శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
వానమామలై జీయర్ తిరిగి వచ్చుట
వానమామలై జీయర్ తమ ఉత్తర భారత యాత్రను ముగించుకొని తిరిగి వచ్చారు; వీరు తిరుమల దగ్గర్లో ఉన్నప్పుడు జీయర్ శ్రీవైకుంఠానికి చేరుకున్నారన్న వార్త విన్నారు. అంతులేని దుఃఖంతో తిరుమలకు వెళ్లి, అక్కడ కొంతకాలం ఉండి, తమను తాము ఓదార్చుకొని శ్రీ రంగానికి తిరిగివచ్చారు. తమ ప్రయాణంలో లభించిన సామాగ్రిని పెరుమాళ్లకు తమ కైంకర్యంగా సమర్పించారు. తరువాత బాధతో మఠానికి వెళ్ళారు. జీయర్ నాయనార్లకు తమ సాష్టాంగ నమస్కారాలు చేసి, అక్కడ కైంకర్యములను ముగించుకొని వెంటనే వానమామలైకి బయలుదేరారు. ఆ తర్వాత మళ్లీ తిరుమలకు వెళ్లి, మార్గంలో ఉన్న ఎఱుంబికి కూడా వెళ్లి, కొంత కాలం అక్కడ ఉండి, శుద్ధసత్వం అణ్ణన్, పోళిప్పాక్కం నాయనార్లకు తిరువాయ్మొళి ఈడు బోధించారు. తరువాత, వానమామలైకి తిరిగి వచ్చి, అక్కడ కొలువై ఉన్న దెయ్వనాయగన్ పెరుమాళ్ళకి కైంకర్యం కొనసాగించారు.
అంతిమోపాయ నిష్ఠను వ్రాసిన భట్టర్పిరాన్ జీయర్
భట్టర్పిరాన్ జీయర్, తమ పేరుకు అనుగుణంగా “వడమామలైక్కదిపర్ భట్టనాథముని” (తిరుమల అధిపతి అయిన భట్టనాథముని) తిరుమలకు వెళ్లి, అణ్ణరాయ చక్రవర్తి, నాయనార్, తోళప్పర్ మొదలైనవారికి సంప్రదాయ సూచనలను అందించి దర్శన ప్రచారం చేయమని ఆదేశించారు. పరవస్తు అణ్ణన్, పరవస్తు అళగియ మణవాళ జీయర్లను కూడా తమ శిష్యులుగా స్వీకరించి, వారిని సత్సంప్రదాయ ప్రవర్తకులుగా తీర్చి దిద్దారు. చేతనులను ఉద్ధరించాలని, , వీరు కృపతో ‘అంతిమోపాయ నిష్ఠ’ (ఆచార్యుడు, ఆచార్యుడే అంతిమ ఉపాయం) గ్రంథాన్ని వ్రాసారు. ఈ ప్రబంధం ఉత్తమ రహస్య గ్రంధముగా పెద్దలు పరిగణిస్తారు.
అంతిమోపాయ నిష్ఠాయా వక్తా సౌమ్యవరోమునిః
లేకస్కస్యాన్వయోమేత్ర లేకనీ తాళపత్రవత్
(‘అంతిమోపాయ నిష్ఠ’ అను ఈ గ్రంధాన్ని కృపతో మణవాళ మాముణులు అనుగ్రహించారు. ఈ గ్రంధముతో అడియేన్ సంబంధం కేవలం తాళపత్రాలు, రచనా పరికరం వరకు మాత్రమే).
ఎందై మణవాళ ముని ఎనక్కళిత్త
అంతిమోపాయ నిట్టైయాం ఇదనై చ్చిందై శెయ్దు ఇంగు
ఎల్లారుం వాళ ఎళుదివైత్తేన్ ఇప్పువియిల్
నల్లఱివొన్ఱిల్లాద నామ్
(ఈ ‘అంతిమోపాయ నిష్ఠ’ నా స్వామి అయిన మణవాళ మాముణులు అనుగ్రహించినది. ఏ పరిజ్ఞానం లేని ఈ అడియేన్, కేవలం ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడాలన్న ఉద్దేశ్యముతో వ్రాసాను) ఈ గ్రంధముపై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా తిరస్కరిస్తున్నారు.
తిరునరాయణపురం తోటలో కైంకర్యము
భట్టర్పిరాన్ జీయర్ దివ్య తిరువడి ఆశ్రయం పొందిన తొళప్పర్, స్వయంగా ఆచార్య పరతంత్రులు. వీరి అన్నగారు అళగియ మణవాళ దాస నాయనార్లను, మణవాళ మాముణులు శ్రీరంగ పెరుమాళ్ళ అనుమతితో తిరునాయపురం వెళ్లి, అక్కడ ఎమ్పెరుమానార్లకు, శెల్వ పిళ్ళైకి కైంకర్యం చేయమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి పెరుమాళ్ళ కోసం ఒక తోటను నిర్మించి తమ కైంకర్యాన్ని ప్రారంభించారు. అక్కడి స్థానికులను ఎందరినో సంస్కరించి ఉద్దరించారు. ఈ విధంగా శ్రీశైలేశ దయాపాత్ర కీర్తి ఆ ప్రాంతాలలో మారుమ్రోగేలా, శ్రీశైలం (తిరువేంగడం) కి పశ్చిమాన ఉన్న ప్రాంతాలలో కూడా శ్రీశైలేశ దయపాత్ర మహిమలు ప్రతిధ్వనింపజేశారు. వారు తిరునారాయణపురంలో యతిరాజ మఠం వెనుక బసచేసి ఉండేవారు. అయ్యన్ మొదలైన తమ వంశం తరువాత తరాలవాళ్ళు కూడా ఆ కైంకర్యమును నిష్ఠగా నిర్వహించారు.
మూలము: https://granthams.koyil.org/2021/10/27/yathindhra-pravana-prabhavam-101-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org