అవతారిక
జీవాత్మకు కలుగు అట్టి సుఖ దుః ఖములకు గల కారణమును ఈ సూత్రమున వివరించుచున్నారు.
చూర్ణిక
అనన్తక్లేశ నిరతిశయానం ద హేతు – మఴన్దేన్ – అఴియకిలాతే – ఉణర్విలేన్ – ఏణిలేన్ – అయర్తు ఎన్ఴు మ్, ఉయ్యుమ్ వకై – నిన్ఴవొన్ఴై – నన్గఴిన్దనన్ – ఉణర్వినుళ్ళే – అమ్బరిశు శొల్లుకిఴ జ్ఞాతవ్య పఞ్చక జ్ఞానాజ్ఞానజ్గళ్
సంక్షిప్త వివరణ
ఇట్టి అంతము లేని దుఃఖమునకు మఱియు గొప్ప సుఖమునకు గల కారణము ఏమి అనగా తెలుసుకొనదగిన అర్థపంచక జ్ఞాన శూన్యత (రాహిత్యము) మఱియు అర్థపంచక జ్ఞాన వికాసము.
వ్యాఖ్యానము
అది ఏమి అనగా
అనన్తక్లేశ హేతు
జితం తే శ్లోకం 1-4 “సంసార సాగరం ఘోరమ్ అనన్తక్లేశ భాజనం” (సంసార సాగరం అసంఖ్యాకములయిన దుఃఖములకు నిలయము మఱియు అతి క్రూరమయినదిను. ఎవరు మహా విశ్వాసముతో నిన్నే ఉపాయముగా తలచి తమ మనస్సులను స్వాధీనమున ఉంచుకుం దురో అట్టి వారు నిన్ను పొంది ఈ సంసార సాగరమును దాటుతారు). ఈ సంసార సంబంధం చేత కలుగు అంతులేని దుఃఖములకు గల కారణము ఏమి అనగా – తెలుసుకొనదగిన అర్థపంచక జ్ఞానము లేకుండుట మఱియు అజ్ఞానమును(తమస్సు) ఈ విషయములలో కలిగియుండుట.
1. పర (భగవానుడు) – పెరియ తిరుమొళి 6.2.2 “మఴన్దేనున్నై మున్న మ్”(ఇంతక ముందు నిన్ను మరిచి ఉంటిని) అని చెప్పినట్లు.
2. ఆత్మ (జీవుడు) – పెరియ తిరుమొళి 2.9.9 “ఎన్నై యఱియ కిలాతె” (నన్ను తెలుసుకొనక) అని చెప్పినట్లు.
3. విరోధి (ఆటంకములు) – పెరియ తిరుమొళి 1.6.6 “ఓడియు ముళన్దుముయిర్కళే కోన్ఴే నుణర్విలేన్” (మంచి కార్యముల యందు అనాసక్తిని కలిగి ఉన్న మనస్సు, ఇతరులలో కోపమును పెంచు కార్యములు చేసియుండుట, శునకములతో వేటచే ఆనందమును పొం దియుండుట, చాల దూరము పరుగెడియుండుట, వేధించి ఇతర ప్రాణులను చంపియుండుట) అని చెప్పినట్లు.
4. ఉపాయము(గతి) – పెరియ తిరుమొళి 1.6.1 “పిఴవినో యఴు ప్పానే ణిలేనిరున్దేన్” (సంసారమనెబడి రోగమును త్యజించుటకు ఎన్నడూ ఆలోచన చేయని మూర్ఖుడగు నేను) అని చెప్పినట్లు.
5. పురుషార్థము (పొందతగినది) – పెరియ తిరువన్దాది 82 “ఆళియజ్గే యామ్మనైయేత్తాయర్తు” (సుందరమైన చేతికి ఉంగరము గల ఎమ్పెరుమానుని స్తోత్రము చేయక ఒక మూర్ఖునిగ ఉండుట) అని చెప్పినట్లు.
నిరతిశయానంద హేతు
శ్రీ విష్ణుపురాణము 6.5.59 న చెప్పినట్లు “నిరస్తాతిశయాహ్లాద సుఖభావైక లక్షణ”(ఈ ప్రపంచములోని ఆనందము కంటే గొప్పదైన ఆనందము)సర్వేశ్వరుని పొందు రూపమున ఉన్న మోక్షం వలన కలుగు గొప్ప సుఖమునకు కారణము ఏమి అనగా – తెలుసుకొనదగిన అర్థపంచక జ్ఞానము కలిగి ఉండుట మరియు అజ్ఞానమును(తమస్సు) ఈ విషయములలో లేకుండుట.
1. పర(భగవానుడు) పెరియ తిరుమొళి 6.3.6 “నిన్నై నెన్జిల్ ఉయ్యుమ్ వకై ఉణర్న్దేనే” (నా ముక్తి కొరకు నిన్ను నా మనస్సున తెలిసికొంటిని)
2. ఆత్మ – తిరువాయిమొళి 8.8.4 “నిన్ఴవొణైయణల్ న్దెన్” (“అహం ” అను పదమునకు నిర్వచనమయిన “అతనిని” నేను తెలుసుకొంటిని)
3. విరోధి – తిరువాయిమొళి 5.7.8 “అకత్త నీవైత్త మాయవల్లెమ్బులజ్గళామలై నన్గఴిన్దవన్”(నీకు అభిముఖులు కాని వారికి నీవు ఏర్పరిచిన ఆశ్చర్యకరములైన మరియు క్రూరమయిన పంచేంద్రియములను తెలుసుకొనవాడను)
4. ఉపాయము – తిరువాయిమొళి 8.8.3 “అవనతరుళాలుఴల్ పొరుట్టైన్ను ణర్వినుళ్ళై యితుత్తినేన్” (అమితమైన జ్ఞానమును కలిగియున్న నిత్యసూరుల నాయకుడగు ఆ సర్వేశ్వరుని పొందుటకు అతని కృపతోనే, నేను అతనిని నా జ్ఞానమను కోరికతో నా మనస్సులో ఉంచితిని. అట్టి కోరిక కలుగుటకు కూడా ఆ సర్వేశ్వరుని నిర్హేతుక కృపయే కారణము)
5. పురుషార్థము – తిరుమాలై 38 “అమ్బరి శఴిన్దుకొణ్డు” (భగవత్కైంకర్య మే జీవుని యొక్క అసలు స్వభావము(స్వరూపము) అని తెలుసుకొనుట)
దీనితో “జ్ఞానాన్ మోక్ష: అజ్ఞానాత్ సంసారం :” (జ్ఞానము మోక్షమునకు కారణము మరియు అజ్ఞానము సంసార బంధనమునకు కారణము) అనియు “ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయమ్ ఫలమ్ ప్రాప్తేన తధా ప్రాప్తి విరోధిచ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మనో వేదవేదార్ధ వేదినః ” (ప్రాప్యుడగు పరమాత్మ యొక్క స్వరూపము, ప్రాప్తయగు జీవాత్మ యొక్క స్వరూపము ప్రాప్తికి గల ఉపాయము ప్రాప్తికి గల ఫలమును ప్రాప్తి ఆటంకములగు విరోధులను సకల వేదములను, ఇతిహాసము, పురాణములను వేద వేదార్థములను తెలిసిన మునులు మహాత్ములు తెలుపుచున్నారు) . ఆత్మ ఉజ్జీవనమున కై తెలుసుకొనవలసిన అర్థ పంచక జ్ఞానమే సకల శాస్త్రముల సారము. అట్టి జ్ఞాన శూన్యత మరియు అట్టి జ్ఞాన వికాసము యే సంసార బంధనమునకు మరియు
మోక్షమునకు కారణము.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/28/acharya-hrudhayam-5-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org