శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
దేవతలు అందరూ సంతోషముగా కృష్ణుడు చేసిన అఘాసుర వధను కీర్తించాక, అది విన్న బ్రహ్మా కూడా చేరి, అంతటిని చూసి ఆశ్చర్యపోయాడు. భగవానుడికి విధేయుడు అయిన బ్రహ్మాకి తమో గుణం (అజ్ఞానం) వృద్ధి అయ్యి కృష్ణుడి పట్ల అసూయతో, “ఇంత చిన్న పిల్లాడికి ఇంత వైభవం ఎందుకు?” అని కృష్ణుడిని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించాడు.
కృష్ణుడు మరియు గోపాలకులు అందరూ చేరి మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయం అది. వారు తెచ్చిన దూడలు కొన్ని కనపడకుండా పోవటం గమనించారు. బ్రహ్మా అప్పటికే వాటిని దాచాడు. కృష్ణుడు వారిని భోజనం చెయ్యమని, తాను వెతికి తీసుకొస్తాను అని వెళ్ళగా, ఆ సమయంలో, బ్రహ్మా, బాలకులని కూడా తీసుకొని వెళ్లారు. అది అంతా తెలిసిన కృష్ణుడు, గోపాలకులు మరియు దూడలు రూపాలు తానే ధరించి, కొంత సమయం అడువులలో ఉంది తిరిగి ఊరిలోకి వెళ్ళిపోయాడు.
కృష్ణుడు, తానే దూడలు మరియు గోపాలకుల రూపంలో ఉండటం చేత, ఆవులు వాటి దూడలు మరియు తల్లితండ్రులు వారి పిల్లలనే చూశారు, వారికి ఇది అంతా తెలీకుండా ఆ రూపాలపైనే అలానే ప్రేమ చూపారు, కొంత కాలం తర్వాత ఇదంతా తన జ్ఞానం చేత గ్రహించిన బలరాముడు, ఎంతో సంతోషించాడు.
అదే సమయంలో సత్యలోకం నుండి గమనిస్తున్న బ్రహ్మా ఆశ్చర్య పోయాడు. తన వద్ద ఉన్న దూడలు గోపాలకులు కృష్ణుడికి ఆనందం కలిగించటం గమనించాడు. అప్పుడు వారు అందరూ విష్ణు రూపంలో కనిపించారు. తిరిగి సత్త్వ గుణం కలిగిన బ్రహ్మ ఎక్కడనుండి పరుగున వచ్చి స్వామి చరణాల పైన పడ్డాడు, అప్రద క్షమ ప్రార్థించి, భగవానుడిని కీర్తాయించాడు. గర్వం వీడిన బ్రహ్మాను క్షమించాడు. అలా బ్రహ్మా ఆ గోపాలులను మరియు దూడలను తిరిగి ఇవ్వగా, కృష్ణుడు తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అలా ఎంతో కృపతో బ్రహ్మా గర్వ భంగం చేశాడు.
ఈ సంఘటన సారాంశం:
- ఎంత గొప్ప పదవిలో ఉన్నవారైనా, గర్వం తలకు ఎక్కితే కింద పడాల్సిందే కావునా వినయం అలవర్చుకోవటం మంచిది.
- భగవానుడికి ప్రతి జీవాత్మతో పితా-పుత్ర సంబంధం ఉండటం చేత, ఒకవేళ ఆత్మ తప్పుచేసినా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆత్మ తప్పు తెలుసుకునేలా చేసి, ఆత్మను ఉద్ధరించి, స్వీకరిస్తాడు.
మూలం : https://granthams.koyil.org/2023/09/10/krishna-leela-12-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org