కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 13 – ధేనుకాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 12 – బ్రహ్మా గర్వ భంగం

కృష్ణుడు మరియు బలరాముడు తమ స్నేహితులతో అరణ్యంలో ఆనందంగా ఆటలాడుతూ ఉండేవారు. ఒకసారి ఆటలాడుతున్న సమయంలో, కృష్ణబలరాముల స్నేహితులైన గోపకుమారులు, తాళవనం (ఈతచెట్లతో నిండిన తోట) అనే స్థలంలో తీయని ఫలాలు చాలా ఉంటాయని, కానీ అక్కడ గాడిద రూపంలోనున్న ధేనుకాసురుడు భయపెడుతున్నాడని చెప్పారు. ఆ ధేనుకాసురుడు కూడా కంసుడు పంపిన రాక్షసుడే; కృష్ణుడు అక్కడికి వస్తాడని ఎదురు చూసి చంపాలని సిద్ధమై ఉన్నాడు.

ఇది తెలిసిన కృష్ణబలరాములు తాళవనానికి వెళ్లారు. బలరాముడు ఈతచెట్లను బలంగా ఊపగా, చాలా పండ్లు కిందపడాయి. ఆ శబ్దం విని ధేనుకాసురుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. బలరాముడు అతని వెనుక కాళ్లను పట్టుకుని బలంగా విసిరాడు. అతడు చెట్టుకు తగిలి కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. తరువాత మరికొంతమంది అసురులు అక్కడికి వచ్చి దాడి చేయగా, కృష్ణుడు మరియు బలరాముడు వారినీ సంహరించారు.

ఈ సంఘటనను ఆళ్వార్లు తమ పాసురాలలో కృష్ణుడే సంహరించాడని వివరించారు – పెరియాళ్వారు తన పెరియాళ్వారు తిరుమొళిలో: “ధేనుకన్ ఆవి సెగుత్తుప్ పనన్గని తాన ఎరిన్తిట్ట” (కృష్ణుడు ధేనుకాసురుడిని విసిరి తాళ చెట్లపై కొట్టి చంపాడు). ఆండాళ్ తన నాచ్చియార్ తిరుమొళిలో: “కాట్టై నాడిత్త తేనుగనుం కలిఱుం పుళ్లుం ఉడన్ మడియ వెట్టయ్యాడి వరువానై విరుందావనత్తే కండోమే” (అరణ్యంలోకి ధేనుకాసురుడు, కువలయాపీడం అనే ఏనుగు, బకాసురుడు – వీరిని వేటాడటానికి వెళ్ళిన కృష్ణుడిని బృందావనంలో మేము చూశాం). తిరుమళిశై ఆళ్వార్ తన తిరుచ్చన్దవిరుత్తమ్ 80 పాశురంలో: “వాశియాగి నేశమిన్ది వన్దెతిర్ న్ద దేనుకన్ నాశమాగి నాళులప్ప నన్మైశేర్ పనమ్ గనిక్కు వీశి మేల్ నిమిర్ న్ద తోళిన్ ఇల్లైయాక్కినాయ్ కళఱ్కు అశైయామవర్ క్కలాల్ అమరరాగల్ ఆగుమే” (గాడిద రూపంలో వచ్చిన ధేనుకాసురుణ్ని తాళపాకల మీద పడవేసి సంహరించిన శ్రీకృష్ణుని దివ్యచరణములవలనే విముక్తి లభిస్తుంది; దానికి వేరే మార్గం లేదు.) అని విపులంగా ధేనుకాసుర వధను వివరించారు.

ఈ సంఘటనలోని సారాంశం:
• భగవంతుణ్ణి నాశనం చేయాలన్న ప్రయత్నం ఎప్పడు వ్యర్థమవుతుంది.
• మనతో భగవంతుడు సహచరుడిగా ఉన్నప్పుడు, శుభాలన్నీ స్వయంగా కలుగుతాయి.

మూలం : https://granthams.koyil.org/2023/09/12/krishna-leela-13-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment