అవతారిక
ఈ సుఖ దుఃఖములు ప్రతి ఒక్కరికి వారి వారి కర్మ మఱియు స్థితి గతులను బట్టి వర్తించును అను దానిని వివరించుచున్నారు.
చూర్ణిక
ఇవత్తుక్కు ఎల్లై ఇన్బుతున్బళి పల్ మా మాయత్తు అళున్దుకైయుమ్ కళిప్పు మ్ కవర్వుమ్ అత్తు, పేర్ ఇన్బత్తిన్బుఱుకైయుమ్
సంక్షిప్త వివరణ
ఈ సంసారములోని గొప్పవియు మఱియు మోహింపజేయు(వంచింపజేయు) శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయములలో మునిగియుండుట దుఃఖమునకు కారణము(హేతువు), అట్టి దుఃఖము మఱియు కర్మ నుండి విడువబడుటకు (వేరుబడుటకు) మఱియు అంతులేని ఆనందమును ప్రసాదించెడి పరమపదమున సుఖము పొందడమే సుఖ దుఃఖముల యొక్క అసలైన స్థితి.
వ్యాఖ్యానము
అది ఏమి అనగా
దుః ఖత్తుక్కు పరమావధి “ఇన్బుతున్బళి” పన్మా మాయత్తు అళున్దగై
“ఇన్బుతున్బళి” తో మొదలుపెట్టి – సుఖ దుఃఖములను కలుగజేయు, అనాదియు మఱియు దాటుటకు కష్టమగు ప్రకృతి
సంబంధం వలన ఈ సంసారమున బధ్ధులైతిరి. తిరువాయిమొళి 7.1.8 “ఇన్ ఆముదెనత్ తోన్ఴి” (అమృతము వలే తీయనిదిగ గోచరించు) లో చెప్పినట్టుగ ఈ శబ్దాది విషయములు(శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ) భోగ్యములైనవిగ మోహింపజేసి ఎంతటి వారినైననూ భ్రమింపజేయును మఱియు జీవులను సంసారము నుండి విడుదల అవుటకు ఆటంకములుగా ఉండును, ఎంతటి జ్ఞానులైననూ కలవర
పెట్టును. తిరువారిశిరియమ్ 6 “అళుం దుమ”(పూర్తిగ మునిగి) లో చెప్పినట్టు అట్టి శబ్దాది విషయములలో చిక్కుకొని “అనంత క్లేశ భాజనమ్” అయిన ఈ సంసారములో మునిగితిని.
సుఖత్తుక్కు పరమావధి కళిప్పు మ్ కవర్వు మ్ అత్తుప్ పెరిన్బత్థు ఇన్బురుగై
– “కళిప్పుమ్ కవర్వుమత్తు” తో మొదలగు తిరువాయిమొళి 2.3.10 లో చెప్పినట్టు (ప్రాపంచిక లాభముల వలన కలుగు ప్రాపంచిక సుఖములు మఱియు అట్టి లాభములు కలుగని యెడల వాటి యందు ఉండు విషయ ప్రావణ్యము(కామము లేదా వాంఛ) నుండి విముక్తులగుటకు 1) అల్పములు, అస్థిరములు మొదలగు దోషములు కలిగిన ప్రాపంచిక సుఖముల వలన కలుగు గర్వము 2)అట్టి సుఖములను పొందలేని స్థితిలో కలుగు దుఃఖములు, షడ్భావ వికారములు(పుట్టుక, ఉనికి, మార్పు, వృద్ధి, క్షయము, నశించుట) పోయి శుద్ధసత్త్వముగ ప్రకాశించు మఱియు భాగవత గోష్టితో నిండియున్న పరమపదమున అంతులేని ఆనందముతో అని తిరువాయిమొళి 10.9.11 లో “అన్దమిల్ పేరిన్బమ్”(అంతులేని గొప్ప ఆనందము) చెప్పినట్లుగా అపరిమితమైన ఆనందమయమగు పరమపదమున
నిత్య ముక్తులతో కలిసి అని తిరువాయిమొళి 8.10.5 “శుళిప్ప ట్టోడుమ్ శుడర్చోతి వెళ్ళత్తిన్బుత్తు”(గొప్ప తేజోమయమయిన, కాంతిగలది అయిన పరమపదమున ఆనందమును పొంది) లో చెప్పినట్టు అట్టి భగవదనుభవము చేత ఆనందముగా ఉండుట.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/27/acharya-hrudhayam-4-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org