ఆచార్య హృదయం – 12

ఆచార్య హ్రుదయమ్

<< చూర్ణిక 11

అవతారిక

ఈ రెండింటితో(అచిత్, సర్వేశ్వరుని)అనాదిగా ఆత్మకు గల సంబంధము నిత్యముగా ఉండునా అన్న దానిని ఇక్కడ వివరించుచున్నారు.

చూర్ణిక

ఒన్ఴు కూడినతాయ్ పత్తఴుక్క మీన్డు ఒళిగైయాళే పళవడియేన్ ఎన్ఴుమతు ఒన్ఴుమే ఒళిక్క ఒళియాదు

సంక్షిప్త వివరణ

ఆత్మకు అచిత్ తో గల సంబంధము అసహజమైనది, భగవానునితో  గల సంబంధము సహజమైనది మరియు ఆత్మకు గల అచిత్  సంబంధమును విడదీయుటకు గల శక్తి సామర్ధ్యములు ఆ సర్వేశ్వరునికి కలవు కనుక భగవానునితో ఆత్మకు గల సంబంధమే నిత్యమైనది.

వ్యాఖ్యానము

అది ఏమి అనగా – పెఱియ తిరుమొళి 1.1.1 “పెఴున్దయర్ ఇడుంబైయిల్ కూడినేన్” (దుఃఖమును కలిగి ఉండుట, దుఃఖములకు కారణమగు దేహముతో జన్మించుట) అని చెప్పినట్టు, ఆత్మకు అచిత్ తో గల సంబంధము సహజమైనప్పటికీ అది యాదృచ్ఛికముగా ఏర్పడినదే అనియు పెఱియ తిరుమొళి 11.4.1 “వినై పత్తఴుక్కుమ్” (పాప సంబంధమును తొలగించుట) సర్వ శక్తిమంతుడైన ఆ స్వామి ఆత్మకు గల అట్టి అచిత్ సంబంధమును మరియు దాని పై గల రుచిని తొలగించును(విడిపించును). ముదల్ తిరువందాది 59 “అడైన్ద అరువినైయోడు అల్లల్ నోయ్ పావమ్ మిడైన్దు అవై మిణ్డొళియ” (దేహేంద్రియములను పొందుటకు గల కారణభూతములైన మనోవేదము, శరీరమునకు కలుగు రోగము, అవిద్య, అతి భయంకరమైన పాపములు, చెడు కర్మలును తొలగించుటకు) అని చెప్పినట్టు.

ఈ విధముగా అనాదియగు నిత్యమైన శేష- శేషి సంబంధమును తిరుప్పల్లాండు లో చెప్పినట్టు ” తిరుమాలే నానుమ్ ఉనక్కుప్ పళ అడియేన్”(శ్రీ మహాలక్ష్మికి స్వామి అయిన ఓ తండ్రీ! నేను కూడా నీకు నిత్య కింకరుడినే) విడదీయుట ఈ చేతనునికి కాని, ఈశ్వరునికి కాని శక్యము కానిది. తిరుప్పావై 28 “ఉఴవేళ్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియాదు” (మాకు నీతో గల సంబంధమును నీకు గని మాకు గని విడదీయుటకు శక్యము కాదు) అని చెప్పినట్టు .

దీనితో ఈ  చూర్ణికలో వివరించినట్టు, అచిత్ తో ఆత్మకు గల సంబంధము యాదృచ్ఛికము మరియు కర్మ కారణముతో కలుగడము చేత అది అనిత్యము మరియు అశాశ్వతము. సర్వేశ్వరునితో ఆత్మకు గల సంబంధము అనాదిగ  ఏ కారణము కాని లేకుండుట చేత అది నిత్యము. ఆత్మకు అచిత్ తో గల యాదృచ్ఛిక సంబంధము అనాది అని చెప్పుటకు గల కారణము ఏమి అనగా అట్టి సంబంధము ఎప్పుడు ఆరంభము అయినదో అను జ్ఞానము లేకపోవుట వలన మరియు శాస్త్రము కూడా అనాది అని చెప్పడం చేత ఈ సంబంధము అనాది అని మనము నిశ్చయించుకొనవచ్చును, పైగా భగవానుని కృప చేత ఈ సంబంధము ఒక సమయమున తొలగించబడుడ చేత దాని ప్రవృత్తి యాదృచ్ఛికము అనేది తధ్యము.

అడియేన్ పవన్ రమాముజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/03/07/acharya-hrudhayam-12-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment