శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పెరియ వాచ్చాన్ పిళ్ళై వారి మహిమ
నంపిళ్ళై శ్రీ వైకుంఠానికి అధిరోహించిన తర్వాత, పెరియ వాచ్చాన్ పిళ్ళై దర్శన (శ్రీవైష్ణవ సిద్ధాంతం) కార్య భారాన్ని చేపట్టి నంపిళ్ళై శిష్యులందరినీ చేరదీశారు. నడువిల్ తిరువీధి పిళ్ళై పెరియ వాచ్చాన్ పిళ్ళై వారిని ఇలా అడిగాడు, “మీరు గురు పరమపర మరియు ద్వయ మంత్రముపైన ఉపన్యాసాలు చేసిన వారికి మరియు ఉపన్యాసం విన్న వారికి తేడా లేకుండా ఉపన్యాసం ఇస్తున్నారు. పరమసాత్వికులైన శ్రీ వైష్ణవులు మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తున్నారని మీరు అనుకుంటున్నారు?”. దానికి పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు జవాబు ఇలా ఇచ్చారు. “అడియేన్ అహంకారి కాబట్టి, అడియేన్ అభిప్రాయంలో శ్రీ వైష్ణవ సిద్ధాంతం ఉందని భావిస్తున్నాను. ఇది ఈశ్వరుడు ప్రసాదించిన జన్మ కాబట్టి, అడియేన్ శ్రీ వైష్ణవుడిగా భావిస్తాను. అడియేన్ ‘వీళ్ళందరి మనోభావన ఎలా ఉంది అని యోచించినచో, వీళ్ళందరూ అడియేన్ని అనుసరిస్తున్నారు, కాబట్టి వారి అభిప్రాయంలో కూడా శ్రీ వైష్ణవత్వం ఉందని అడియేన్ భావిస్తున్నాడు. కాబట్టి మూడు అభిప్రాయాలలో, మూడు తంతువులతో కూడిన శ్రీ వైష్ణవత్వము అడియేన్ లో ఉందని భావిస్తాను”. వారు ఈ మూడు అభిప్రాయాలతో శ్రీ వైష్ణవత్వము ఉందని తమ సొంత ప్రశంస చేయకుండా వారి గొప్పతనాన్ని చాటుకున్నారు.
వారి శిష్యులు ఒకానొక రోజు “మనం భగవానుని లీలలో భాగమా లేక ఆతడి కరుణకు పాత్రులమా?” అని అడిగారు. అతను ప్రతిస్పందిస్తూ, “అహంతో ఎటువంటి సంబంధం లేని నిత్యులు మరియు ముక్తులు భగవానుని మాధుర్యానికి పాత్రులు. అహంకార మమకారములతో కూడిన సంసారులు ఆతడి లీలకి పాత్రులు. మన ఆచార్యుల సహాయంతో భగవానుని కరుణ ద్వారా మన అహంకార మమకారములను తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్న మనం కూడా ఆతడి కరుణకు పాత్రులమే. ఆ విధంగా, సర్వేశ్వరుడు తమ వాత్సల్యము ద్వారా సమస్థ చేతనులను వారి అహంకారము మరియు స్వాధీన స్వభావాన్ని తొలగించి వారిని తన కైంకర్యాల కోసం ఉపయోగించుకుంటాడు.
పెరియ వాచ్చాన్ పిళ్ళై శ్రీ వైష్ణవ గోష్ఠిలో కొంత మంది వారిని ఇలా ప్రశ్నించారు “మేము ఆశ్రయం పొందే కొన్ని మాటలు మీరు కృపతో చెప్పండి” అని అడిగారు. పిళ్లై ఇలా అన్నారు, “ఈ లోకము భ్రమికులతో నిండి ఉండి, నిత్యము భ్రమలో ఉండేవారితో, భ్రమింపజేయునది, స్పష్టం చేసేవారు, స్పష్టత పొందే వారు మరియు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండేవారితో ఈ సంసారము నిండి ఇంది. ఇక్కడ, భ్రాంతిలో ఉన్న వ్యక్తి జీవాత్మ (చేతనుడు); ఆ చేతనుడిని భ్రమింపజేసేది అచిత్ (ప్రకృతి); ఎప్పుడూ భ్రాంతిలో ఉండే వాళ్ళు సంసారులు; స్పష్టం చేసే వారు ఆచార్యుడు; స్పష్టత పొందేవాడు చేతనుడు, ఎల్ల వేళలా స్పష్టతతో ఉండేవాడు ఈశ్వరుడు. అందువల్ల, ఆచార్యుల ఉపన్యాసం ద్వారా స్పష్టత పొందేవాడు (1) దిగ్భ్రాంతికి గురయ్యే స్వయమును, (2) భ్రాంతికి కారణమైన ప్రకృతిని (3) ఎల్లవేళలా భ్రాంతిలో ఉండే సంసారులను ఆశ్రయించుటను తోసివేసి, స్పష్టతను అనుగ్రహించే ఆచార్యుడిని, అనునిత్యము స్పష్టంతో నిండి ఉండే ఈశ్వరుడిని ఆశ్రయించాలి. ఇది జీవాత్మ యొక్క ప్రాథమిక స్వరూపమని అర్థం చేసుకోవాలి.
పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు పెరియాళ్వార్ తిరుమొళితో ప్రారంభించి మొత్తం నాలాయిర దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని రచించి ప్రపంచాన్ని ఉద్ధరించారు. ఇది గుర్తు చేసుకుంటూ, జీయర్ (మణవాళ ముణులు) తమ ఉపదేశ రత్నమాలలో “పెరియ వాచ్చాన్ పిళ్ళై పిన్బుళ్ళవైక్కుం తెరియ వియాక్కిగైగళ్ సెయ్వాల్ అరియ అరుళిచ్చెయఱ్పొరుళై ఆరియర్గట్కు ఇప్పోదు అరుళిచ్చెయలాయ్ త్తఱిందు” అని అనుగ్రహించారు. (ప్రీతితో వ్యాఖ్యాన చక్రవర్తిగా పిలువబడే పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు, నంపిళ్ళై ప్రియ శిష్యులు, అందరూ ఆళ్వార్ల దివ్య ప్రబంధాల పాసురార్థములను తెలుసుకోవాలని దాదాపు 3000 పాశురాలను వ్యాఖ్యానములు వ్రాశారు), పెరియ వాచ్చన్ పిళ్ళై అరులి చ్చెయల్ కి కొన్ని అరుదైన వ్యాఖ్యానాలను రచించారు). తరువాత, వారు దయతో రహస్య త్రయ వివరణం, తత్వత్రయ నిర్ణయం మొదలైన అనేక ఇతర రచనలను కూడా చేశారు.
ఒక రోజు తమ శిష్యులలో ఒకరైన వాదికేసరి, వారు తమ గృహస్థాశ్రమంలో ఉన్న సమయంలో, శాస్త్రాలను విశ్లేషిస్తున్న కొంత మందిని మీరేమి అనుసంధానము చేస్తున్నారని అడిగారు. అతను చదువు రాని వారని తెలిసి, “మేము ముసలకిసలయం చదువుతున్నాము” అని హేళనగా చెప్పారు. అటువంటిది ఒకటి ఉందో లేదో తెలియక, అతను పెరియ వాచ్చన్ పిళ్ళై వద్ద తెలుసుకుందామని వెళతారు. పెరియ వచ్చన్ పిళ్ళై వారు జరిగినది విని నవ్వి, తన చదువురాని తనాన్ని వారు వెక్కిరిస్తున్నారని చెప్పారు. వాదికేసరి సిగ్గుపడి, పెరియ వాచ్చన్ పిళ్ళై ముందు సాష్టాంగము చేసి, “మీరు నన్ను విద్యావంతునిగా మార్చాలి, జ్ఞాన నిపుణుడిని చేయాలి” అని ప్రార్థించారు. పెరియ వాచ్చన్ పిళ్ళై వారు అంగీకరించి, వాదికేసరిని శాస్త్రములో నిపుణుడు అయ్యే విధంగా అతనికి బోధించారు. వాదికేసరి వారు సంస్కృతంలో ముసలకిసలయం అనే పేరుతో ఒక ఇతిహాసం రాసి, తనను ఎగతాళి చేసిన ఇద్దరు శ్రీ వైష్ణవులకు అందించి, చదవమంటారు. వాళ్ళు మాట మాట్లాడకుండా సిగ్గుతో తల వంచుకుంటారు. ఆ తరువాత వాదికేసరి వారు సంసార నిర్లిప్తత చెంది, సన్యాసాశ్రమ స్వీకారము చేసి, అనేక చర్చలలో భగవానుని పరత్వాన్ని చాటుతూ ఎంతో మంది జనులపై గెలుపు పొంది, వాదికేసరి అళగియ మాణవాళ జీయర్ అనే బిరుదును సంపాదించెను. వారు తిరువాయ్మొళి యొక్క మునుపటి వ్యాఖ్యానాలను పరిశీలించి, వాటి సూక్ష్మమైన అర్థాలను గ్రహించి, అందరికీ సులువుగా అర్థమైయ్యేలా తిరువాయ్మొళికి పన్నీరాయిరప్పడి (పన్నెండు వేల పడి, ఒక పడి గద్యం ముప్పై రెండు అక్షరాలతో రూపొందించబడినది) వ్యాఖ్యానాన్ని సంకలనం చేశారు. జీయర్ ఉపదేశ రత్త మల లోని 45 వ శ్లోకంలో “అన్బోడు అళగియ మణవాలచ్చీయర్ ……ఏదమిల్ పన్నీరాయిరం ” (అళగియ మణవాళ చ్చీయర్ ఎంతో ప్రీతితో దోషరహితంగా 12000 పడి సంకలనం చేసారు) వ్రాసారు. తర్వాత, వారు దీప ప్రకాశ శతం, తత్వ నిరూపణం మొదలైన ఇతర రచనల సంకలనం చేశారు.
పెరియ వాచ్చాన్ పిళ్ళైల దివ్య తిరునక్షత్రము రోహిణి, తమిళ ఆవణి మాసము (సింహ మాసము). వారి తనియన్
శ్రీమద్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే
యత్కటాక్షైక లక్ష్యాణాం సులభః శ్రీధరస్సదా
యామునర్ల పుత్రులైన శ్రీమాన్ కృష్ణర్ [పెరియ వాచ్చాన్ పిళ్ళై] కు నేను నమస్కరిస్తున్నాను, వారి దివ్య చూపు మనపై పడితే సర్వేశ్వరుడిని అతి సులభంగా చేరుకోగలమనన్న నిజాన్ని గ్రహించగలుగుతాము.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/25/yathindhra-pravana-prabhavam-9-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org