసురుడి శరీరాన్ని రూపం మాపి, తన తిరుపాదంతో రెండుముక్కలు చేసిన. ఓ స్వామి!).
ఒక్కసారి, యశోదా దేవి, ఒక బండి చక్రాలకు ఉయ్యాల కట్టి, కృష్ణుడిని అందులో నిద్ర పుచ్చి ఇంటి పనులు చేసుకోవటానికి వెళ్లారు, ఆ సమయంలో కంసుడు పంపించిన అసురుడు, ఇలా కృష్ణుడిని చంపటానికి తేలిక మార్గం ఆ చక్రం లోకి దూరటం అని భావించి, అందులోకి చేరి, కృష్ణుడు వైపుగా పరిగెట్టాడు, అదే సమయంలో నిద్రలేచిన కృష్ణుడు, తల్లి పాల కొరకు ఏడుస్తూ తిరుపాదలను గాలిలో ఆడిస్తుండగా, ఆ దివ్య పాదాలకు తగిలి, శరీరం బలహీన పడి, ముక్కలు అయిపోయాడు. ఆ బండి కూడా పగిలి పొయ్యింది, అది చూసిన యశోదా దేవి పరుగున వచ్చి, కృష్ణుడిని ఎత్తుకుని, ముద్దాడింది. అందరూ కృష్ణుడు, భగవంతుడి కృప వల్ల కాపాడబడ్డాడు అని అనుకున్నారు.
ఈ లీలలోని ఆంతర్యం :
- ఎలాగైతే భగవంతుడి తిరుపాదాలు మనకు రక్షకములో, ఆ తిరుపాదాలు ఆయనకూ రక్షకాలే.
- భగవంతుడు, శత్రు సంహారానికి ప్రత్యేకముగా ప్రయాస పడాల్సిన అవసరం లేదు, ఇలా సులువుగా సాధించగలడు.
- భగవానుడు, దుష్ట శిక్షణార్థం ప్రత్యేక ఆయుధాలు ఉపయోగించటం అనావశ్యకం, తన తిరుమేని (దివ్య హస్త/పాదాల) ద్వారా కూడా ఈ కార్యం సిద్ధిస్తుంది.
మూలం : https://granthams.koyil.org/2023/08/26/krishna-leela-4-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org