ఆచార్య హ్రుదయం – 20

ఆచార్య హ్రుదయం

<< చూర్నిక – 19

అవతారిక
శాస్త్రమునందు ప్రావీణ్యము కలియుగ ఉండు శాస్త్రజ్ఞులు తమ స్వప్రయత్నము, భగవానుని కృప మీద ఆధారపడి ఉండు స్థితికి గల కారణము మరియు శాస్త్ర సారమునందు ప్రావీణ్యము కలిగి ఉండు సారజ్ఞులు కేవలము భగవానుని కృప మీదనే ఆధారపడి ప్రవర్తించు స్థితికి గల కారణములను ఇక్కడ వివరించుచున్నారు.

చూర్ణిక
ఇవై స్వరూపత్తై ఉణర్న్దు ఉణర్న్దు ఉణర్వుమ్ ఉణర్వై ప్పెఴ వూర మిక  ఉణర్వుమ్ ఉణ్డామ్

సంక్షిప్త వివరణ
క్రమ క్రమముగా వృద్ధిని పొందిన శాస్త్రజ్ఞులు తమ స్వప్రయత్నము మరియు భగవానుని కృప పైన ఆధారపడి ఉందురు. భగవానుని కృప చేత సత్యమును ఎరిగిన సారజ్ఞులు కేవలము ఆ భగవానుని కృప మీదనే ఆధారపడి ఉందురు.

వ్యాఖ్యానము
అనగా – శాస్త్రజ్ఞులకు తిరువాయిమొళి 1.3.6 “ఉణర్న్దు ఉణర్న్దుఇళిందు అగన్ఴు ఉయర్న్దు ఉరువియన్ద ఇన్ నిలైమై ఉణర్న్దు ఉణర్న్దు ఉణరిలుమ్” (జీవాత్మ సహజముగానే జ్ఞానమును కలిగి ఉండి మరియు అట్టి జ్ఞానము తన సహజ స్థితిలో అనంతమై అంతటా వ్యాపించి ఉండడము చేత, ఒకడు ఆత్మ దేహము కంటే వేరు అయినది అని శ్రవణ, మనన, నిదిధ్యాసనములచే అట్టి జీవాత్మ స్వరూపమును తెలుసుకున్నప్పటికీ అని చెప్పినట్టు ఒకడు జీవాత్మ స్వరూపమును శ్రవణము, మననము ద్వారా చూసినప్పుడు అట్టి స్వరూపము కేవలము జ్ఞానమును కలది కానిదై
1. నిత్యమయిన జ్ఞానమును కలదై
2. ఆ జ్ఞానము దేహమంతటా వ్యాప్తించినదియై
3. ఆ జ్ఞానము దేహము కంటే వేరు అయినదియై
4. అట్టి జ్ఞాతృత్వము వలన కర్తృత్వ, భోక్తృత్వములు కలదియై
5. సర్వేశ్వరునికి శేషభూతమై  

ఉండి  స్వప్రయత్నముచే సంసారమును ఈదుటకై ప్రయత్నించెదరు.

సారజ్ఞులకు, ఆత్మస్వరూపము యొక్క గొప్పతనమును చూపించుటకు తిరువాయిమొళి 8.8.3 “ఉణర్వుమ్ ఉడమ్బుమ్ మత్తులప్పిలనవుమ్ పళుదేయమ్ ఉణర్వైప్ పెఴ ఉర్న్దు” (విషయం జ్ఞానము, అయిదు విధముల ప్రాణము, పలు విధాలా శరీరము, మహత్, అహంకార, ఇంద్రియములు విడువవల్సినవి అన్న జ్ఞానమును పొందునట్టు తానే నాకు ప్రకాశింపజేసెను) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుడే సంసార విషయమగు జ్ఞానము, ప్రాణము, శరీరము, బుద్ధికి గోచరించని ప్రకృతి మార్పులను విడిచి పెట్టె జ్ఞానమును ప్రసాదించి తిరుమాలై 38 “మెయ్మ్మెయై మికపుణర్న్దు” (యధార్ధమును గ్రహించి) అని చెప్పినట్టు, ఒకడు స్వరూప యాధాత్మ్య జ్ఞానమును దర్శించి ఆత్మ శరీరము కంటే వేరైనది, జ్ఞానానంద స్వరూపమైనది, జ్ఞానము మొదలగు వాటిని గుణములుగా కలిగినదియై భాగవత శేషత్వ పర్యంతమగు భగవత్సేషత్వము కలిగినదియై మరియు శేషత్వమునకు పరాకాష్టయగు పారతంత్య్ర భోగ్యతలు కలిగినదియై అని తెలుసుకొని తన భారమునంతయు ఆ సర్వేశ్వరుని పైన ఉంచి స్వప్రయత్నము ఏదియూ లేకుండా ఉండుట జరుగును.

దీనితో స్వరూప విషయమున వీరికి గల జ్ఞానమునందు తారతమ్యమే వారి వారి స్థితులకు కారణములని తెలుస్తున్నది.

అందుచేత చూర్ణిక 17 “మునివరై ఇడుక్కియుమ్” నుంచి ఇక్కడ వరకు శాస్త్రము యొక్క, శాస్త్ర తాత్పర్యము యొక్క విషయములకు భేదమును, అధికారి భేదమును, ఆ అధికారుల యొక్క జ్ఞాన వైలక్షణ్యమును, వాటికి కారణమగు స్థితులకు జ్ఞానమునందు తారతమ్యములు చెప్పబడ్డాయి.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-20-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment