ఆచార్య హృదయం -11

ఆచార్య హృదయం

<< చూర్ణిక 10

అవతారిక 

ఈ రెండిటి యొక్క సంబంధం వలన ఆత్మకు ఏమి కలుగనో  ఇక్కడ వివరించుచున్నారు.  

చూర్ణిక

ఇవై కిట్టముమ్ వేట్టువేళానుమ్ పోలె ఒణ్ పొరుళ్ పొరుళ్ – అల్లాతవై యెన్నాతే నానిలాత యానుముళనావన్ ఎన్గిఴ సామ్యమ్ పెఴ తిన్ఴు ఊతి అన్దముమ్ వాళ్వుమ్ ఆకిఴ హాని సత్తైకళై ఉణ్డాక్కుమ్ 

సంక్షిప్త వివరణ 

ఎలా అయితే (ఇనుము) తుప్పుతో  చేరిన మణి(ముత్యము) క్రమముగా దాని సహజ కాంతిని కోల్పోతుందో, ఒక కీటకం(పురుగు) కందిరీగతో చేరడం వలన ఆ పురుగు కందిరీగలా మారుతుందో అదే క్రమము లో అనాదియైన ప్రకృతి సంబంధం చేత ఆత్మ తన సహజమైన జ్ఞానమును కోల్పోతుంది మరియు భగవత్ సంబంధం చేత ప్రతిబంధకమైన ఈ  సంసారమును విడిచి మోక్షమును పొందుతుంది.      

వ్యాఖ్యానము 

అది ఏమి అనగా –

అచిత్ సంబంధం

బాగా కాంతివంతంగా మెరిసే మాణిక్యం తుప్పుతో చేరినప్పుడు ఆ మాణిక్యపు కాంతిని తుప్పు ఎలా అయితే హరించి వేస్తుందో అలానే సహజమైన జ్ఞానమును, స్వయం ప్రకాశకత్వమును స్వభావముగా కలిగిన ఆత్మను, తిరువాయిమొళి 1.2.10 “అన్నలొత్తు ఒణ్ పొరుళ్” ( కల్యాణ గుణములు అయిన ఆనందము మొదలగు కలిగిన జీవులు) అనియు తిరువాయిమొళి 1.2.4 “ఇల్లదు” (లేనిది) మరియు శ్రీ విష్ణు పురాణము 2.12.37 “యన్నాస్తి” (ఏది లేనిదో) జ్ఞానము లేనిదైన అచిత్ తిని వేయును. తిరుచ్చందవిరుత్తం 65 “నానిలాత” (నేను అని లేను )హాని కలుగచేయును. అనగా తైత్తిరీయ ఉపనిషద్ లో చెప్పినట్టు “ఆసన్నేవ స భవతి” (భగవానుని తెలుసుకోలేని వాడు లేని వాడే) వాడి ఉనికికే హానిచేయును. 

అయన సంబంధం

“కీటః పేశకృతా రుద్ధః కుడ్వాన్తర మచిన్తయన్ సంరంభ భయ యోగేన విన్దతే తత్స్వరూపతాం” (కందిరీగ ఒక కీటకమును తెచ్చి దాని చుట్టూ గూడు కట్టి ఉంచగా, ఆ కీటకం భయము తో ఎటూ వెళ్లలేక ఆ కందిరీగల మారినట్టు) అనగా ఒక కీటకమును తెచ్చిన  కందిరీగ దానిని కుట్టగా ఎలా అయితే ఆ కీటకం కందిరీగలా మారునో అలానే జ్ఞానము కలుగక పోవుట వలన అచిత్ తో సామ్యమును పొందిన జీవాత్మ అని తిరువాయిమొళి 5.7.3 ” పొరుళ్లాత వెన్నై” (ఒక వస్తువుగా చెప్పుకునేట్టుగా కాకుండా ఉన్న నన్ను మార్చి “ఆసన్నేవ” (అచిత్ వలె) నా స్వరూపమును తెలుసుకునేట్టు)ముండక ఉపనిషద్ 3.2.3 “నిరంజనః పరమం సామ్యముపైతి” (ఆత్మ యొక్క తక్కువ స్థితి(అణుత్వం) చూడక స్వరూపమును బట్టి విభువగు పరమాత్మతో సామ్యముగా చేయును అన్నట్టు, పెరియ తిరువందాది 76 “ఉళ్ళ ఉలగళావుమ్ యానుమ్ ఉళనావన్”(నేను కూడా అన్ని లోకములలో ఉన్న వాడి వలే అవుతాను) అన్నట్టు భగవత్ సంబంధం చేత ఆత్మ తన యొక్క స్వరూపమును పొందును “సంతమేనం తతో విధుః” అని చెప్పినట్టు (భగవత్ జ్ఞానము కలిగి ఉండటం వలనే తన ఉనికి తెలుస్తోంది)         

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/03/06/acharya-hrudhayam-11-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment