ఆచార్య హృదయం – 14

ఆచార్య హ్రుదయమ్

<< చూర్ణిక 13

అవతారిక

జీవులతో అనాదియైన, నిత్యమైన సహజ సంబంధమును(శేష-శేషి) కలిగి ఉన్న పరమాత్మ కేవలము మోక్షమును మాత్రము తెలియజెప్పు శాస్త్రమును కాక విషయ వాంఛలను, ప్రాపంచిక సుఖములను, స్వర్గాది సుఖములను కలుగజేయు శాస్త్రములను కూడా బయలుపరుచుటకు గల కారణము ఏమి అను ప్రశ్నకు సమాధానమును ఈ చూర్ణిక లో వివరింపబడుచున్నది.

చూర్ణిక

వత్సలైయాన మాతా పిళ్ళై పెగణియామల్ మణ్ తిన్నవిట్టు ప్రత్యౌషదమ్ ఇడుమాపోలే ఎవ్వుయిర్కుమ్ తాయిరుక్కుమ్ వణ్ణమాన ఇవనుమ్ రుచిక్కీడాక పన్దముమ్ అఴుప్పతోర్ మరున్దుమ్ కాట్టుమిఴే

సంక్షిప్త వివరణ

ఈ లోకములో ఎలా అయితే వాత్సల్యము కలిగియున్న తల్లి తన బిడ్డను తినకూడని మట్టిని తిననిచ్చి ఆ తర్వాత దాని విరుగుడికి మందు ఇస్తుందో అలానే సమస్త జీవములకు తల్లి అయిన ఆ సర్వేశ్వరుడు చేతనుల రుచికి తగ్గట్టు ఈ సంసారమున బంధములను కల్పించి ఆ తరువాత వాటిని తొలగించును(తొలగించుటకు మోక్షము అను మందును ఇచ్చును).

వ్యాఖ్యానము

అనగా – వాత్సల్యము గల తల్లి తన బిడ్డ మట్టిని తినాలని అనుకున్నప్పుడు తిననిచ్చి ఆ తరువాత ఆ మాంద్యమును(అజీర్తి) పోగొట్టుటకు మందు ఇస్తుందో అలానే తిరువాయిమొళి 1.5.3 “ఎవ్వుయిర్ క్కుమ్ తాయోన్”(సమస్త జీవరాశుల పట్ల తల్లి వంటి వాత్సల్యము కలవాడు) అని చెప్పినట్టు మరియు పెఱియ తిరుమొళి 11.6.6 “తాయిరుక్కుమ్ వణ్ణమే”(తల్లి వలే) చేతనుల పట్ల తల్లి వంటి వాత్సల్యము కలిగి ఉన్న సర్వేశ్వరుడు వారి రుచికి తగినట్లు ఈ సంసారమున బంధములను కలిగించి ఆ తరువాత క్రమముగా దాని(సంసారము) విరుగుడుకు మందు ఇచ్చును.

దీనితో పైన చెప్పినటువంటి కార్యము తల్లి వలే వాత్సల్యముతో చేతనుల పట్ల తనకు ఉన్న సంబంధము చేత జరుగును కాబట్టి అట్టి సంబంధమునకు ఎట్టి అవరోధము లేదు.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/29/acharya-hrudhayam-14-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment