కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 15 – ప్రలంబాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 14 – కళింగ నర్తనం

WhatsApp Image 2023-09-04 at 10.02.22 AM

కృష్ణుడు మరియు బలరాముడు వారి స్నేహితులతో కలిసి బృందావనంలో ఆనందంగా ఆడుకుంటున్నారు. ఒక రోజు, ప్రలంబాసురుడు అనే రాక్షసుడు, గోపబాలుడు రూపంలో వారి మధ్యలో చేరాడు. అతడు ఎలా అయినా కృష్ణుణ్ణి చంపాలని ఆలోచించాడు. ఆయనను చూసిన బలరాముడు, అతనిని సంహరించాలనుకున్నాడు.

ఆ సమయంలో, వారు ఒక ఆట ఆడడం ప్రారంభించారు. ఆ ఆటలో నిబంధనల ప్రకారం, ఓడిపోయిన వారు గెలిచినవారిని మోయ్యాలి. కృష్ణుడు ఒక బృందానికి నాయకుడిగా, బలరాముడు మరొక బృందానికి నాయకుడిగా ఉన్నారు. ప్రలంబాసురుడు కృష్ణుడి బృందంలో చేరాడు. అప్పుడు కృష్ణుడి బృందం ఓడింది కాబట్టి, ఓడిపోయిన బృందంలో ఉన్న ప్రలంబాసురుడు, గెలిచిన బృంద నాయకుడు అయిన బలరాముడిని మోసే బాధ్యత వహించాడు. ప్రలంబాసురుడు బలరాముణ్ణి మోసుకుంటూ, వేగంగా పరుగెత్తి, చంపాలని యత్నించాడు. బలరాముడు అతని ఉద్దేశాన్ని గ్రహించి, తన బరువును పెంచుతూ పోయాడు. ప్రలంబాసురుడు ఆ భారాన్ని మోయలేకపోయాడు. ఆ భారీ బరువు అతన్ని అణిచివేస్తున్నంతలో, బలరాముడు అతని తలపై బలంగా కొట్టడంతో ప్రలంబాసురుడు చనిపోయాడు.

ఈ సంఘటనను ఆండాళ్ నాచ్చియార్ తమ ‘నాచ్చియార్ తిరుమొళి’లో “పిలంబన్ తన్నై పలదేవన్ వెన్ఱ” (ప్రలంబాసురుడు బలరాముడు చేతిలో ఓడిపోయాడు) అని అనుగ్రహిస్తూ చెప్పారు. అలాగే, పెరియాళ్వార్ పెరియాళ్వార్ తిరుమోజి’లో “ధేనుకన్ పిలన్బన్ కాలియన్ ఎన్నుమ్” (ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు, కాళింగ అని పిలువబడే వారు) అని పేర్కొన్నారు.

ఈ సంఘటనలో సారాంశం:

  • పెరియాళ్వార్ చెప్పిందేమిటంటే, బలరాముడు చేసిన లీలను కృష్ణుడు చేసినట్టు పేర్కొన్నారు, ఎందుకంటే వారిద్దరి మధ్య బంధం ఎంతో ఘాఢమైనది. అలాగే, శ్రీరామావతారంలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు, చెవులను కత్తితో తెంచినపుడు, దాన్ని శ్రీరాముడు చేసినట్టుగా చెప్పారు.
  • భగవంతుడు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆయనకంటే ముందు ఆయన భక్తులు ఆయన్ను రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ బలరాముడు కృష్ణుడి కోసం ఆ ప్రమాదాన్ని తొలగించాడు.

మూలం : https://granthams.koyil.org/2023/09/20/krishna-leela-15-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment