శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
గతంలో పేర్కొన్న రెండు శ్లోకాలను పఠించిన తర్వాత, జీయర్ కొండపైకి ఎక్కి, పేరారుళాళన్ దివ్య పాదాలను సేవించి, “మంగళం వేదసేవేధి మేధినీ గృహమేధినే వరదాయ దయాదామ్నే తీరోధారాయ మంగళం” (బ్రహ్మ యొక్క యాగభూమి నుండి కరుణాపూర్వకంగా ఆవిర్భవించిన దయాసాగరుడు, తనను ఆశ్రయించిన వారి కోరికలను తీర్చే పేరరుళాళన్ కు మంగళం) అని ప్రారంభించి మంగళాశాసనం నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థం, శ్రీ శఠారీలను అందించగా, వారు పేరరుళాళన్ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి అందుకున్నారు. ఆలయంలో కొందరు వారిని మఠంలో ఉండమని ప్రార్థిస్తారు. ఈ క్రింది శ్లోకములో వివరించబడింది:
కతిచిత్తినాని కరిశైలవాసినః కమలాసకస్యనయనాతిదిర్భవన్
నిజపాద పంకజ రజోభిషేచనైర్ నిఖిలాశ్రితాన్ విమలాయన్ను వాససః
(మణవాళ మాముణులు శ్రియః పతి అయిన ఆ పేరారుళాళన్ దివ్య కృపా దృష్టికి పాత్రులై కొంత కాలం హస్తిగిరి (కాంచిపురం) లో ఉన్నారు; అక్కడ ఉండి తమ దివ్య పాద పద్మాల స్పర్షతో ఆశ్రితులను శుద్ధస్వభావులుగా మార్చివేశారు. అనంతరం వైకాసి విశాఖ (నమ్మాళ్వార్ నక్షత్రం) ఆగమనంతో ఆలయంలో బ్రహ్మోత్సవం (ప్రధాన పండుగ) ప్రారంభమైయ్యాయి. ఉత్సవం మూడవ రోజున, వారు ఈ శ్లోకాన్ని పఠించారు.
ఆరూడః పతకేంద్రమస్య కరయోరంగ్రి త్వయీమర్ ప్పయన్
దివ్యైరంభరభూషణైర్దినకృతో దీప్తిం దివాదీపయన్
ముగ్దేందు స్మితరోచిషా మధురయన్ ముగ్ధాతపత్రశ్రియం
విశ్వం పశ్యతి చక్షుషా విగసతావీధీవిహారీహరిః
(దేవ పెరుమాళ్ పెరియ తిరువడి (గరుడ) పై ఆసీనులై ఉన్నాడు. దివ్య పట్టు పీతాంబరాలను ధరించి , దివ్యాభరణాలంకృతుడై, గరుడ హస్థాలపైన తమ తిరు పాదాలను ఉంచాడు. దివ్య ముత్యాల గొడుగు క్రింద తమ మందహాస దివ్య తేజంతో సూర్యుని ప్రకాశాన్ని కూడా నిరర్థకం చేస్తూ దివ్య తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తూ తన దివ్య నేత్రాలతో అందరిపై తన దయను కురిపించాడు). పెరుమాళ్ళను జీయర్ సేవించుకొని గంగై కొండాన్ మంటపానికి వెళ్ళారు.
జీయరుని సేవించిన ఎఱుంబియప్పా
ఎఱుంబి అప్పా కొందరు శ్రీ వైష్ణవులతో కలిసి బ్రహ్మోత్సవాలలో పెరుమాళ్ను సేవించుకోడానికి వచ్చారు. అనుకోకుండా ఎఱుంబి అప్పా జీయరుని చూసి వారికి సాష్టాంగ నమస్కారం చేసారు. ఈ క్రింది శ్లోకములో వివరించబడింది..
ఆరుయపదకవృషపమాయాంతం వరదం ఆధారాత్ ద్రష్టుం
గత్వా తదగ్రభూమిం నద్రాక్షం తత్ర దేశికం ద్రుష్ట్వా
(గరుడను అధిరోహించిన దేవప్పెరుమాళ్ను సేవించుటకు వెళ్లి, అక్కడ జీయరుని దర్శించుకొని మైమరిచిపోయి వారికి ఇంకేమీ తోచలేదు (అక్కడ జీయర్ దర్శనము అవుతుందని వారు ఊహించలేదు), జీయర్ దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ప్రగాఢమైన భక్తితో వారి దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉండిపోయారు. “చిరేణ సంజ్ఞానం ప్రతిలభ్యచైవ విచింత్యామాస విశాలనేత్రః” (కొంత కాలం తర్వాత, (సీతాపిరాట్టి) స్పృహను తిరిగి పొంది, వికసించిన తన దివ్య నేత్రాలతో చూడసాగింది అని శ్రీ రామాయణంలో చెప్పబడింది. ఎఱుంబి అప్పా కూడా దాదాపు 3-4 నాళిగై (ఇంచుమించు 72 – 96 గడియలు) స్పృహలేని స్థితిలో ఉండి, తిరువాయ్మొళి పాశురం 6-5-2 లో “కుమిఱుమోశై విళవొలి తొలైవిల్లిమంగళం కొండు పుక్కు” (ఉత్సవాల కారణంగా మహా సందడితో ఉన్న తొలైవిల్లిమంగళముకి పరాంకుశ నాయకిని (నాయికా భావంలో నమ్మాళ్వారు) తీసుకొని వెళ్ళుట) అని చెప్పినట్లు, తిరువాయ్మొళి పాశురం 6-5-5లో “ఇళైకొళ్ సోదిచ్ చెందామరై కణ్పిరాన్ ఇరుందమై కాట్టినీర్” (దివ్యాభరణాలు ధరించి దివ్య తేజస్సుతో వెలుతున్నఆ కమల నేత్ర భగవానుడు ఆసీనులై ఉన్న విధమును మీరు చూపారు) అని చెప్పినట్లు, స్పృహలోకి వచ్చి, బ్రహ్మోత్సవాల సమయం అని గ్రహించి, మళ్లీ జీయరుని సేవించారు. అనంతరం, జీయర్ కూడా ఈ క్రింది శ్లోకంలో వివరించబడినట్లు గరుడారూఢుడైన పెరుమాళ్ను సేవించారు.
సూపర్ణపృష్టరమారూడశ్శయామః పీతాంబరోహరిః
కాంచనస్య గిరేశ్శృంగే సదతితేతోయ తోయతా
(నీల మేఘ వర్ణంతో, పచ్చని పట్టు పీతాంబరాలు ధరించి, గరుడపైన ఆసీనుడై, సువర్ణ మలపైన మెరుపులా మెరుస్తున్న దేవ పెరుమాళ్). గరుడారూడుడైన పెరుమాళ్ళను స్తుతిస్తూ జీయర్ మరొక పాశురాన్ని పఠించారు:
తరళముత్తు మణి తవళ నఱ్పవళం అరుణరత్న వగై సాత్తియే
శంగు చక్కరముం అంగైయిల్ తిగళ మంగై పాగన్ అరన్ ఏత్తవే
నరరుమొత్తు అమరర్ తిరళుం ఏత్తుం నరవాగనన్ వరుణన్ ఇందిరన్
కడువు నాన్మఱై కొళ్ మునివర్ వానవర్ గుణాలమిట్టు నడమాడవే
వరైగళిర్ పెరియ వడగిరిక్కుమిసై మరదగక్కువడు పోలవే
వరదర్ కచ్చినగర్ వరు తని త్తెరుళిల్ వడగలైక్కు అళగు పొళియవే
అరవుదిత్త మణి మగుడం ఉఱ్ఱవొరు అణి పిణక్కుడన్ మిళఱ్ఱవే
కనగం ఒత్తదు ఒరు వడివం ఒత్తివరు గరుడనిల్ బవని వరువరే
(దివ్యాభరణాలు ధరించి, గరుడారూడుడై కాంచీపురం తిరుమాడవిఢులలో ఊరేగింపుగా వెళుతున్న దేవ పెరుమాళ్ళ సౌందర్యాన్ని మాముణులు వర్ణిస్తున్నారు. ముత్యాలు పగడాల దండలతో అలంకృతుడై, దివ్య శంఖ చక్రాలను ధరించి ఉన్నాడు. అర్థనరీశ్వరుడైన శివుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలైన అనేక దేవలోక వాసులతో పాటు ఈ భూలోక వాసులచే కూడా స్తుతింపబడ్డాడు. సంస్కృత నిపుణులు కూడా అతడి సౌందర్యమును చూచి మైమరచిపోయి స్తుతించేలా పెరుమాళ్ళు తమను తాను అలంకరించుకున్నారని మాముణులు అంటున్నారు. [తొండరడిప్పొడి ఆళ్వార్ తమ తిరుమాలై ప్రబంధంలో – ఎమ్పెరుమాన్ దక్షిణం వైపు ముఖం చేసి ఉత్తరం వైపు తమ వీపు చూస్తున్నారని తెలిపారు. పరమకారుణిక వ్యాఖ్యాత అయిన పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ పాశురాన్ని ‘పెరుమాళ్ళ ముందు భాగము కంటే వెన్ను (వీపు) భాగము పరమ సుందరమైనదని, కఠినమైన సమస్కృతంలో నిష్ణాతులైన ఉత్తరాది ప్రజలను ఆకర్షించేందుకు తమ వెన్నును వారికి చూపుతున్నానన్నారు’ అని వివరించారు. మిగిలిన ఉత్సవాలను వీక్షించేందుకు జీయర్ అక్కడే కొంత కాలము ఉన్నారు.
మూలము: https://granthams.koyil.org/2021/09/21/yathindhra-pravana-prabhavam-65-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org