యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 68

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 67

జీయర్ ఈ పాశురమును పఠించారు

తిరుమగళ్ మరువుం ఇరుపదమ్మలరుం ముళందాళ్గళుం కుఱంగుం తాంగు
చెక్కర్ అమ్మాముగిల్ పోల త్తిరువరై చ్చెంబొనంబరముం
అరుమైశేర్ శీరావుం అయనై త్తందదోర్ ఉందియుం అముదమార్ ఉదరబంధనుం
అలర్మేల్ మంగై ఉఱై తిరుమార్వముం ఆరముం పదక్క  నన్నిరైయుం
పెరువరై అనైయ బుయం ఒరు నాంగుం పిఱంగడలాళియుం శంగుం
పెఱు తివం ఎన్ఱు క్కాట్టియ కరముం పిడిత్తదోర్ మరుంగినిఱ్కరముం
ఒరుమది ఎనవే శోధి శేర్ ముగముం ఉయర్ తిరువేంగడత్తు ఉఱైయుం
ఒప్పిలా అప్పన్ కరుణై శేర్ విళియుం ఎన్నుళెలాం నిఱైందు నిన్ఱనవే

(శ్రీ మహాలక్ష్మి నిరంతరం ధ్యానించే, పుష్పమువలె నున్న మృదువువైన వారి దివ్య పాదాలు; దివ్యమైన మోకాళ్ళు; దివ్య తొడలు; వారి పట్టు పీతాంబరానికి ఆసరానిచ్చే మేఘ వర్ణపు వారి దివ్య నడుము, బ్రహ్మను పుట్టించిన వారి దివ్య నాభి; అమృతం వంటి వారి నడుముపై ఉన్న దివ్య రేఖలు [కృష్ణుడిని యశోద రోలుకి కట్టినప్పుడి వాతలు]; అలర్మేల్ మంగ తాయార్ (శ్రీమహాలక్ష్మి) నిత్య నివాసముండే వారి దివ్య వక్ష స్థలం; వారు ధరించిన దివ్య ఆభరణాలు, పతకాలు, మేలిమి బంగారపు దండలు, పద్ధతిగా అమర్చబడి ఉన్నాయి; ఎత్తైన పర్వతాల వంటి నాలుగు భుజాలు; మెరిసే దివ్య శంఖ చక్రాలు; మనం పొందాల్సిన పరమపదాన్ని సూచించే వారి దివ్య హస్తం; దివ్య తేజస్సుతో ప్రకాశించే చంద్రుని వంటి వారి దివ్య శ్రీ ముఖము; దేనితో పోల్చలేని తిరుమలలో కొలువై ఉన్న ఆ పెరుమాళ్ళ కృప నిత్యం స్రవించే వారి దివ్య నేత్రాలు – వారి దివ్య ముఖవైఖరి నా మనస్సులో స్థిరమై ఉంది). జీయర్ పైన పాశురంలో పేర్కొన్నట్లు, దివ్య పాదాల నుండి కిరీటం పర్యంతం తిరు వేంకటేశ్వరుని దివ్య స్వరూపాన్ని ఆస్వాదించారు. వారు వివిధ నాళాయిర దివ్య ప్రబంధ పాశురాలను స్మరించుకుంటూ, శ్రీ ముఖం నుండి పాదాల వరకు తిరువెంకటేశ్వరుని స్వరూపాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. అవి, ‘అలంగల్ తుళబ ముడి’ (తులసి మాలతో అలంకరించబడిన దివ్య కిరీటం), ‘తిరుత్తియ కోరంబం’ (నుదుటిపైన అలంకరించబడిన దివ్య చిహ్నం), ‘శుఱ్ఱుం ఒళివట్టం శూళ్ందు శోది పరంద కోళిళై వాన్ ముగం’ (దివ్య తేజంతో ప్రకాశించే వారి దివ్య శ్రీముఖం), ‘తన్ముగత్తు చుట్టి’ (ఆ శ్రీ ముఖం నుదిటిపై అలంకృతమై ఉన్న దివ్యాభరణం), నుదుటిపైన అలంకరించి ఉన్న దివ్య తిరునామం (ఉర్ధ్వ పుండ్రం), కోల నీళ్కొడి మూక్కు (తీగలా, పొడవుగా ఉండే అందమైన ముక్కు), ‘తామరై క్కట్కనివాయ్’ (కమలం లాంటిది, మధురమైన దివ్య నోరు), వారి దివ్య కంఠాన్ని చుట్టి ఉన్న దివ్య ఆభరణం ‘వార్కాదిలే శాత్తిన ఇలగు మకర కుండలం’ (అందమైన చెవులపై ఉన్న దివ్య మత్స్య కుండలాలు), ‘ఉలగం ఉండ పెరువాయా’ లో చెప్పినట్లు సమస్థ లోకాలను మ్రింగిన వారి దివ్య కంఠం, ఆ కంఠాన్ని చుట్టి ఉన్న దివ్య కంఠాభరణం, అలమేలుమంగ నిత్యం వసించే వారి దివ్య వక్ష స్థలం, ‘పవళవాయ్ పూమగళుం (భూదేవి), పన్మణి పూణారముం (అనేక దివ్య రకాల రత్నాలతో చేసిన దివ్యాభరణాలు), దివ్య యజ్ఞోపవీతం, అందమైన దివ్య భూజాలు, ఆ దివ్య భుజాలపైన అలంకరించి ఉన్న సువాసన భరితమైన దివ్య తులసి మాలలు, కుడివైపున మెలిక తిరిగి ఉన్నదివ్య శంఖాన్ని పట్టుకొని ఉన్న వారి దివ్య హస్తం, ‘ఉయ్య ఉలగు పడైత్తుండ మణివయిఱు’ (లోక కల్యాణార్థం సమస్థ లోకాలను మ్రింగి సురక్షితంగా ఉంచిన వారి దివ్య కడుపు) అని వర్ణించబడిన వారి దివ్య ఉదరం, వారి దివ్య ఉదరంపై ఉన్న దివ్య ​​గుర్తులు, ‘తిరు ఉదర ​​బంధం’ (మాతా యశోద తాడుతో రోలుకి కట్టినప్పడి గుర్తులు, ఆపై నడుము ఆభరణం, బంగారు వడ్డానం, చిన్న చిన్న గంటల నడికట్టు, నడుముపై పచ్చని దివ్య పీతాంబరం, పుష్పాల వంటి కోమలమైన వారి దివ్య పాదాలు, వాటిపై మ్రోగే అందెలు. ఈ విధంగా ఎంబెరుమానుని దివ్య శ్రీ ముఖం నుండి పాదాల వరకు ఆ తిరువెంకటేశ్వరుని దివ్య దర్శనాన్ని ఆస్వాదించిన తరువాత, తిరుప్పల్లాండు పఠించి, మంగళాశాసనం చేశారు. ఇంకా, తనివితీరక వారు ఈ శ్లోకాన్ని పఠించారు.

మంగళం మానుషే లోక వైకుంఠం అతి తిష్టతే
శేషశైల నివాసాయ శ్రీనివాసాయ మంగళం

(మానవ లోకంలో శ్రీవైకుంఠం అనబడే తిరుమలలో కొలువై ఉన్న కరుణామూర్తి, తిరువెంకటేశ్వరుడికి శుభం జరగాలి). ‘అడిక్కీళ్ అమర్ందు పుగుందు అడియీర్ వాళ్మిన్’ (ఎమ్పెరుమానుని దివ్య పాదాలను ఆశ్రయించండి – తిరువాయ్మొళి నూఱ్ఱందాది పాశురం 60) లో పేర్కొన్న విధంగా అందరికీ ఆశ్రయమిచ్చే తిరువెంకటేశ్వరుని పాదాలను వారు చూపారు. ఇప్పటికీ కూడా ఈ క్రింది శ్లోకాన్ని వారి భక్తులు పఠిస్తారు.

సౌమ్యోపయంతృమునినా మమదర్శితౌతే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

(ఆచార్య మణవాళ మాముణులు సూచన మేరకు శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదాల యందు శరణు పొందుతున్నాను). పెరుమాళ్ళు కూడా, ‘మలైమేల్ తాన్ నిన్ఱు మనత్తుల్ ఇరుందాన్’ (కొండపైన కొలువై ఉండి, దివ్య మనస్సులో ఉన్నాడు) లో చెప్పబడినట్లుగానే, మణవాళ మాముణులను పొంది, “శ్రీమత్ సుందరజామాతృ మునిమానస వాసినే” (అళగియ మణవాళ మాముణుల దివ్య మనస్సులో స్థిరమై ఉండేవాడు) అని చెప్పినట్లు మాముణుల దివ్య మనస్సుని తమ నివాసంగా ఏర్పరచుకున్నారు. పెరుమాళ్ళ సాటిలేని వాత్సల్య గుణాలకు ఓడిపోయి, ఆ గుణాలలో లీనమయ్యారు. ద్వయ మహామంత్ర రెండవ పంక్తిలో పేర్కొన్న విధంగా వారు సంపూర్ణ కైంకర్యాన్ని ప్రార్థిస్తున్నారు. వారికి తీర్థం, శ్రీశఠారి (పెరుమాళ్ళ దివ్య పాదాలు) సమర్పణ జరిగెను. ‘గతిచనధివసాని ధామ్ని తస్మిన్ కమలవిలోచనమేనం ఈక్షమాణ’ (ఈ కమల నయన ఎమ్పెరుమానుని సేవిస్తూ, ఆ ప్రదేశంలో కొలువై ఉన్న) పేర్కొన్న విధంగా వారు కొంత కాలం అక్కడే ఉన్నారు. ఆ ప్రదేశమంతా నిత్యసూరుల శిఖరాలు అని అంటూ, అక్కడ నివాసముంటున్న వారిపై తన కరుణను కురిపించారు. అక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొని పెరుమాళ్ళను సేవించారు. వారు అక్కడి నుండి బయలుదేరబోతున్నప్పుడు, స్థానికులు “జీయర్ ఎమ్పెరుమాన్ పట్ల భక్తి ఉన్న వారిని నియమించాలి” అని విన్నపించారు. జీయర్ ఆ కార్యానికై ఎమ్పెరుమానార్ జీయరుని నియమించారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/24/yathindhra-pravana-prabhavam-68-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment