ఆచార్య హ్రుదయం – 17

ఆచార్య హ్రుదయం

<< చూర్నిక – 16

అవతారిక

ఆ సర్వేశ్వరుడు ఈ సంసారములోని చేతనులను(బద్ద జీవాత్మలను) ఉజ్జీవించుటకు(ఉద్దరించుటకు) దయతో శాస్త్రమును, మరియు శాస్త్ర సారమైన తిరుమంత్రమును బయలుపరిచెను అని ఇంతక ముందు చెప్పబడినది. అయితే ఈ రెండిటిని ఎలా ప్రకాశింపచేసాడు? వాటికి అర్హులు ఎవరు? అను ప్రశ్నలకు సమాధానములు ఇక్కడ చెప్పుచున్నారు.

చూర్ణిక
మునివరై యిడుక్కియుమ్ మున్నీర్ వణ్ణనాయుమ్ వెళియిట్ట శాస్త్ర తాత్పర్యజ్గళుక్కు విశిష్ఠనిష్కృష్టవేషజ్గళ్ విషయమ్

సంక్షిప్త వివరణ
మునుల ద్వారా ప్రకాశింపచేసిన శాస్త్రమునకు లక్ష్యము(శ్రోతలు)చేతనుల యొక్క దేహ విశిష్టము స్వరూపము మరియు తానే ప్రకాశింపచేసిన శాస్త్ర సారమునకు లక్ష్యము(శ్రోతలు) కేవలము ఆత్మ స్వరూప విషయము.

వ్యాఖ్యానము
అనగా – నిత్యము ధ్యానములో ఉండు వ్యాసాది మొదలగు మహర్షులు తిరువాయిమొళి 10.7.7 “ఇరుళ్గల్ కడియుమ్ మునివర్”(పురాణాల ద్వారా తమ ఉపదేశములతో అజ్ఞానాంధకారమును పోగొట్టు వారైన గొప్ప మునులు). ఆ సర్వేశ్వరుడు తానే చెప్పినట్టు శ్రీ విష్ణు పురాణము 3.4.4 “కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కోహ్యన్యః పుణ్డరీకాక్షాన్మహాభారత కృత్భవేత్” (కృష్ణద్వైపాయనడు అను వ్యాసుడు నారాయణుడు అని తెలుసుకొనుము; అట్టి పుండరీకాక్షుడు అయినా ఆ సర్వేశ్వరుడు తప్ప ఎవడు మహాభారతమును రచింపగలడు?) అన్నట్టు తానే అని నిర్ధారించుట విధమున అంతర్యామిగ ఉండి వారి ద్వారా బయలుపరచిన శాస్త్రమునకు ఈ చేతనుల దేహ విశిష్టమగు స్వరూపము విషయము.

పెఱియ తిరుమొళి 1.4.10 “వతరియాచ్ఛిరా మత్తుళ్ళానైకరున్గడల్ మున్నీర్ వణ్ణనాయ్” (మూడు విధములగు జలములను కలిగిన దివ్యమయిన సముద్రము వంటి ఛాయ కలిగినవాడైన ఆ సర్వేశ్వరుడుశ్రీ బదరికాశ్రమమున నిత్యముగా వేంచేసియున్నాడు) అని చెప్పినట్టు శ్రీ బదరికాశ్రమమున స్వయముగా వచ్చి ప్రకాశింపచేసిన శాస్త్ర తాత్పర్యమగు తిరుమంత్రమునకు చేతనుల నికృష్టమగు స్వరూపము విషయము(దేహము లేకుండా కేవలము ఆత్మ స్వరూపము).

దీనితో శాస్త్రమునకు దేహము విషయమనియు, శాస్త్ర తాత్పర్యమునకు ఆత్మ విషయమనియు చెప్పబడినది.  

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-17-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment