యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 97

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 96

ఇలా జీయర్ బలహీన స్థితిలో ఉండగా, అదే సమయంలో మేల్నాట్టు త్తోళప్పర్, వారి అన్నగారు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ పెరుమాళ్ళను సేవించుకోడానికి శ్రీరంగానికి వేంచేశారు. భట్టర్పిరన్ జీయర్ [మాముణుల అష్ట దిగ్గజులలో ఒకరు] వీరిరువురిని తెన్మాడ వీధి (ప్రస్తుత తెఱ్కు ఉత్తర విధి) లో కలుసుకుని, “మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళుతున్నావు?” అని ప్రశ్నించారు. వారిరువురు వినయంతో, జీయర్ ఎదుట సాష్టాంగము చేసి, పెరుమాళ్ళ దర్శనం పొందాలనే వారి కోరిక గురించి తెలియజేసారు. జీయర్ వారితో “మీరు జ్ఞానం, భక్తి, సత్ విషయ ఆసక్తి ఉన్నవారిగా కనిపించుచున్నారు. రామానుజుల పునరవతారమైన మా పెరియ జీయర్ను మీరు తప్పక సేవించాలి” అని అన్నారు. వెంటనే అతని ఆహ్వానాన్ని స్వీకరించి, అతనితో కలిసి జీయర్ మఠానికి వెళ్లారు. “మణవాళ యోగి తంజమాం మలర్ త్తాళిణై కాట్టి” (మణవాళ మాముణుల దివ్య పాద పద్మాలను శరణుగా చూపుతూ) అనే వాక్యములో చెప్పబడినట్లుగా, వారు పెరియ జీయర్ల దివ్య చరణాలను సేవించారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ [ఇద్దరిలో పెద్దవారు] ఈ పాశురం పఠించారు.

పోద చ్చివందు పరిమళం వింజుం పుదుక్కణిత్త
శీద క్కమలత్తై నీరేఱవోట్టి చ్చిఱందడియేన్
ఏదత్తై మాఱ్ఱుం మణవాళ యోగి ఇనిమై తరుం
పాద క్కమలంగళ్ కండేనేనక్కు ప్పయం ఇల్లైయే

(నా దోషాలను తొలగించగలిగే ఎర్రని, పుష్పము వంటి కోమలమైన, నిత్య తాజాదనంతో నిండిన చల్లని మణవాళ మాముణుల దివ్య పాద పద్మాలను నేను దర్శించుకున్నాను, ఇక నాకు భయం లేదు.) వాళ్ళు జీయర్ దివ్య పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. వారు ఊహించినట్లే జీయర్ తమ దివ్య నేత్రాలతో వారిని చూసారు. రామానుజుల దివ్య మనస్సులో నిత్యం ఉండే తిరునారాయణపురమును వారు గుర్తు చేసుకున్నారు. వారు తన చివరి రోజుల్లో రామానుజులు స్వరపరిచిన శ్లోకాన్ని స్మరించుకున్నారు.

గచ్చన్ పదం పరమువాచ వచాంసి యాని రామానుజార్య ఇహతేషు చతుర్థసిద్దాం
శ్రీయాదవాద్రి వసతిం సతతం భజంత స్సంతో భవంతి మమసందతి మూలనాథః

తిరునారాయణపురంలో నిత్యం నివసించే వారు మహానుభావులని, శరణాగతుల వంశానికి అధిపతి అయిన ఎంబెరుమానార్లు, తాము దివ్య శ్రీవైకుంఠాన్ని అధిరోహించే సమయంలో అనుగ్రహించిన ఆరు వార్తలలో నాల్గవది). జీయర్ “తిరునారాయణపురంలో నిత్యం నివసించే వారు, మన శిష్యులలో ఎవరైన ఉన్నారా?” అని జీయర్ అడిగారు. తోళప్పర్ (ఇద్దరు సోదరులలో చిన్నవాడు), “అడియేన్ ఈ కైంకర్యాన్ని [తిరువారాయణపురంలో నివాసం] కోరుకుంటున్నాను” అని జీయర్ అనుమతిని కోరారు. ఇది విని జీయర్ సంతోషించి, “ఎంబెరుమానార్లకు, మాకు నచ్చేలా తిరునారాయపురంలో ఉండి, యతిరాజ సంపత్కుమారుడికి (అక్కడ కొలువై ఉన్న పెరుమాళ్ళ తిరునామము) కి మంగళాసనం నిర్వహించండి” అని ఆదేశించారు.

అణ్ణరాయర్ను భట్టర్పిరాణ్ జీయర్లను ఆశ్రయింపజేయుట

అదే సమయంలో, రామానుజులచే పొగడబడిన తిరుమలై నల్లాన్ వంశానికి చెందిన అణ్ణరాయ చక్రవర్తి, తమ కుటుంబ సభ్యులతో కలిసి పెరుమాళ్ళను దర్శించుకోడానికి శ్రీరంగానికి వచ్చారు. అప్పుడు భక్తుల సమూహాలు పెరుమాళ్ళను దర్శించుకొని, అంతిమ దశలో ఉన్న జీయర్ను సేవించుకోడానికి వెళుతున్న వారిని అణ్ణరాయరుల అమ్మగారు చూసి, “మనం కూడా వెళ్లి జీయర్ను సేవించుకోవాలి?” అని అడిగింది. సపరివార సమేతంగా అణ్ణరాయరులు జీయర్ మఠానికి వెళ్లి, భట్టర్పిరాన్ జీయర్ల పురుషకారం (సిఫార్సు) తో, జీయర్ దివ్య పాదాల వద్ద, పెరికి క్రింద పడవేసిన చెట్టువలె సాష్టాంగపడ్డారు. చాలా కాలంగా ఎవరినీ అనుగ్రహించాలో నని ముడుచుకొని ఉన్న జీయర్ దివ్య పాదాలు ఇప్పుడు మెల్లిగా చాచుకున్నాయి. ఈ క్రింది శ్లోకంలో విపులంగా చెప్పిబడి ఉంది.

తతః స్థిమితముద్ క్షిప్య చరణం చక్రలాంఛితం
కృపయా మూర్ధ్ని విన్యస్య సనినాయ కురుశ్రమం

(తరువాత, మణవాళ మాముణులు దివ్య చక్రం గుర్తులతో నున్న తమ పాదాలను కృపతో ఎత్తి, దయతో అణ్ణరాయర్ల శిరస్సుపైన అద్ది తమ కోరికను నెరవేర్చుకున్నారు). జీయర్ తమ దివ్య చరణాలను అణ్ణరాయర్ల దివ్య శిరస్సుపైన ఉంచి వారిని అనుగ్రహించారు. ఇది చూసిన అణ్ణరాయర్ల శిష్యులు ఆశ్చర్యపోయి, వారి భాగ్యాన్ని కొనియాడారు. జీయర్ అణ్ణరాయర్లతో ఇలా అన్నారు “తిరువేంగడంలో మా ఎంబెరుమానార్ జీయారుని దుష్టుల బారి నుండి రక్షించి, అలాగే మా దర్శనానికి అనుకూలమైన అనేక కార్యక్రమాలను నిర్వహించి, కాపాడింది మీరే కాదా?”, “నీ స్థాయికి ఏదీ తులతూగదు; నీవు ముందే ఇక్కడికి రావలసింది” అని అన్నారు. తరువాత భట్టర్పిరాన్‌ జీయర్ను పిలిచి “ఓ గోవిందప్ప దాసర్‌! ఇటు రండి. ‘రామస్య దక్షిణో బాహు’ (శ్రీరాముడి కుడి చేయిగా లక్ష్మణుడిని పిలుస్తారు) అని చెప్పినట్లు, మీరు మా కుడి చేయి కాదా? కావున, ఇది మాచేత నిర్వహించబడిందని భావించి, కోరిన వీరందరికీ పంచ సంస్కారము చేయండి” అని, అణ్ణరాయ చక్రవర్తి, తోళప్పర్, అళగియ మణవాళ పెరుమాళ్ నారాయణార్లను చూపుతూ, వారిని ధర్మ ప్రవర్తకులుగా (రామానుజుల తత్వ శాస్త్ర ప్రచారకులు) తీర్చి దిద్దమని భట్టర్పిరాన్ జీయర్ ను ఆదేశించారు.) భట్టర్పిరాన్ జీయర్ పెరియ జీయర్‌ ఆదేశం మేరకు విశేష రీతిలో ఆజ్ఞను అమలు చేశారు. అనంతరం, అప్పిల్లాన్, జీయర్ నాయనార్ (పెరియ జీయర్ పూర్వాశ్రమ మనవడు) జీయర్ దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారములు చేసి, “దేవర్వారి దివ్య విగ్రహాన్ని మాకు ప్రసాదించండి” అని ప్రార్థించారు. వారి కోరికను నెరవేర్చుచూ తమ ఒక రాగి చెంబుని వారికి ఇచ్చి, ఆ చెంబుని కరిగించి ఇద్దరికి ఒక్కొక్క ప్రతిమ చొప్పున రెండు విగ్రహాలు తయారు చేయమని ఆదేశించారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/23/yathindhra-pravana-prabhavam-97-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment