అవతారిక
ఆత్మకు సర్వేశ్వరునకు గల సంబంధమే ఆ సర్వేశ్వరుడు శాస్త్ర ప్రదానము చేయుటకు గల కారణమని చెప్పుచున్నారు.
చూర్ణిక
ఇన్ద ఉదరత్తఴిప్పు త్రైగుణ్య విషయమాన అవత్తుక్కు ప్రకాశకమ్
సంక్షిప్త వివరణ
ఇట్టి సంబంధమే భగవానుడు వేదశాస్త్రమును ప్రసాదించుటకు గల కారణము
వ్యాఖ్యానము
అనగా – ఈ సంబంధమునకు మూలమైన “నారాయణత్వము” అను కారణము చేతనే సత్త్వ రజస్తమో గుణముల చేత బద్ధులైన చేతనులను ఉద్దేశ్యించి వేదం శాస్త్రమును ప్రకాశింపజేసెను. భగవద్గీత 2.45 “త్రైగుణ్య విషయా వేదాః” ( సత్త్వ రజస్తమో గుణములు కలిగి ఉన్న చేతనుల ఉజ్జీవనమునకై వేదములు ఉన్నవి) అని చెప్పినట్టు సత్త్వ రజస్తమో గుణములు కలిగి ఉన్న ఈ చేతనుల రుచికి తగ్గట్టుగా పురుషార్థములను వాటికి తగ్గ సాధనములను వేదశాస్త్ర పూర్వ భాగమున చెప్పి ఉండుట చేత వేదము త్రైగుణ్య విషయము అని పేర్కొనబడినది.
దీనితో మొదటి చూర్ణిక లో చెప్పినట్టు (నీర్మైనాల్ అరుళ్ సెయ్దాన్) శాస్త్ర ప్రదానమునకు గల కారణము జీవ ఈశ్వరులకు గల సహజ సంబంధమే అని ఏర్పడుచున్నది.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/29/acharya-hrudhayam-13-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org