ఆచార్య హ్రుదయం – 25

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 24

అవతారిక
శేషత్వ, భోక్తృత్వములు కైంకర్యపరులైన సారజ్ఞులకు కూడా కలవు కదా? అని అడిగినచో వాటికి గల ప్రయోజనము ఏమిటో ఇక్కడ సమాధానమును ఇచ్చుచున్నారు.

చూర్ణిక
ముఴ్పాడక్కు క్రియజ్గమానవై యిరణ్డుమ్ శెయల్ తీర్న్దార్ వృత్తియిల్ స్వనిర్బంధమ్ అఴుక్కుమ్

సంక్షిప్త వివరణ
శాస్త్రజ్ఞులకు ఉపాసనా అంగములైన ఈ శేషత్వ భోక్తృత్వములు స్వప్రయత్నమును విడిచి పెట్టిన వారి విషయమున స్వభోగ్యతా బుద్ధికి తావివ్వకుండా నిరసించును.

వ్యాఖ్యానము
అనగా – ఉపాసకులైన శాస్త్రజ్ఞులు ఇక్కడ మొదటగా చెప్పబడ్డవారు. అట్టి వారికి భోక్తృత్వము అనేది భోగ్య వస్తువును పొందుటకై గల ప్రయత్నమున ప్రేరేపించునది. అది కూడా (అట్టి ప్రయత్నము) ఆత్మ జ్ఞాన పూర్వకముగా చేయవలసినది కావడము చేత శేషత్వము కూడా కావలెను(అవశ్యము). ఇలా ఈ రెండును (శేషత్వ, భోక్తృత్వములు) ఉపాసనమునకు మొట్టమొదటి మెట్టు అయిన కర్మ విషయమున ఉపయోగపడునవై అంగములుగా ఉండును. ఈ రెండూను ముందు ముందు వివరింపబడుచున్నవి.

నాన్ ముగన్ తిరువందాది 88 “శెయ్యల్ తీరచ్చిన్దిత్తు వాళువార్” (ఇక చేయవలసినది ఏమీ లేదు అనే స్వభావాన్ని మానసిక చింతన చేస్తూ జీవించాలని అనుకునేవారు మాత్రమే) అని చెప్పినట్టు “ఈ ఆత్మ చేత చేయతగినది ఏదియూ లేదు, ఆ సర్వేశ్వరుడే నియంత్రించువాడు” అని జ్ఞప్తి చేసుకొని ఉపాయ ప్రవృత్తిని త్యజించి ప్రపన్నుల యొక్క కైంకర్యరూపమున ఈ రెండూ(శేషత్వ, భోక్తృత్వములు) భగవానుని ఆనందమునే అనుసరించువారు తక్కినవి విడిచిపెట్టును.

శ్రీభాష్యములో చెప్పినట్టు “పరగత అతిశయ ఆధానేచ్ఛయా ఉపాదేయత్వమేవ యస్య స్వరూపమ్ స శేషః పరశ్శేషి” (పరుని ఆనందము కోసమే ఏది ఉన్నదో అది శేషభూతమైనది) ఆత్మ యొక్క కోరికను బట్టి వచ్చు నిర్బంధమును తొలగించునది శేషత్వము.

ఇప్పుడు భోక్తృత్వము అనేది స్వనిర్బంధమును తొలగించుట అనగా పారతంత్య్రము, భోగ్యతలే ఆత్మ యొక్క స్వరూపమనే జ్ఞానము కలిగిన వాడికి ఈ భోక్తృత్వము తన యొక్క భోగమునకు కాకుండా ఆ భగవానుని ఆనందము కొరకు ఉండుట.

నంపిళ్ళై గారు చెప్పినట్టు “ఆనన్దమ్ అవన్ ప్రీతియైత్ తుళిర్ ఎళుప్ప” (ఆత్మ యొక్క భోక్తృత్వము ఆ సర్వేశ్వరుని ప్రీతిని పెంపొందించేది). అందుచేతనే తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్టు “అహం అన్నమ్ అహం అన్నమ్”(నేను అనుభవించాలి, నేను భగవానునిచే అనుభవింపబడాలి) అని ఆత్మ యొక్క భోగ్యతను తెలిపి “అహమన్నాదః అహమన్నాదః” (నేను అనుభవించుచున్నాను, నేను భగవానుని అనుభవించుచున్నాను) అని ఆత్మ యొక్క భోక్తృత్వమును కూడా తెలుపబడినది. ఇలా కాకుండా ఉన్నప్పుడు ఆ సర్వేశ్వరుని ఆనందకరమైన(ప్రీతికరమైన) చర్య చేతనునితో ఉన్నట్టు ఉండదు. వీటన్నంటిని తీసుకుని “వృత్తియిల్ స్వనిర్బంధమ్ అఴుక్కుమ్” అని నాయనార్లు చెప్పినారు. (కైంకర్యమున స్వనిర్బంధమును తొలగించును).

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-25-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment