యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 106

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 105

ప్రణవం (ఓం) “యద్వేదాదౌస్వరః ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠితః” (వేద పారాయణం ప్రారంభంలో, చివరిలో ప్రణవం పఠించబడుతుంది) అని చెప్పబడినట్లే, ‘శ్రీశైలేశ దయాపాత్రం’ మాముణుల స్తుతి రూపంలో ఉన్న ఈ తనియన్, దివ్య ప్రబంధ పారాయణము, వాటి అర్థ వ్యాఖ్యానాములు, రహస్యముల ప్రారంభంలో, చివరిలో పఠించబడుతుంది.

ప్రణవంలో, అకారం (అ) భగవానుని సూచిస్తుంది, మకారం (‘మ’) చేతనుని, ఉకారం (ఉ) ‘అ’ ‘మ’ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని చూపుతుంది. “అవ్వనవరుక్కు మవ్వానవరెల్లాం ఉవ్వానవరదిమై” (సమస్థ చేతనులు పెరుమాళ్లకు దాసులు) అని పెద్దలు అంటారు. ఈ అర్థాన్ని ఈ తనియన్లో ప్రతి పంక్తిలో మనం చూడవచ్చు:

శ్రీశైలేశ దయాపాత్రం: శ్రీశైలేశ అనే పదం అకారవాచ్యుడైన భగవానుని సూచిస్తుంది. అటువంటి భగవానుడి కోసం తప్ప మరెవరి కోసం చేతనుడు ఉనికిలో ఉండడని, భగవానుడి కృపకు పాత్రుడన్న వాస్తవాన్ని దయాపాత్రం అనే పదం సూచిస్తుంది. ప్రమాణాల ప్రకారం “ఆచార్యః స హరిః సాక్షాత్” (హరియే ఆచార్యుడు), ఆచార్యుడే భగవానుడు అని తెలుపుతుంది.

ధీభక్త్యాది గుణార్ణవం: దివ్య ప్రబంధ పాశురాలలో చెప్పినట్లే “తామరైయాళ్ కేల్వన్ ఒరువనైయే నోక్కుం ఉణర్వు” (శ్రీమహాలక్ష్మి పతి కోసమే ఈ చేతనుడు ఉన్నాడు), “ఆదియంజోదిక్కే ఆరాధ కాదల్” (పరమాత్మ కోసమే నా భక్తి), “ఉన్నిత్తు మఱ్ఱొరు దెయ్వం తోళాళ్” (విశ్లేషణ తరువాత మరే ఇతర దేవతను ఆరాధించడు), ఎందుకంటే ‘ధీభక్త్యాది గుణార్ణవం’ అనే వాఖ్యం జ్ఞాన భక్తి వైరాగ్యాన్ని సూచిస్తుంది, ఇది భక్తి ద్వారా భగవత్ శేషత్వాన్ని సూచిస్తుంది. “ఉన్నిణైత్ తామరైగట్కు అన్బురుగి నిఱ్కుమదే” (భగవానుడి దివ్య పాద యుగళి పట్ల భక్తితో ఉండటం) అనే చేతనుడి స్వరూపం (చేతనుడి స్వభావం) భగవత్ జ్ఞానం మాత్రమే కాబట్టి, శేషత్వమే (భగవత్ కైంకర్యం) జ్ఞానం అని నిర్వచించబడింది. ఇతర దేవతలకు ఇచ్చే ప్రాముఖ్యతను తిరస్కరించడమే వైరాగ్యం అని నిర్వచించబడింది.

యతీంద్ర ప్రవణం: ‘యతీంద్ర’ అనే పదం భగవత్ పారతంత్రుడిని, ఏ పని లేకుండా ఉండే వారిని సరిదిద్దే వాడిని, వాళ్ళు శ్రీమహాలక్ష్మి పతికి సేవ చేసేలా చేసేవాడిని సూచిస్తుంది. ఈ కారణంగా రామానుజుల కృపకు పాత్రులైనారు మాముణులు. భగవత్ అనన్యార్హ శేషత్వం (భగవానుడి కోసమే) అన్న గుణం తమ అనుచరుల వరకు ప్రవహించాలి. అంతేకాకుండా, ‘యతీంద్ర’ అనే పదం ప్రత్యేకంగా రామానుజులను సూచిస్తుంది. ‘రామానుజ’ అనే పదంలో ‘రామ’ అనే పదం అకారవాచ్యుడిని (ఎమ్పెరుమాన్) ని సూచిస్తుంది, ‘అనుజ’ అనే పదం కైంకర్యం చేసే చేతనుడిని సూచిస్తుంది. ‘రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా’ (యతులలో ప్రధానుడైన ఆ రామానుజుల ఎదుట శిరస్సు వంచి నమస్కరిస్తాను) అనే వాఖ్యం భక్తి స్థితిని సూచిస్తుంది.

వందే రమ్యజామాతరం మునిం: ఇది కూడా పైన పేర్కొన్న అర్థాన్నే సూచిస్తుంది. రమ్యజామాతృ అనే పదం అకారవాచ్యుడైన భగవానుని సూచిస్తుంది, ‘ముని’ అనే పదం సర్వ జ్ఞాని, పరమ చేతనుడైన భగవానుని కోసమే తాము అనే జీవుడిని సూచిస్తుంది. కాబట్టి, ఈ పదాలన్నీ ప్రణవార్థాలను సూచిస్తున్నాయని అనుకోవడంలో తప్పులేదు.

మూలము: https://granthams.koyil.org/2021/11/01/yathindhra-pravana-prabhavam-106-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment