కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 10 – దధిపాండుడు పొందిన వరం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి 

<< 9 – బృందావనం తరలి వెళ్లుట, ఇంకొందరు అసురుల సంహారం

కృష్ణ లీలల్లో, అనేక ఆహ్లాదకరమైన అనుభవాలు మరియు ఆశ్చర్యకరమైన తత్వాలు చెప్పబడ్డాయి. వీటిల్లో ఒక అద్భుతమైన లీలే, కృష్ణుడు, ఒక కుమ్మరివాడు, అతని కుండకు మోక్షం ఇవ్వటం. దీని మూలం, ఇతిహాస, పురాణాల్లో కనపడనప్పటికీ, కొన్ని ముఖ్యమైన పూర్వాచార్య గ్రంథాల్లో చెప్పబడింది. మొదట ఈ సన్నివేశాన్ని చూద్దాం.

బృందావనంలో, ఒక సారి కృష్ణుడు ఎప్పటి లాగానే వెన్న దొంగలించి, యశోదమ్మ నుండి తప్పించుకుంటూ, ఆ సమయం లో ఒక కుమ్మరి వారి ఇంట్లోకి దూరాడు. అతని పేరు దధిపాండుడు, కృష్ణుడు తన ఇంటిలోకీ రావటం చేత సంతోషించాడు, కృష్ణుడు కూడా దాక్కునే చోటు వెతికాడు, ఒక పెద్ద కుండ చూసి దానిలోకి దూరాడు. ఆ కుమ్మరివాడికి ఎవరైనా వస్తే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పకూడదు అని ఆజ్ఞాపించాడు. అందుకు ఒప్పుకున్న కుమ్మరివాడు యధోదమ్మ “ఇక్కడికి కృష్ణుడు వచ్చాడా అని అడగగా?” “ఎవరు రాలేదు” అని బదులు ఇచ్చాడు.

అటుపిమ్మట, కృష్ణుడు బయటకు రావటానికి ప్రయత్నించగా. “నువ్వు బయటకు రావాలంటే, నాకు మోక్షం ఇవ్వాలి. దీనికి ఒప్పుకుంటేనే బయటకు వదులుతాను” అన్నాడు కుమ్మరి వాడు. కృష్ణుడు నటిస్తూ “నాకు మోక్షం అంటే ఏంటో తెలీదు, నేను చిన్న పిల్లవాడిని, కావాలంటే నీకు వెన్నను ఇస్తాను”. కుమ్మరి వాడు “నీ నిజమైన తత్వం తెలుసుకున్నాను, నాకు మోక్షం ఇవ్వాలి” అని అన్నాడు. కృష్ణుడు సంతోషంగా “సరే అనుగ్రహించాను!” అని పలుకగా. కుమ్మరివాడు ” నాకు మాత్రమే కాదు, నేను పెరుగు దాచుకునే ఈ కుండకు కూడా మోక్షం ఇవ్వాలి!” అనగా. కృష్ణుడు “నేను ఇది ఒప్పుకోను, నీవు లోభివి! నీకు మోక్షం ఇస్తాను అంటే అందరికీ మోక్షం అడుగుతున్నావే?” అనగా. కుమ్మరివాడు ” ఈ కుండ నాకు ఎంతో ఇష్టమైనది, కాబట్టి బయటకు రావాలంటే దీనికి మోక్షం ఇవ్వాల్సిందే” అని తేల్చి చెప్పాడు. చివరకు దేవదేవుడు ఒప్పుకుంటూ, “సరే మేము, మీ కుండకు మోక్షం ఇస్తున్నాం” అని చెప్పారు.

ఈ సంఘటనని తిరుక్కోలూర్ పెన్ పిళ్లై వార్తై లో కూడా వివరించారు, “ఇంగిళ్లై ఎన్ఱేనో దాధిపాండనై పోలె” (నేను ఏమైనా “ఇక్కడ లేడు అన్నానా” దాధిపాండుడి లాగా?). ఇక్కడ మాత్రమే కాక, ఆచార్య హృదయంలో కూడా అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అనుగ్రహిస్తూ, 228వ చూర్ణిక లో, వివిధ రకాల వస్తువులకు ఎలా స్వామి మోక్షం ఇచ్చారు అని వర్ణిస్తూ, వారు “ఇదైయార్ తయిర్ త్తాళి” (గోపాలకుడు, అతని పెరుగు దాచుకునే కుండ) అని చెప్పారు. వ్యాఖ్యానం అనుగ్రహిస్తూ మణవాళ మామునిగలళ్ కొంత వ్యత్యాసంగా చెప్పారు, వారి శ్రీవచనాలు “వెన్నై కళావు కాణాప్ పుక్కవిడత్తే తొడుప్పుణ్డు వన్దు తమ్మగత్తే పుగుప్పడలై త్తిరుగి వైత్తు మోక్షం తారావిడిల్ కట్టిక్కొడుప్పేన్ ఎన్ఱు మోక్షం పెఱ్ఱ దధిపాండర్” (వెన్న దొంగలించిన, తల్లి నుండి పరిగెడుతున్న కృష్ణుడు దధిపాండుడి ఇంట్లోకి దూరగా, ఆ కుమ్మరివాడు తలుపు గడియ వేశాడు మరియు “మోక్షం ఇస్తేనే గడియ తీస్తాను” అని చెప్పి మోక్షం పొందాడు) – మామునిగలళ్ వివరిస్తూ కుమ్మరి వాడు కృష్ణుడిని ఇంట్లో బంధించాడు, కుండలో కాదు అని చెప్పారు.

ఇది దాధిపాండుది అద్భుత వృత్తాంతం. మన దురదృష్టవశాతు దీని మూలం, ఇతిహాస పురాణాల్లో మనకు కనపడట్లేదు. కానీ మన పూర్వాచార్యులు కృప చేత, మనకు ఈ వృత్తాంతం కొంత మేరకు అందింది.

ఈ సంఘటన వెనుక ఉన్న సారాంశం:

  • భగవానుడు ఎంత సులభుడిగా ముందు నిలుచున్నా నిజమైన భక్తులు, భగవానుడి నిజమైన స్వరూప/స్వభావాలను, గుర్తిస్తారు.
  • గొప్ప భక్తులు, మోక్షాన్ని, భగవత్ నిత్య కైంకర్యం కోసం మాత్రమే కోరుకుంటారు.
  • కృష్ణుడు దధిపాండుడికి మోక్షం ఇవ్వటం మనకు అర్థం అవుతుంది కానీ కుండ ఒక జీవంలేని వస్తువు కదా, దానికి మోక్షం ఎలా కలిగింది? మణవాళ మామునిగళ్ దీనికి ఒక అందమైన వివరణ ఇచ్చారు వారి ఆచార్య హృదయ వ్యాఖ్యానంలో అందించారు – పేరు,స్వరూపం కలిగిన ప్రతి పదార్థాంలోన ఆత్మ ఉంటుంది. కుమ్మరివాడు బలవంత పెట్టటం కారణంగా కుండలోని ఆత్మకు మోక్షం కలిగింది. వివరణం : చాలా పెద్ద పాపం చేసిన ఆత్మలకు చెట్టు, మొక్క, రాయి, వస్త్రం రూపం పొందుతారు అని చెప్పబడింది.

మూలం : https://granthams.koyil.org/2023/09/07/krishna-leela-10-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment