ఆచార్య హ్రుదయం – 24

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక 23

అవతారిక
తదుపరి స్వరూప జ్ఞానము, స్వరూప యాధాత్మ్య జ్ఞానము కలిగిన వారైన 19వ చూర్ణిక “శాస్త్రిగళ్ … ” లో  చెప్పినట్టు ప్రవృత్తిపరులు  (కర్మాచరణలో నిమగ్నమైన వారు) మరియు నివృత్తిపరులు (అక్కర్లేని కర్మాచరణను త్యజించువారు) ఏది పొందాలో, ఏది త్యజించాలో ఇక్కడ వివరించుచున్నారు.

చూర్ణిక
నాలిల్ ఒన్ఱు ప్రవర్తకమ్; ఒన్ఱు నివర్తకమ్

సంక్షిప్త వివరణ
శేషత్వము, భోక్తృత్వము, పారతంత్య్రము, భోగ్యత అను ఈ నాలుగింటిలో భోక్తృత్వము ఉపాయమున ప్రవర్తించుటకు దారి తీయును మరియు భోగ్యత ఉపాయ నివృత్తికి దారి తీయును.

వ్యాఖ్యానము
అనగా – శేషత్వము, భోక్తృత్వము, పారతంత్య్రము, భోగ్యత అను ఈ నాలుగింటిలో శాస్త్రజ్ఞులు శేషత్వము, భోక్తృత్వములే ఆత్మ యొక్క స్వరూపముని ప్రవర్తించెదరు(తెలుసుకొనిరి). భోక్తృత్వము అనేది భోక్తని భోగ్యవస్తువును పొందుటకై ప్రయత్నింపవలెనని భావింపచేసి భగవద్విషయ ప్రాప్తమైన ఉపాయమున ప్రయత్నింపజేయును.

సారజ్ఞులు పారతంత్య్రము, భోగ్యతలే ఆత్మ యొక్క స్వరూప యాధాత్మ్యమని తెలుసుకొనిరి. భోగ్యత  అనేది భోక్త అయిన సర్వేశ్వరుడు కదా తనకు భోగ్యమైన ఈ ఆత్మను పొందుటకు ప్రయత్నించవలసినది అని ఉపాయ విషయమును విడిచిపెట్టేలా ప్రవర్తింపచేయను.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-24-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment