కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 5 – తృణావర్తాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి 

<< 4 – శకటాసుర వధ 

శ్రీ కృష్ణుడు, కూర్చునటం ఆరంభించిన రోజుల నుండి ఈ లీలను చూద్దాం.

గోకులంలో, ఒక్కసారి కృష్ణుడు నేల పై కూర్చున్నాడు. తృణావర్తాసురుడు అనే ఒక రాక్షసుడు కంసుడు పంపగా వచ్చాడు. కృష్ణుడిని సుడిగుండం లాగా మారి చంపాలి అని నిశ్చయించుకున్నాడు.

మొదట అతను ఒక్క పెద్ద తుఫానుని సృష్టించి, ధూళిని వ్యాపింప చేశాడు. శ్రీకృష్ణుడిని ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. గ్రామ వాసులు అందరి కళ్లల్లో ధూళి పడి మూసుకుపోవటం, ఆ రాక్షసుడు చేసిన శబ్దంతో అందరూ భయ భ్రాంతులు అయ్యారు. 

ఆ సమయంలో, తల్లి యశోదా, అక్కడ కృష్ణుడు కనిపించక మరియు ఏం జరుగుతుందో అర్థం కాక, అక్కడే కూర్చుని విలపించటం మొదలుపెట్టింది. మిగిలిన గోపికలు కూడా యశోదా దేవితో పాటు ఏడవసాగారు.

తృణావర్తాసురుడు, ఆకాశంలోకి ఎగిరి, కృష్ణుడిని చంపాలి అనుకున్నాడు. కానీ కృష్ణుడు బరువు పెరుగుతూ, రాక్షసుడు మోయటానికి దుర్భరమయ్యాడు. తద్ద్వారా, కృష్ణుడి బరువు మోయలేక, ఊపిరి ఆడక, పెద్ద శబ్దం చేస్తూ నెలకు ఒరగి, ప్రాణం విడిచాడు. అందరూ అది చూసి భయపడ్డారు. గోపికలు, కొందరు మరణించిన రాక్షసుడి దేహంపైన నవ్వుతూ కృష్ణుడు కూర్చునటం చూసి, అయినను ఎత్తుకుని యశోదా దేవి వద్దకు తీసుకుని వెళ్లారు.

ఈ లీలలోని ఆంతర్యం :

  • వచ్చిన శత్రువులు ఎంత శక్తివంతులు అయినా, భగవంతుడు, వారిని సంహరిస్తాడు.
  • ఆపద వచ్చిన ప్రతిసారి, భగవంతుడు తనని రక్షించకుంటాడు ఈ లోకాన్ని రక్షిస్తాడు, కనుక మనం అతనికి మాత్రమే శరణాగతి చెయ్యాలి.

మూలం : https://granthams.koyil.org/2023/08/26/krishna-leela-5-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్ 

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment