శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

గోకులంలో తరుచుగా అల్లర్లు జరుగుతున్న కారణమున, నందగోపుడు మరియు ఇతర గ్రామ పెద్దలు గోకులం నుండి బృందావనంకు తరలి వెళ్లాలి అని నిశ్చయించుకుని, వారు అనేక ఎడ్లబండులు కట్టుకుని బృందావనానికి చేరారు. బృందావనం ఒక్క అందమైన పచ్చని చోటు, ఆవులను మేపటానికి అనువైన ప్రదేశం. కావున, వారు బృందావనం చేరి అది వారికి అణువైన ప్రదేశం అని తలిచారు.
అయినప్పటికి, అక్కడికి చేరినా రాక్షసుల అల్లరి తగ్గలేదు. ఒక్కసారి, కంసుడు కృష్ణుడి పైకి ఇద్దరు అసురులను ఒకేసారి పంపగా, ఒక అసురుడు దూడలోకి, ఇంకొక్క అసురుడు వెలగపండులోకి దూరారు. ఇది గమనించిన కృష్ణుడు, ఏమీ ఎరుగని వాడి లాగా. ఎప్పుడైతే ఆ దూడ కృష్ణుడిపైకి రాగ దాన్ని ఎత్తి, ఆ వెలగపండు పైకి వెయ్యగా, ఒకేసారి ఇద్దరు సంహరింపబడ్డారు. ఈ వృత్తాంతాన్ని “వత్సాసుర – కపిత్తాసుర వధం” అంటారు. ఈ లీలను కూడా ఆళ్వార్లు వారి పాశురాలల్లో కొనియాడారు. నమ్మాళ్వార్ వారి పెరియ తిరువందాదిలో “ఆనీన్ఱ కన్ఱుయర త్తామెఱిన్దు కాయుతిర్త్తార్తాళ్” (కృష్ణుడు ఆవు జన్మనిచ్చిన దూడతో వెలగపండుని పడేశాడు), ఆండాళ్ తన తిరుప్పావై లో, “కన్ఱు కుణిలా ఎఱిన్దాయ్” (దూడను కర్రలా పడేశాడు); తివిళంగనియై ఇళంగన్రు కొండు ఉదిర ఎరిందు (వెలగపండుని దూడతో పడేశారు) భూదత్తాళ్వార్ తమ ఇరండాం తిరువందాది లో “తాళన్ద విళఙ్గనిక్కు క్కన్ఱెఱిన్దు” (కిందకు వంగిన వెలగపండు పైకి దొడను విసిరి).
ఇంకొక్క అసురుడు కొంగలాగా వచ్చాడు. కృష్ణుడు దాని నోటిని చీల్చి చంపారు. ఈ వృత్తాంతాన్ని బకాసుర వధ అని అంటారు మరియు దీన్ని ఎందరో ఆళ్వార్లు కీర్తించారు. ఆండాళ్ తన తిరుప్పావై లో, “పుళ్ళిన్ వాయ్ కీణ్డానై” (పక్షి నోటిని చీల్చిన వాడు); తిరుమంగయాళ్వార్ తమ పెరియ తిరుమొళి లో “పుళ్వాయ్ పిళంద” (పక్షి నోటిని చీల్చిన వాడు) నమ్మాళ్వార్ తమ తిరువాయిమొళి “పుళ్ళిన్ వాయ్ పిళందాయ్!” (పక్షి నోటిని చీల్చిన వాడా)
ఈ విధంగా, కృష్ణుడు పెరుగుతూ ఉండగా, వారి లీలలు మరియు అద్భుతాలు పెరిగాయి. ఆవులు దూడలతో ఆడటం, గోపికలు తయారు చేసిన వెన్న మరియు పెరుగు దొంగలించటం సర్వసాధారణ లీలలుగా ఉండేవి.
ఈ సంఘటనల సారంశం,
- భగవానుడు, తన పట్ల దోషభూయిష్టమైన వ్యవహారం కలిగిన వారిని గుర్తించి వారిని తేలికగా సంహరిస్తాడు.
- శత్రువులను సంహరించటం భగవానుడికి సరళమైన కార్యం.
మూలం : https://granthams.koyil.org/2023/09/07/krishna-leela-9-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org