ఆచార్య హ్రుదయం – 26

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 25

అవతారిక
క్రియా మరియు వృత్తి అను పదములతో సూచింపబడు కర్మ మరియు కైంకర్యములలో ఏది ఇట్టి వారికి అనుగుణముగా ఉండునో ఇక్కడ వివరించుచున్నారు.

చూర్ణిక
కర్మ కైంకర్యజ్గళ్ సత్యాసత్య నిత్యానిత్య వర్ణదాస్యానుగుణజ్గళ్

సంక్షిప్త వివరణ
అసత్యము అనిత్యము అయిన వర్ణమునకు అనుగుణముగా ఉండునది “కర్మము” మరియు నిత్యము సత్యము అయిన దాస్యమునకు అనుగుణముగా ఉండునది “కైంకర్యము”

వ్యాఖ్యానము
అనగా – కర్మము అనిత్యము అసత్యము అయిన వర్ణమునకు అనుగుణముగా ఉండును. కైంకర్యము నిత్యము సత్యము అయిన దాస్యమునకు అనుగుణముగా ఉండును. వర్ణమును అసత్యము అని చెప్పుటకు గల కారణము ఏమి అనగా అది ఆత్మ యొక్క స్వరూపము కాకపోవుటచే ఎప్పుడూ ఒకేలా ఉండదు మరియు అది ఔపాదికము అసత్యము మరియు దేహము ఉన్నంతవరకే ఉండునది కావడము చేత. దాస్యమును సత్యము నిత్యము అని చెప్పుటకు గల కారణము ఏమి అనగా అది ఆత్మ యొక్క స్వరూపము అవ్వడము చేత ఎప్పుడూ ఒకేలా ఉండు ఆత్మ ఉన్నంతవరకు ఉండునది కావడము చేత. వర్ణానుగుణము – వర్ణముతో సంబంధము కలది, దాస్యనుగుణము – దాస్యముతో సంబంధమును కలది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-26-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment