శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీకృష్ణుడు తన చిన్నవయసులో చేసిన లీలలో ఎంతో ఇష్టమైనది—ఆవులను మేపడం. నమ్మాళ్వార్ తన తిరువాయ్మొలిలో “తివత్తిలుం పసు నిరై మేప్పువత్తి” అని, పరమపదంలో ఉన్నదానికంటే గోవులను మేపడమే కృష్ణునికి ఎక్కువ ఇష్టమని చెబుతారు. తిరుమంగై ఆళ్వార్ కూడా తిరునెడుంతాండగంలో “కన్ మేయుత్తు ఇనిదుగన్ద కలాయ్” అంటూ చిన్ని కృష్ణుడికి పశువులను మేపుతూ పరవశించడాన్ని ఆస్వాదించారు.
పెరియాళ్వార్ తన ’పెరియాళ్వార్ తిరుమొళి’లో మూడు పదికాలలో “అంజన వన్ననై”, “సీలైకుదంబై”, “తళైగళుం”లో యశోదా మరియు గోపికల భావంలో, కృష్ణుడు పశువులను మేపడాన్ని గొప్పగా ఆస్వాదిస్తాన్నారు. మొదటిగా, యశోదై తల్లి భావంలో, చిన్న వయసులో ఉన్న కృష్ణుడు అడవిలో పశువులను మేపడానికి వెళ్లాటనేది దుఃఖంగా చెప్పడాన్ని చూపిస్తారు. తరువాత తల్లి యశోదా, కృష్ణుడు అడవిలోని ఆవులను మేపి తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఆనందంతో చూసే భావంలో చెబుతారు. తరువాత, గోపికలు కృష్ణుడు పశువుల వెనుక తిరిగి వస్తున్నప్పుడు ఆయనపై చూపే అపారమైన ప్రేమతో మాట్లాడతారు.
ఆండాళ్ నాచ్చియార్ కూడా తిరుప్పావైలో “అఱివొన్ఱు మిల్లాద ఆయ్ కులత్తు ఉన్దన్నై ప్పిరవి పెరున్దనై పుణ్ణియం యాముడై యోమ్” అంటూ, “మా అజ్ఞానమైన గోప కుల వంశాన నీవు జన్మించావు, అది మాకు గొప్ప పుణ్యం” అని అంటారు. ఆమె మూడు పాశురాలు-“కూడారై”, “కరవై” మరియు “శిత్తుం”,లో కృష్ణుణ్ణి గోపికలు (గోవిందా) పిలుస్తూ ఆయనకు ఉన్న పశుప్రేమను గుర్తు చేస్తారు.
నమ్మాళ్వార్ కూడా తిరువాయ్మొళిలో “మల్లిగై కమళ్ తెన్ఱల్” పదికంలో, గోపికల భావంలో అడవిలో ఆవులను మేపిన తరువాత తిరిగి వస్తున్న కృష్ణుణ్ణి ఆస్వాదిస్తారు.
ఈ విధంగా, ఆళ్వార్లు కృష్ణుని పశు సంరక్షణ లీలను విభిన్న రీతిలో ఆస్వాదించారు.
ఈ సంఘటనలోని సారాంశం:
- భగవంతుడు మనకు సహాయం చేసేందుకు వచ్చినపుడు మనం ఆయన్ని ఆపకపోతే ఆయన మనలను రక్షిస్తారు. ఇది ఆవులు మరియు దూడల విషయంలో స్పష్టం అవుతుంది. వారికి భగవంతుడు తమ రక్షకుడు అని తెలియకపోయినా, ఆయన్ను ఆపకుండా ఆయన సహాయం చేసేపుడు అడ్డుకోలేదు. అందుకే వారు ఆయన చేత రక్షింపబడ్డారు.
- సాధారణంగా, ఆవులు మరియు దూడలు సత్వగుణంలో ఉంటాయి (ప్రశాంతమైన స్వభావం). ఈ గుణం ఉన్నవారిని భగవంతుడు తప్పకుండా రక్షిస్తారు.
మూలం : https://granthams.koyil.org/2023/09/21/krishna-leela-16-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org